హైదరాబాద్: మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే..అంతకు మించి జరిమానా కట్టాల్సిందే అంటున్నారు పోలీస్ బాస్‌లు. ఇంకా సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్ రాయుళ్లు భారీగా జరిమానా చెల్లించాల్సిందేనంటూ తాజాగా పోలీస్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి బుధవారం సమావేశమైన పోలీస్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్., ఓవరలోడ్, రాంగ్ పార్కింగ్‌లకు రూ.1000లు చెల్లించాలంటూ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పమస్య తీవ్రం కావడంతో పాదచారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.