
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన ఎఫ్‌జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 బైక్‌ల ఎక్స్‌షోరూమ్ ధరలను భారీగా తగ్గించింది. ఎఫ్‌జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 ధరలు వరుసగా రూ.19.300, రూ.18.800(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ఎఫ్‌జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు రూ.1,39,300, రూ.1,34,800గా ఉన్నాయి. యమహా మోటార్ భారతదేశంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గతంలో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఎఫ్‌జెడ్ఎస్ 25 రూ.1,58,600, ఎఫ్‌జెడ్ 25 రూ.1,53,600గా ఉండేవి.
"ఈ మధ్యకాలంలో ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరగడంతో బైక్ ధరలను పెంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ ధరలు పెరిగినట్లు సంస్థ తెలిపింది. చివరకు ఈ ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా బైక్ ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. అత్యంత ప్రజాదరణ గల ఎఫ్‌జెడ్ 25 సిరీస్ ధరలను తగ్గించడం ద్వారా అంతా మొత్తం మా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని అందించాలనుకున్నట్లు జపనీస్ ద్విచక్ర వాహన మేజర్ చెప్పారు. తగ్గించిన బైక్ ధరలు నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ షో రూమ్ లకు వర్తిస్తాయని పేర్కొంది. ధర తగ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అవే ఉంటాయని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment