సాక్షి,వెబ్‌డెస్క్: యమహా ఇండియా నియో రెట్రో కమ్యూటర్ కు చెందిన 149సీసీ యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్ విడుదలైంది. స్టైలిష్ లుక్‌తో ‘యమహా ఎఫ్-ఎక్స్’ ఈ బైక్ రెండు వేరియంట్లతో బైక్ లవర్స్‌ను అలరించనుంది.
ధర : రెండు వేరియంట్లలోఇది లభ్యం. ప్రారంభ ధర రూ.1,16,800గా ఉండగా, స్మార్ట్‌ఫోన్ సాయంతో కనెక్ట్ చేయగలిగే ఫీచర్ బైక్ ధర రూ.1,19,800గా కంపెనీ నిర్ణయించింది.
'వై కనెక్ట్' యాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన‍్లు, ఎస్‌ఎంస్ అలెర్ట్, బ్యాటరీ ఛార్జింగ్, ఇంధన వినియోగం, పనిచేయని పక్షంలో అలర్ట్స్ అలాగే పనితీరు, ఆయిల్ మార్చేలా సలహాలతో పాటు మరెన్నో ఫీచర్స్ ఈ బైక్ సొంతం.
ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్ -ఎక్స్ అమ్మకాలు జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇంజిన్ బాష్ ప్లేట్‌తో నిటారుగా రైడింగ్ పొజిషన్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్‌ఈడి టైలైట్లు,149 సీసీ ఇంజిన్, 7,250 ఆర్‌పీఎం వద్ద 12.4 పవర్‌ను అందిస్తుంది 500 ఆర్‌పిఎమ్ 13.3 ఎన్ఎమ్. ఫ్రేమ్ యమహా ఎఫ్ జెడ్ డిజైన్ లాగే ఉంది. ఇక దీని బరువు 139 కిలోలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment