సిగ్నల్ జంపింగ్, రోడ్లపై వాహనాల నిలి పివేత తదితర ఉల్లంఘన నేరాల్లో వాహనదారులకు రూ.1000 జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చలానాలను సవాలు....
సాక్షి, సిటీబ్యూరో : సిగ్నల్ జంపింగ్, రోడ్లపై వాహనాల నిలి పివేత తదితర ఉల్లంఘన నేరాల్లో వాహనదారులకు రూ.1000 జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చలానాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. ఉల్లంఘనల జరిమానాను రూ. వంద నుంచి రూ. వెయ్యికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని న్యూ తెలంగాణ ఆటో డ్రైవర్ల ట్రేడ్ యూనియన్ ప్రతినిధి ఎ.రవి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
సిటీలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పా ట్లు చేయడంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని, ఆటోడ్రైవర్లు, ఇతర వాహనదారులు విధిలేని పరిస్థితుల్లో రోడ్లపైనే వాహనాలను నిలపాల్చి వస్తోందని పిటిషనర్ తన పిల్‌లో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు వాహనదారులకు విధించే జరిమానాను రూ.1000కి పెంచుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరించాలని కోరారు. ఇదే విషయమై టీడీపీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో పిల్ దాఖలు చేశారు.