![Yamaha Introduced Electric Scooter - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/15/yamaha.jpg.webp?itok=MrYfitZh)
ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ బ్రాండ్ యమహా మెటార్ ఇండియా..తనకున్న యూత్ క్రేజ్‌ను అంతకంతకూ పటిష్టం చేసుకునేలా ఉత్పత్తుల్ని అందిస్తున్న విషయం విదితమే. ఇదే క్రమంలో గత ఏడాది ఆర్ 15వి4, ఆర్ 15ఎమ్ వంటి స్పోర్ట్స్ మోడల్స్‌ను, లిక్విడ్ కూల్ ఇంజన్‌తో ఎఇఆర్‌ఒఎక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్‌ను దేశీయంగా విడుదల చేసింది.
మరోవైపు దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఇవి)లకు సంబంధించి, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, భారతదేశంలోని యమహా కంపెనీ ఇంజనీర్లు జపాన్‌లోని యమహా హెడ్‌క్వార్టర్స్‌లోని బృందం సమన్వయంతో భారతీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌పై దృష్టి సారించారు. భారతీయ రైడింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా మా మోటార్ / బ్యాటరీ ప్రమాణాలపై మేం మళ్లీ పని చేయాల్సి ఉంటుంది.
భారతీయ సరఫరాదారులను ఉపయోగించడం ద్వారా అందుబాటులో ధర నిర్ణయించగలమని ఆశిస్తున్నామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లు ఎల్లప్పుడూ యమహాకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని ఇక్కడి 18–26 ఏళ్ల మధ్య ఉన్న అద్భుతమైన, స్టైలిష్ స్పోర్టీ మోటార్‌సైకిళ్లను ఇష్టపడే యువ కస్టమర్ల బలమైన ఆదరణతో తాము మార్కెట్‌ను విస్తరిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment