సాక్షి మెగా ఆటో షో ప్రారంభం నేడు | Start today to Sakshi the mega auto show | Sakshi
Sakshi News home page

సాక్షి మెగా ఆటో షో ప్రారంభం నేడు

Published Sat, Jul 26 2014 2:53 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

సాక్షి మెగా ఆటో షో ప్రారంభం నేడు - Sakshi

సాక్షి మెగా ఆటో షో ప్రారంభం నేడు

  • రెండు రోజులు నిర్వహణ
  •  ప్రఖ్యాత కంపెనీల ఉత్పాదనలన్నీ ఒకే చోట..
  •  కొలువు తీరనున్న మేటి సంస్థలు
  •  టూవీలర్స్, కార్ల కొనుగోలుకు సదవకాశం
  •  సందేహాల నివృత్తి చిటికెలో సాధ్యం
  • వెంకోజీపాలెం : ఇది ఆటోమొబైల్ యుగం.. వాహనం లేకపోతే అడుగైనా ముందుకు సాగని కాలం. గడప దాటాలంటే రెండో, నాలుగో చక్రాల బండి తప్పనిసరన్నమాటే. రోడ్డు మీద చీమల బారుల్లా తిరుగుతున్న వాహనాలను చూస్తేనే అర్ధమవుతుంది.. బండి లేక మనం అడుగైనా కదలలేమని.

    ఈ సంగతి అటుంచితే.. మన కళ్లెదురుగా ఎన్నో రకాల వాహనాలు.. టూ వీలర్లయినా, కార్లయినా.. వందల కొద్దీ విధాలు. జిహ్వకో రుచి అన్నట్టు ఎవరి ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, స్తోమతను బట్టి.. బోలెడు బళ్లు. కొందరికి షోగ్గా ఉండాలి.. మరి కొందరికి మైలేజీ కావాలి.. ఇంకొందరికి డ్రైవింగ్ ఈజీగా సాగాలి.. ఎంత బరువైనా ఓపిగ్గా మోసే మొండి బళ్లు కొందరికి కావాలి. ధర కాస్త తక్కువైతే మేలని కొందరంటే, స్టేటస్ సింబల్లా ఉండాలని ఇంకొందరంటారు. ఇన్ని టేస్టులకు తగ్గట్టే లేటెస్టుగా ఎన్నో వాహనాలు బజార్లోకి వస్తున్నాయి.

    అయితే అన్నిటినీ చూడడమెలా? మన అవసరానికి నప్పేది ఎంచుకోవడమెలా? ఎన్ని షోరూంలు తిరగ్గలం? ఎన్ని మోడళ్లు చూడగలం? టైం చాలదే.. ఆగండాగండి.. ఇలా అనుకుని దిగులు పడకండి.. మీ ఆలోచనల్ని, అవసరాల్ని మీ ఆత్మ ‘సాక్షి’ అర్ధం చేసుకుంది.. ఒకే చోట అన్ని కంపెనీల వాహనాలూ కొలువు తీరితే మీ శ్రమ తీరి కోరిక నెరవేరుతుందన్న సత్యాన్ని తెలుసుకుంది. అందుకే.. నగరంలో తొలిసారిగా భారీ ఎత్తున ప్రత్యేక రీతిలో మెగా ఆటో షోకు శ్రీకారం చుడుతోంది. ఆలస్యం ఇంకెందుకు.. పదండి వాహనాల కనువిందుకు..
     
    ఏర్పాట్లు పూర్తి : రెండురోజుల పాటు అట్టహాసంగా జరగనున్న  సాక్షి మెగా ఆటోషోకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. నగర వాసులను అలరించే ఈ మెగా షో శని,ఆదివారాలలో ఎంవీపీ కాలనీ డబల్‌రోడ్డులోని వుడా మైదానంలో జరగనుంది. రోజూ ఉదయం 10 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. అటు అన్ని అభిరుచులున్న కొనుగోలుదారులకు, ఇటు అనేక ఉత్పాదనలు అందుబాటులోకి తెచ్చే అమ్మకందారులకు మధ్య ఓ వారధిలా, అందరి అవసరాలు తీర్చే వేదికలా ఈ మెగా షో ఉపయోగపడుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే వాహనాలన్నీ అందుబాటులో ఉండడం వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది.

    సందేహాలకు సమాధానాలు : సాధారణంగా వాహనాలు కొనాలనుకునే వారికి ఎన్నో సందేహాలుంటాయి. అనుమానాలు తలెత్తుతాయి. వీటన్నిటికీ జవాబులు ‘సాక్షి’ మెగా షోలో లభిస్తాయి. నేరుగా అందరు విక్రేతలను ఇక్కడ కలుసుకోవచ్చు కాబట్టి, తక్కువ సమయంలోనే అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. అన్ని సంస్థల ప్రతినిధులు ఆయా వాహనాల ప్రత్యేకతలను ప్రత్యేకంగా మీకోసం వివరిస్తారు. అలాగే మరో సదవకాశం కూడా మీకోసం ఇక్కడ నిరీక్షిస్తోంది. ఇక్కడ ఏ వాహనం బుక్ చేసుకున్నా బంపర్ బహుమతి పొందే అవకాశం ఉంది. వాహనాలకు ఉచిత పొల్యూషన్ తనిఖీ, సర్వీసింగ్ కూడా అందుబాటులో ఉంటాయి.

    ఈ షోలో కంటిపూడి నిస్సాన్, లీలాకృష్ణ టయోటా,శ్రీ శ్రీనివాస యమహా, వరుణ్‌మారుతి, జయభేరి మారుతి, వరుణ్ బజాజ్, సుందరం హోండా, మహేంద్ర నిసాన్, విష్ణుహోండా, రెనాల్ట్ వైజాగ్, మ్యాంగో హ్యూండాయ్, శివశంకర్ మోటార్స్, ఆరంజ్ షెవర్లే,లక్ష్మీ హ్యూండాయ్,వైజాగ్ సుజుకి, శివశంకర్ టాటామోటార్స్, ఎస్‌వి పియాజియో మోటార్స్ సంస్థలు షోలో కొలువు తీరనున్నాయి.

    ఈ మెగా షోలో కార్లు, ఆటోలు, బైకులు ఈజీగా కొనుగోలు చేయొచ్చు. లక్కీడ్రా ద్వారా సుజుకి లెట్స్ ద్విచక్ర వాహనాన్ని బంపర్‌బహుమతిగా పొందవచ్చు. ఈ కార్యక్రమానికి రేడియో మిర్చి మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement