signal jumping
-
కొత్వాల్ సాబ్ జర దేఖో!
నగరవాసికి ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ ఉల్లంఘనలు, ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్‌జాంలు తప్పట్లేదు. వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ విభాగం సిబ్బంది కెమెరాలు, ట్యాబ్‌లు చేతపట్టి ఈ–చలాన్లకే పరిమితమవుతున్నారు. చౌరస్తాలతో పాటు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటూ ఈ డ్రైవ్స్ చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ఉల్లంఘనులు రెచ్చిపోతున్నారు. రహదారులపై దూసుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచి్చపెట్టేవి. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్.. ఇలా ఇవన్నీ మూడో కేటగిరీ కిందికి వస్తాయి. రాజధానిలో మూడో కేటగిరీకి చెందిన ఉల్లంఘనలే ఎక్కువగా ఉంటున్నాయి. రెండోసారి సిటీ కొత్వాల్‌గా వచ్చిన సీవీ ఆనంద్‌కు ట్రాఫిక్ విభాగంపై మంచి పట్టుంది. గతంలో సుదీర్ఘకాలం సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన వేసుకున్న మార్కు ఇప్పటికీ పదిలమే. సైబరాబాద్, హైదరాబాద్ సీపీలుగా పని చేసినప్పుడూ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ట్రాఫిక్‌పై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
వాహనదారులూ బీ అలర్ట్: కొంపముంచుతోంది అదే!
ప్రతీ రోజు దేశం నలుమూలల్లో చోటుచేసుకునే అనేక వాహన ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. స్వయం కృతాపరాధంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంఘటనలు కలిచి వేస్తాయి. డ్రైవింగ్‌పై క్రేజ్ తో స్పీడ్‌గా వెళ్లడం థ్రిల్ కావచ్చు, కానీ అది ప్రమాదకరం. మన ప్రాణాలకే కాదు ఇతరులకు కూడా. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూసే ఓపిక లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్లు ఉపయోగించడం ఈ రోజుల్లో సాధారణమై పోయింది. ‘‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’’ అనే మాటల్ని తాజా ప్రభుత్వ ఒక సంచలన నివేదిక మరోసారి గుర్తు చేసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022” నివేదిక ప్రకారం, భారతదేశంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా 2022 నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకు 122 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. 1970 నుంచి ఇదే అత్యధిక రేటు దేశవ్యాప్తంగా ప్రమాదాలు , మరణాల వెనుక అతివేగం ప్రధాన కారణాలలో ఒకటిగా తేలింది. 2022లో 11.9శాతం పెరిగి 4,లక్షల 61వేల 312 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2021లో వీటి సంఖ్య 4 లక్షల 12వేల 432గా ఉంది. 1 లక్షా 68వేల 491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 43వేల 366 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే మరణాలు 9.4 శాతం ఎగిసి క్షతగాత్రుల సంఖ్య 15.3శాతం పెరిగింది. 2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలకు దారితీసిన కారణాల్లో అతివేగంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2022లో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అతివేగం కారణంగా 71.2 శాతం మంది మరణించారు, ఆ తర్వాత స్థానం రాంగ్ సైడ్ డ్రైవింగ్ది (5.4శాతం) అని నివేదిక పేర్కొంది. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10వేల ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అంతేకాదు రెడ్‌సిగ్నల్ జంప్ వల్ల యాక్సిడెంట్లు గణనీయంగా పెరిగాయి. 2021లో ఇవి 2,203గా ఉంటే 2022లో 82.55 శాతం పెరిగి 4,021 ప్రమాదాలు నమోదైనాయి. 2022లో హెల్మెట్ ధరించని బైక్ ప్రమాదాల్లో 50వేల మంది మరణించారు. వీరిలో 71.3 శాతం మంది ( 35,692) డ్రైవర్లు, 14,337 (28.7శాతం) వెనుక కూర్చున్న వారు అని నివేదిక పేర్కొంది. -
సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
న్యూఢిల్లీ: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. -
‘జంపింగ్’ బాబులు జడుసుకునే వార్త
న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా సిగ్నల్ జంప్ చేసే వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జంపింగ్ బాబులు జడుసుకునే వార్త కేంద్రం తాజాగా వెల్లడించింది. రెడ్‌లైట్ జంపింగ్ కారణంగా రోడ్డు ప్రమాద మరణాలు 2019తో పోలిస్తే 2020లో 79 శాతం పెరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020' నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2020లో 919 ప్రమాదాలు సంభవించగా.. 476 మంది మృతి చెందారు. 2019లో 266 మంది దుర్మరణం పాలయ్యారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా 2020లో 3,099 మంది ప్రాణాలు కోల్పోగా.. 2019లో 2,726 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురై 2020లో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో 2376 మరణాలు నమోదయ్యాయి. మితిమీరిన వేగమే అత్యధిక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 1,31,714 మంది మరణించగా.. 3,48,279 మంది క్షతగాత్రులయ్యారు. అయితే 2019తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 18 శాతం, మరణాల రేటు 12.8 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో 18-45 ఏళ్ల వయస్సు గల యువకులే 69 శాతం మంది ఉండగా.. మొత్తం మరణాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వర్కింగ్ వయసులో ఉన్నవారు 87.4 శాతం మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడానికి కోవిడ్-19 లాక్డౌన్ కారణమని నివేదిక వెల్లడించింది. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడం వల్ల కూడా దుర్ఘటనలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశంలో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి దుర్ఘటనల్లో మరణించిన ప్రతి 10 మందిలో ఒకరు మనదేశానికి చెందినవారు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. (క్లిక్: బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం) 2018లో స్వల్పంగా(0.46 శాతం) పెరగడం మినహా 2016 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. వరుసగా రెండో ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడం కొంతలో కొంత ఊరట. అదేవిధంగా, గాయపడిన వారి సంఖ్య కూడా 2015 నుండి తగ్గుతూ వస్తోంది. (క్లిక్: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి) -
భాయ్... జర దేఖ్‌కె చలో..
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ జంక్షన్ల వద్ద రెడ్‌లైట్ ఉండగానే రయ్యిమని దూసుకెళ్లే వాహనచోదకులు...ఇప్పుడు అలా వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అనుకునే వారిని ‘సీసీటీవీ’ కెమెరాలు హడలెత్తిస్తున్నాయి. ఆటోమేటిక్ రెడ్‌లైట్ కెమెరా, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆపరేట్ చేసే స్పీడ్ లేజర్ గన్లు, డిజిటల్ కెమెరా, ట్యాబ్‌లు ట్రాఫిక్ ఉల్లంఘనుల పట్ల తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫలితంగా నేరుగా ఇంటికే ఈ చలాన్లు అందుతున్నాయి. 15 రోజుల్లో ఫైన్ కట్టకపోతే లీగల్ నోటీసులు, అయినా స్పందించకపోతే చార్జిషీట్ దాఖలవుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘనుల సంఖ్య గతేడాది 12,034 కాగా, ఈ ఏడాది 11,423కు తగ్గిందక?్షవదుకు జంక్షన్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కెమెరాల ప్రభావమే కారణంగా గుర్తించారు. ‘స్పీడ్’ పట్టుకుంటున్నా తగ్గని వేగం... ఔటర్ రింగ్ రోడ్డులో వాహన వేగం పరిమితిపై సూచన బోర్డులు కనిపిస్తాయి. ఉదహరణకు 40 కి లోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళితే ఈ స్పీడ్ లేజర్ గన్లు ఇట్టే పసిగడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 1,19,933 మందికి ఈ చలా న్లు జారీ అయ్యాయి. గతేడాది పరిమితికి మించి వేగంతో వెళ్లిన వారు రాచకొండ పరిధిలోని ఓఆర్ఆర్లో 45,212 మంది ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య ఏకంగా 1,19,933కు పెరగడం గమ నార్హం. అతివేగం కారణంగా ఓఆర్ఆర్లో ఈ ఏ డా ది 34 రోడ్డు ప్రమాదాలు జరగగా 20 మంది దు ర్మరణం పాలయ్యారు. 34 మంది గాయపడ్డా రు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. జంపింగ్ ఈ ప్రాంతాల్లోనే... ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో సిగ్నల్ జంపింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి తార్నాక వచ్చే మార్గంలో రాంగ్ సైడ్ డ్రై వింగ్ చేస్తూ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. జంక్షన్లతో పాటు రోడ్డుపై నో పార్కింగ్ జోన్లో నిలిపిన వాహనాలను కానిస్టేబుళ్లు కెమెరాలో బంధించి...ఆ ఫొటోలను ఆయా పోలీసు స్టేషన్ల నుంచి అప్లోడ్ చేసి ఈ చలాన్‌కు పంపుతున్నారు. ఈ ఏడాది 7,93,441 ఈ–చలాన్లు జారీ చేయగా, వీటిలో ఎక్కువగా రాంగ్‌సైడ్ డ్రై వింగ్, నో పార్కింగ్ జోన్లో ఉన్న వాహన కేసులే ఉన్నాయి. ఒకప్పుడు 80 శాతం వరకు ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తే, 20 శాతం టెక్నాలజీని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు 80 శాతం టెక్నాలజీతోనే పనులు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే వాహనదారుల్లోనే మార్పురావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. -
జంక్షన్లో జంప్!
సాక్షి, సిటీబ్యూరో: ఆటోలు యమవేగంతో నడుపుతూ.. ట్రాఫిక్ జంక్షన్లలో సిగ్నల్స్ జంప్ చేస్తూ.. ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పువాటిల్లేలా వ్యవహరిస్తున్న ఆటోవాలాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రధానమైన రోడ్లు, జంక్షన్లలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారని, డ్రైవింగ్‌తో భయపెడుతన్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తుండటంతో వివిధ ప్రాంతాల్లో ‘ఆటోల స్పెషల్ డ్రైవ్’ నిర్వహిస్తున్నారు. ఒక్క జూలై నెలలోనే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ఆటోవాలాలపై మాదాపూర్‌లో 1018, గచ్చిబౌలిలో 757, కూకట్‌పల్లిలో 637, మియాపూర్‌లో 497, బాలానగర్‌లో 444 కేసులు నమోదు చేశారు. ఎక్కువగా ప్రమాదకరంగా వాహనాలను నడపడం, ఆటోల్లో ఓవర్ లోడ్‌ను తరలించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పైలటింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ తదితర కేసులు నమోదు చేశారు. వారికి జరిమానా విధించడంతో రోడ్డుపై ఆటోలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై వివరిస్తున్నారు. ఆ నాలుగు రూట్లలో స్పెషల్ డ్రైవ్.. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ఆటోడ్రైవర్లపై కొరడా ఝళిపించేందుకు బీహెచ్ఈఎల్– ఆల్విన్ జంక్షన్, కూకట్పల్లి, ఆల్విన్ జంక్షన్ –కొత్తగూడ– బొటానికల్– గచ్చిబౌలి, జేఎన్టీయూ– సైబర్ టవర్స్ – రహేజా మైండ్ స్పేస్– బయో డైవర్సిటీ జంక్షన్లతో పాటు బాలానగర్‌లో ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో జూలై నెలలో డ్రైవ్ నిర్వహించి 3,353 మంది ఆటోవాలాలపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలిసినా తొందరగా వెళ్లాలన్న ఆతృతను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 8500411111 ఫోన్ లేదా వాట్సప్ చేయాలని సూచించారు. -
ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు
గోవిందరావుపేట : ఒకే నంబర్‌తో పల్సర్ టూవీలర్ బండ్లు రెండు కనిపించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే చల్వాయికి చెందిన సాయబోయిన భిక్షపతి, మోహన్ అన్నదమ్ములు. భిక్షపతి హన్మకొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్దే ఉంటున్న తమ్ముడికి బైక్ కొని ఇచ్చాడు. మోహన్ భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకోగా అతనికి టీఎస్ 25 0468 నెంబర్‌ను కేటాయించారు. ఈ క్రమంలో అదే నెంబర్‌పై హైదరాబాద్‌లో ఓ బ్లాక్పల్సర్ బండిపై మరో వ్యక్తి తిరుగుతున్నాడు. గత 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు బండి విషయంలో తప్పులు దొర్లడంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆదారంగా అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తూ ఆ నెంబర్‌పై రిజిస్ట్రేషన్‌లో ఉన్న మోహన్ సెల్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో అన్నయ్య భిక్షపతికి తెలుపగా ఆన్లైన్లో చూశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో హెల్మెట్ లేకుండా, నీలోఫర్ ఆస్పత్రి ఎదుట రెండు రోజుల పాటు నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపినందుకు రెండు సార్లు జరిమానాలు విధిస్తున్నట్లు కనిపించింది. దీంతో అవాక్కయిన మోహన్ జరిగిన విషయాలను పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
డబ్బుందన్న పొగరు.. సిగ్నల్ జంప్ చేయడంతో!
కీవ్ : ఉక్రెయిన్‌లో ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ మైనర్ సహా ఆరుగురు మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన యువతిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మూడు రోజుల కస్టడీలో నిందితురాలు ఉన్నట్లు సమాచారం. దోషిగా తెలితే యువతికి దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ వివరాలిలా.. ఉక్రెయిన్‌లో ధనవంతుల్లో వాసిలీ జైస్టేవ్ ఒకరు. వాసిలీకి కూతురు అల్యోనా జైస్టేవ్(20) ఉంది. అయితే స్థానిక కార్కివ్ వీధుల్లో అత్యంత విలాసవంతమైన కార్లలో ఆమె షికార్లు కొట్టేది. ఈ క్రమంలో ఇటీవల కార్కివ్ రోడ్లపై వెళ్తుండగా రెడ్ సిగ్నల్ పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అల్యోనా తన కారును రయ్ మంటూ ముందుకు పోనిచ్చింది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారేమోనని వేగంగా కారు నడిపింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న పాదచారులపైకి ఆమె కారు దూసుకెళ్లడంతో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఓ మైనర్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తీవ్ర ఆవేశంతో కారుపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. అయితే ఆమె వెనుక వాహనంలో వస్తున్న బాడీగార్డులు అల్‌యోనాను ప్రాణాపాయం నుంచి తప్పించారు. కానీ చేసిన తప్పిదానికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో అల్యోనా మద్యం సేవించి లేదని విచారణలో తేలింది. ఆరుగురి మృతికి కారకురాలు కావడంతో పాటు ఓ ఏడు నెలల గర్భిణిని తీవ్ర గాయాలపాలు చేసిన నిందితురాలికి పదేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్ ఉందని ఓ సీనియర్ పోలీసు తెలిపారు. డబ్బుందన్న పొగరుతో అల్యోనా నిర్లక్ష్యంగా వాహనం నడిపిందని బాధితుల బంధువులు, స్థానికులు ఆరోపించారు. -
తాగి బండి నడిపితే.. 25వేల జరిమానా!!
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అయ్యేవాళ్ల మీద కొరడా ఝళిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకమీదట ఎవరైనా తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ. 25వేల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష లేదా రెండూ, వాటితో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంటుంది. అదే రెండోసారి అయితే 50వేల రూపాయల జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష, లేదా రెండూ, వాటితో పాటు ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధిస్తారు. మూడోసారి కూడా అలా పట్టుబడ్డారో.. ఇక లైసెన్సును శాశ్వతంగా రద్దుచేయడంతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. మోటారువాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్తగా మార్పుచేర్పులు చేస్తోంది. స్కూలు బస్సు డ్రైవర్లు తాగి పట్టుబడితే వారికి రూ. 50వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. దాంతోపాటు తక్షణం వాళ్ల లైసెన్సు రద్దుచేస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల మీద కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రమాదాల్లో ఎవరైనా చిన్నపిల్లల మృతికి కారణమైతే వాళ్లకు రూ. 3లక్షల జరిమానా, కనీసం ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని తలపెట్టింది. వాహనాన్ని సురక్షితం కాని పరిస్థితుల్లో ఉపయోగిస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష లేదా రెండూ విధించొచ్చట. ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే.. రూ. 15వేల జరిమానా, లైసెన్సు నెలరోజుల పాటు సస్పెన్షన్, తప్పనిసరి శిక్షణ ఉండాలట. -
రూ.1000 చలానాలపై హైకోర్టులో పిటిషన్లు
సాక్షి, సిటీబ్యూరో : సిగ్నల్ జంపింగ్, రోడ్లపై వాహనాల నిలి పివేత తదితర ఉల్లంఘన నేరాల్లో వాహనదారులకు రూ.1000 జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చలానాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. ఉల్లంఘనల జరిమానాను రూ. వంద నుంచి రూ. వెయ్యికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని న్యూ తెలంగాణ ఆటో డ్రైవర్ల ట్రేడ్ యూనియన్ ప్రతినిధి ఎ.రవి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. సిటీలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పా ట్లు చేయడంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని, ఆటోడ్రైవర్లు, ఇతర వాహనదారులు విధిలేని పరిస్థితుల్లో రోడ్లపైనే వాహనాలను నిలపాల్చి వస్తోందని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు వాహనదారులకు విధించే జరిమానాను రూ.1000కి పెంచుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరించాలని కోరారు. ఇదే విషయమై టీడీపీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో పిల్ దాఖలు చేశారు. -
ట్రాఫిక్ నిబంధనలు పై భారిగా జరిమానా
-
ట్రాఫిక్ సిగ్నల్ ‘జంపింగ్’తో జేబు గుల్లే!
సాక్షి, హైదరాబాద్: ఏం కాదులే అని సిగ్నల్ జంపింగ్ చేసేస్తున్నారా? బైక్ నడుపుతూ ఫోన్లు మాట్లాడేస్తున్నారా? రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసేస్తున్నారా? ఇకపై అలా చేస్తే.. జేబుకు భారీగానే చిల్లు పడుతుంది. ఈ నెల 12 నుంచి సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై 2011 జీవో ఆధారంగా రూ.1,000 చొప్పున భారీ జరిమానాలు విధించనున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) అమిత్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ పోలీసుల కోణంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ముఖ్యంగా మూడు రకాలు... వాహన చోదకుడికి ప్రమాదకరమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. వీటిలో అన్నింటికంటే చివరి అంశానికి సంబంధించినవి నిరోధించడానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నాలుగు రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు అమిత్ గార్గ్ తెలిపారు. సైబరాబాద్ పోలీసులు గత నెల నుంచే ఈ విధానాన్ని అమల్లో పెట్టారు. ఇతర ఉల్లంఘనల కంటే మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, అక్రమ పార్కింగ్ అత్యంత ప్రమాదకరమైనవని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీటికి పాల్పడేది ఎక్కువగా యువత కావడంతో వారు ప్రమాదాలబారిన పడి.. బంగ రు భవిష్యత్తును పాడుచేసుకోవడంతోపాటు తల్లిదండ్రులకూ గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు కోర్టులో హాజరుపరిచి, జైలు శిక్షలు సైతం పడేలా చేస్తున్నారు. ఇప్పుడు పైవాటిపై దృష్టి పెట్టారు. ఏమిటా జీవో? తక్కువస్థాయిలో ఉన్న జరిమానా మొత్తాలకు ఉల్లంఘనులు భయపడట్లేదని, ఈ మొత్తాలను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని గతంలో అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఆధారంగా 18 అంశాలకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలు పెంచుతూ అదే ఏడాది ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో నం. 108ను విడుదల చేసింది. దీనిపై విమర్శలు రావడంతో అమలును అనధికారికంగా నిలిపివేశారు. ఇప్పుడా జీవో దుమ్ము దులిపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పై నాలుగు అంశాల విషయంలో అమలుకు నిర్ణయించారు. -
ఉల్లంఘిస్తే..కట్టాల్సిందే!
హైదరాబాద్: మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే..అంతకు మించి జరిమానా కట్టాల్సిందే అంటున్నారు పోలీస్ బాస్‌లు. ఇంకా సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్ రాయుళ్లు భారీగా జరిమానా చెల్లించాల్సిందేనంటూ తాజాగా పోలీస్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి బుధవారం సమావేశమైన పోలీస్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్., ఓవరలోడ్, రాంగ్ పార్కింగ్‌లకు రూ.1000లు చెల్లించాలంటూ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పమస్య తీవ్రం కావడంతో పాదచారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.