
మార్కెట్లోకి యమహా ఎఫ్‌జెడ్ 25 బైక్
ధర రూ. 1.2 లక్షలు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం యమహా తాజాగా ఎఫ్‌జెడ్ 25 బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 250 సీసీ సామర్ధ్యం గల ఈ బైక్ ధర రూ. 1.2 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). దీన్ని ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసమే డిజైన్ చేశామని, డిమాండ్‌ను బట్టి ఇతర దేశాలకూ ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని భారత అమ్మకాల విభాగం ఎండీ మసాకి అసానో తెలిపారు. ఎఫ్‌జెడ్ 25 బైక్‌ల విక్రయాలు సుమారు 8,000–9,000 దాకా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
సంస్థ ప్రస్తుతం ప్రీమియం సెగ్మెంట్‌లో ఆర్15 బైక్‌లు ప్రతి నెలా 3,500 దాకా అమ్ముడవుతున్నట్లు వివరించారు. డీమోనిటైజేషన్‌వల్ల అమ్మకాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ.. మళ్లీ మెరుగుపడుతున్నాయని అసానో చెప్పారు. ఈ నెలాఖరు నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చన్నారు. గతేడాది తాము భారత మార్కెట్లో 7.86 లక్షల వాహనాలు విక్రయించగా.. ఈ ఏడాది 10 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు అసానో వివరించారు.