మహిళల ట్రిపుల్‌ రైడింగ్‌.. వీడియో వైరల్‌ | Three Womens Wearing Sarees Rides Yamaha R15 | Sakshi
Sakshi News home page

మహిళల ట్రిపుల్‌ రైడింగ్‌.. వీడియో వైరల్‌

Published Sat, Dec 2 2017 8:27 PM | Last Updated on Sat, Dec 2 2017 8:27 PM

Three Womens Wearing Sarees Rides Yamaha R15 - Sakshi

హైదరాబాద్‌: ముగ్గురు మహిళలు ఒకే బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. యమహా ఆర్‌15 బైక్‌పై సాధారణంగా డైవర్‌తోపాటూ మరో వ్యక్తి కూర్చుంటే మూడో వ్యక్తి కూర్చోవడం చాలా కష్టం. అలాంటిది ఓ మహిళ చీర కట్టుకుని మరీ, మరో ఇద్దరు మహిళలను వెనకాల కూర్చోపెట్టుకొని నడిపింది. హైవే పై.. రై రై అంటూ ఎంచక్కా రైడింగ్‌ చేస్తుండగా పక్కనే కార్లో వెళుతున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అవుతోంది. కార్లోని వ్యక్తి ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న మహిళల బైక్‌ దగ్గరకు రాగానే, ఆంటీ మీరు చరిత్ర సృష్టిస్తున్నారూ.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

మహిళలు యమహా ఆర్‌15 వంటి బైక్‌లను నడపడం చూస్తుంటే.. మహిళలు అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, హెల్మెట్‌ లేకుండా, ట్రిపుల్‌ రైడింగ్‌, నెంబర్‌ ప్లేట్‌ కూడా లేకుండా బైక్‌ రైడ్‌ చేయడం రూల్స్‌ అతిక్రమించడమే అంటూ మరికొందరు రియాక్ట్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement