Yamaha FZ 25
-
స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'
సాక్షి,వెబ్‌డెస్క్: యమహా ఇండియా నియో రెట్రో కమ్యూటర్ కు చెందిన 149సీసీ యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్ విడుదలైంది. స్టైలిష్ లుక్‌తో ‘యమహా ఎఫ్-ఎక్స్’ ఈ బైక్ రెండు వేరియంట్లతో బైక్ లవర్స్‌ను అలరించనుంది. ధర : రెండు వేరియంట్లలోఇది లభ్యం. ప్రారంభ ధర రూ.1,16,800గా ఉండగా, స్మార్ట్‌ఫోన్ సాయంతో కనెక్ట్ చేయగలిగే ఫీచర్ బైక్ ధర రూ.1,19,800గా కంపెనీ నిర్ణయించింది. 'వై కనెక్ట్' యాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లు, ఎస్ఎంస్ అలెర్ట్, బ్యాటరీ ఛార్జింగ్, ఇంధన వినియోగం, పనిచేయని పక్షంలో అలర్ట్స్ అలాగే పనితీరు, ఆయిల్ మార్చేలా సలహాలతో పాటు మరెన్నో ఫీచర్స్ ఈ బైక్ సొంతం. ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్ -ఎక్స్ అమ్మకాలు జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇంజిన్ బాష్ ప్లేట్‌తో నిటారుగా రైడింగ్ పొజిషన్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి టైలైట్లు,149 సీసీ ఇంజిన్, 7,250 ఆర్పీఎం వద్ద 12.4 పవర్‌ను అందిస్తుంది 500 ఆర్‌పిఎమ్ 13.3 ఎన్ఎమ్. ఫ్రేమ్ యమహా ఎఫ్ జెడ్ డిజైన్ లాగే ఉంది. ఇక దీని బరువు 139 కిలోలుగా ఉంది. చదవండి: Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 బైక్‌ల ఎక్స్‌షోరూమ్ ధరలను భారీగా తగ్గించింది. ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 ధరలు వరుసగా రూ.19.300, రూ.18.800(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు రూ.1,39,300, రూ.1,34,800గా ఉన్నాయి. యమహా మోటార్ భారతదేశంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గతంలో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఎఫ్జెడ్ఎస్ 25 రూ.1,58,600, ఎఫ్‌జెడ్ 25 రూ.1,53,600గా ఉండేవి. "ఈ మధ్యకాలంలో ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరగడంతో బైక్ ధరలను పెంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ ధరలు పెరిగినట్లు సంస్థ తెలిపింది. చివరకు ఈ ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా బైక్ ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. అత్యంత ప్రజాదరణ గల ఎఫ్‌జెడ్ 25 సిరీస్ ధరలను తగ్గించడం ద్వారా అంతా మొత్తం మా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని అందించాలనుకున్నట్లు జపనీస్ ద్విచక్ర వాహన మేజర్ చెప్పారు. తగ్గించిన బైక్ ధరలు నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ షో రూమ్ లకు వర్తిస్తాయని పేర్కొంది. ధర తగ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అవే ఉంటాయని స్పష్టం చేసింది. చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ -
యమహా కొత్త ఎఫ్‌జెడ్.. ధరెంతో తెలుసా?
యువత మనసును ఎక్కువగా ఆకట్టుకున్న యమహా తన లేటెస్ట్ ఎఫ్‌జెడ్ బైక్‌ను మంగళవారం గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఎఫ్‌జెడ్ 25 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.1,19,500గా ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎఫ్‌జెడ్ వెర్షన్ 2.0 కంటే ఇది పెద్దది, అత్యంత శక్తివంతమైనది. యమహా పాపులర్ మోడల్స్ ఆర్15, యమహా ఆర్3 బైకులకు ఆఫర్ చేసే ధరల మధ్యలోనే దీన్ని ధరను కూడా ఉంచడం విశేషం. 249 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీ, 5 స్పీడ్ గేర్ బాక్స్ దీనిలో ప్రత్యేకతలు. 6000 ఆర్పీఎం వద్ద 20 ఎన్ఎం టర్క్‌ను ఇది ఉత్పత్తిచేస్తోంది. 795 ఎంఎం ఎత్తుతో సౌకర్యవంతమైన సీటును ఇది కలిగి ఉంది. ఫ్యూయల్ ట్యాంకు కెపాసిటీ 14 లీటర్లు. ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. నైట్ బ్లాక్, బాలిస్టిక్ బ్లూ, వారియర్ వైట్ రంగుల్లో ఇది లభ్యం కానుంది.