యమహా కొత్త ఎఫ్జెడ్.. ధరెంతో తెలుసా?
యమహా కొత్త ఎఫ్జెడ్.. ధరెంతో తెలుసా?
Published Tue, Jan 24 2017 2:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
యువత మనసును ఎక్కువగా ఆకట్టుకున్న యమహా తన లేటెస్ట్ ఎఫ్జెడ్ బైక్ను మంగళవారం గ్రాండ్గా రిలీజ్ చేసింది. ఎఫ్జెడ్ 25 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.1,19,500గా ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎఫ్జెడ్ వెర్షన్ 2.0 కంటే ఇది పెద్దది, అత్యంత శక్తివంతమైనది. యమహా పాపులర్ మోడల్స్ ఆర్15, యమహా ఆర్3 బైకులకు ఆఫర్ చేసే ధరల మధ్యలోనే దీన్ని ధరను కూడా ఉంచడం విశేషం.
249 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీ, 5 స్పీడ్ గేర్ బాక్స్ దీనిలో ప్రత్యేకతలు. 6000 ఆర్పీఎం వద్ద 20 ఎన్ఎం టర్క్ను ఇది ఉత్పత్తిచేస్తోంది. 795 ఎంఎం ఎత్తుతో సౌకర్యవంతమైన సీటును ఇది కలిగి ఉంది. ఫ్యూయల్ ట్యాంకు కెపాసిటీ 14 లీటర్లు. ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. నైట్ బ్లాక్, బాలిస్టిక్ బ్లూ, వారియర్ వైట్ రంగుల్లో ఇది లభ్యం కానుంది.
Advertisement
Advertisement