Yamaha Upcoming Bikes in India 2023 - Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే బైక్‌లు లాంచ్‌ చేసిన యమహా.. సూపర్‌ ఫీచర్స్‌!

Published Mon, Feb 13 2023 1:08 PM | Last Updated on Mon, Feb 13 2023 1:23 PM

Yamaha Launches New Bikes - Sakshi

యువత అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్‌, అధిక సీసీ బైక్‌లను తయారు చేస్తున్న యమహా మోటార్‌ ఇండియా కంపెనీ 150 సీసీ రేంజ్‌లో మరికొన్ని వర్షన్లను లాంచ్‌ చేసింది. యమహా ఆర్‌15 వీ4, ఎంటీ 15, ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ బైక్‌లను విడుదల చేసింది.  వీటి ప్రత్యేకతలు.. ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

  • మిగతా యమహా 150 సీసీ బైక్‌లకు ఉన్న ఇంజిన్‌ ప్రత్యేకతలన్నీ వీటికీ కొనసాగింపు.
  • బీఎస్‌6 నిబంధనలకు అనుగుణంగా కొత్తగా ఆన్‌బోర్డ్‌ డయాగ్నస్టిక్‌ డివైజ్‌(ఓబీడీ).
  • అ‍న్నింటికీ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌.
  • ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌లో 149 సీసీ ఎఫ్‌ఐ ఇంజిన్‌, ఎల్‌ఈడీ టర్న్‌ ఇండికేటర్లు, ఎస్సెమ్మెస్‌, ఈ-మెయిల్‌ అలర్ట్స్‌ వచ్చే డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌.
  • ఎంటీ 15లో అప్‌సైడ్‌ డౌన్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, డిజిటల్‌ ఎల్‌సీడీ మీటర్‌.
  • ఆర్‌15 వీ4లో ఏబీఎస్‌ డ్యుయల్‌ చానల్‌.
  • యమహా ఎంటీ 15 వీ5లో నాలుగు రంగులు. ధర రూ.1,68,400.
  • ఎఫ్‌జెడ్‌ఎస్‌ ఎఫ్‌ఐ వీ4 డీలక్స్‌ మూడు రంగులు. ధర రూ.1,27,400.
  • ఎఫ్‌జెడ్‌ ఎఫ్‌ఐ వీ3 డీలక్స్‌ రెండు రంగులు. ధర రూ.1,15,200.
  • ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ మూడు రంగులు. డాక్ట్‌ మ్యాటీ బ్లూ ధర రూ.1,36,900, మిగతా రెండింటి ధర రూ.1,35,900.
  • ఆర్‌15 వీ4 ఒకే రంగు. ధర రూ.1,93,900.
  • (ధరలన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రైజెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement