యమహా కొత్త స్పోర్టీ బైక్‌ లాంచ్‌ | yamaha Fazer 250 launched today, price and specifications | Sakshi
Sakshi News home page

యమహా కొత్త స్పోర్టీ బైక్‌ లాంచ్‌

Published Mon, Aug 21 2017 3:21 PM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM

yamaha Fazer 250  launched today,  price and specifications



ముంబై: యమహా ఇండియా కొత్త  బైక్‌ను ప్రారంభించింది. యమహా ఎప్‌జెఢ్‌ 25కి దగ్గరి పోలికలతోనే ఉన్నప్పటికీ కొంత మెరుగుపర్చి  కొత్త లుక్‌ లో దీన్ని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. స్పోర్ట్‌ లుక్స్‌తో  ‘ఫజర్ 250​’ ఈ కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఇంతకుముందు ఈ బైక్ అక్టోబర్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిసింది.

స్ప్లిట్ సీట్లు, అల్లాయ్ చక్రాలు, డిస్క్ బ్రేక్లు,  ఎల్‌ఈడీ  టెయిల్‌ లెట్స్‌ , రియర్‌ అండ్‌ వైడర్‌  ట్యూబ్లెస్ టైర్లు,  249సీసీ సింగిల్‌ సిలిండర్‌, 5 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ 20ఎంఎం గరిష్ట టార్క్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డైమండ్ ఫ్రేమ్ చట్రం, స్పీడోమీటర్  డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్‌ను కూడా అమర్చిన ఈ  యమహా ఫజెర్ 250 డబుల్‌ టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ముంబైలో దీని ధర రూ .1,28,335,( ఎక్స్ షో రూం)  ఢిల్లీ రూ .1,29,335( ఎక్స్ షో రూం) గా ను నిర్ణయించింది. 

కాగా ఈ ఏడాదిలో రెండవ బైక్‌ను యమహా లాంచ్‌ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌ లో బజాజ్ పల్సర్ ఆర్‌ఎస్‌200, హోండా సీబీఆర్‌,   కేటీఎం ఆర్‌సీ 200  మహీంద్రా మోజో, కావాసాకి జెడ్‌ 250, రాబోయే టీవీఎస్‌ అపాచే 310 వంటి వాటికి  గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement