నగరవాసికి ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ ఉల్లంఘనలు, ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్‌జాంలు తప్పట్లేదు. వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ విభాగం సిబ్బంది కెమెరాలు, ట్యాబ్‌లు చేతపట్టి ఈ–చలాన్లకే పరిమితమవుతున్నారు. చౌరస్తాలతో పాటు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటూ ఈ డ్రైవ్స్ చేస్తున్నారు.
దీంతో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ఉల్లంఘనులు రెచ్చిపోతున్నారు. రహదారులపై దూసుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచి్చపెట్టేవి.
ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్.. ఇలా ఇవన్నీ మూడో కేటగిరీ కిందికి వస్తాయి. రాజధానిలో మూడో కేటగిరీకి చెందిన ఉల్లంఘనలే ఎక్కువగా ఉంటున్నాయి. రెండోసారి సిటీ కొత్వాల్‌గా వచ్చిన సీవీ ఆనంద్‌కు ట్రాఫిక్ విభాగంపై మంచి పట్టుంది. గతంలో సుదీర్ఘకాలం సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన వేసుకున్న మార్కు ఇప్పటికీ పదిలమే. సైబరాబాద్, హైదరాబాద్ సీపీలుగా పని చేసినప్పుడూ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ట్రాఫిక్‌పై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment