cell phone driving
-
ప్రాణాలతో సెల్‌గాటం..!
విజయనగరం: వైపు పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, ఏమరుపాటుగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని, మీ భద్రత.. మీ చేతిలోనే ఉందంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. కొందరు వాహనచోదకుల్లో మార్పు రావడంలేదనేందుకు విజయనగరం పట్టణం పరిసరాల్లో శుక్రవారం ‘సాక్షి’కి చిక్కిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నవారిని చిత్రాల్లో చూడొచ్చు. -
సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
న్యూఢిల్లీ: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. -
ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది!
సత్తెనపల్లి: ఆటో డ్రైవరు సెల్‌ఫోన్ నిర్వాకం తొమ్మిది మంది ప్రయాణికులను ఆస్పత్రి పాల్జేసింది. సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఆవుల బాలకృష్ణ కథనం మేరకు సోమవారం బెల్లంకొండ నుంచి పది మంది ప్రయాణీకుల తో సత్తెనపల్లి వస్తున్న ఆటో వెన్నాదేవి వద్దకు రాగానే ఆటోడ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. సదరు ఫోన్ మాట్లాడే క్రమంలో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌లోడు ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణీకుల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
మీరిక మారరా... డ్రైవింగ్‌లో సెల్ ఫోన్.. త్రిబుల్స్ వద్దన్నా.. వినరా
-
6 నెలలు.. 7082 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు
సాక్షి, సిటీబ్యూరో: వాహనదారులు రోడ్లపై రయ్యుమంటూ దూసుకెళ్లడమే కాదు... డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ రింగ్ కాగానే రిసీవ్ చేసుకొని మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గడచిన ఆరు నెలల్లో 60కిపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే వాహనదారులు నిర్లక్ష్యం ఏ తీరులో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 272 వద్ద సెల్‌ఫోన్ మాట్లాడుతున్న లారీడ్రైవర్ టర్నింగ్ చేసే సమయంలో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుద్దింది. లారీ ఆగకుండా ముందుకెళ్లడంతో టైర్ల కింద పడి ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటు చేసుకోవడంతో సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూనే... వివిధ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులను జాగృతం చేస్తున్నారు. 6 నెలలు.. 7082 కేసులు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 7082 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో ఉన్న సీసీ టీవీ కెమెరాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు క్లిక్‌మనిపించిన కెమెరాలతో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ. వెయ్యి జరిమానాను ఈ–చలాన్ ద్వారా పంపిస్తున్నారు. ఇక పోలీసులు వివిధ సందర్భాల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చార్జిషీట్ రూపొందించి కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఆయా కోర్టులు వారికి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రెండు రోజుల జైలు శిక్షను కూడా విధిస్తున్నాయి. ‘‘సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అది మీ ప్రాణాలకే కాదు ఎదుటివారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అత్యవరమైతే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముంది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’’ అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. -
బుకాయిస్తే బుక్కయిపోతారు!
సాక్షి, విశాఖపట్నం: సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారెందరో ఉన్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్న వారూ ఉన్నారు. ఇలా పలు సందర్భాల్లో నడిపే వారితో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ఇలాంటి వాటిని ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతోంది. బస్సు నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడడాన్ని పూర్తిగా నిషేధించింది. ఎవరూ చూడడం లేదని, ఫిర్యాదు చేసినా ఏమీ కాదనుకుని బస్ నడిపే సమయంలో ఫోన్లో మాట్లాడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందుకోసం జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ఎవరైనా ఆర్టీసీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే ఫిర్యాదు చేయడానికి విజయవాడలో సెంట్రల్ కంప్లయింట్ సెల్ (0866–2570005)ను ఏర్పాటు చేసింది. అలా మాట్లాడుతున్న ఫొటో లేదా వీడియోను ఆధారంగా జతపరచాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందుకున్న అనంతరం ఆ బస్ జీపీఎస్ లైవ్ ట్రాకింగ్‌ను, సంబంధిత డ్రైవర్ ఫోన్ నంబరును, కాల్‌డేటాను పరిశీలిస్తారు. ఆ డ్రైవరు బస్ నడుపుతూ ఫోన్లో మాట్లాడిందీ లేనిదీ నిర్థారణకు వస్తారు. తాను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడలేదని బుకాయించినా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, కాల్‌డేటా ఆధారంగా చర్యలు చేపడతారు. ‘కొన్నాళ్ల క్రితం ఇలానే ఓ అమరావతి సర్వీసు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడిపాడు. ఆ విషయాన్ని ఓ ప్రయాణికుడు సెంట్రల్ కంప్లయింట్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ డ్రైవర్ని అడిగితే తాను మాట్లాడలేదని చెప్పాడు. మేం అతని కాల్‌డేటాను పరిశీలిస్తే 9 నిమిషాల సేపు మాట్లాడి 13 కిలోమీటర్లు నడిపినట్టు తేలింది. దీంతో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాం’ అని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు బుధవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. రాష్ట్రంలోని 12 వేల ఆర్టీసీ బస్సులకూ జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ సిస్టం అమలు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు విశాఖ రీజియన్‌లో డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడిన కేసు ఒకటి నమోదైంది. విశాఖ – శ్రీకాకుళం అద్దె బస్సు డ్రైవర్‌పై ఈ ఫిర్యాదు అందింది. విచారించిన అధికారులు ఆ ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల తలెత్తే ప్రమాదాలతో పాటు సంస్థ వారిపై తీసుకునే చర్యలను ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రతి మంగళవారం కూడా వివరిస్తున్నారు. -
బాప్రే చలాన్ నెం.136
సాక్షి, సిటీబ్యూరో: మీరు బైక్‌పై తిరుగుతున్నారా.. ఎప్పుడన్నా హెల్మెట్ పెట్టుకోవడం మరిచిపోయారా..! ఎవరు చూస్తార్లే.. అని డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నారా..! అయితే, ఒక్కసారి ‘ఈ–చలాన్’ చెక్ చేసుకోండి. మీ వాహనంపై ఎన్ని చలాన్లు జారీ అయ్యాయో చూసుకోండి. లేదంటే నగరంలో ఏదో ఒకచోట పోలీసులు మీ బండిని స్వాధీనం చేసుకుంటారు. ఆపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేస్తారు. దాంతో మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిదే. పోలీసులు లేని ప్రాంతంలో హెల్మెట్ లేకుండా తిరిగినా.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసినా సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ చలాన్లు జారీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి గురువారం ట్రాఫిక్ పోలీసుల కంటబడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుతున్న ఓ వ్యక్తిని ఆపితే ఏకంగా 136 ఈ చలాన్లు ఉన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు గురువారం సాయంత్రం హిమాయత్‌నగర్ ‘వై జంక్షన్’ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో అటుగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని ఆపారు. ఈ ఉల్లంఘనపై చలాన్ జారీ చేస్తూనే.. సదరు బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు తెలుసుకోవడానికి ‘పీడీఏ మిషన్’లో బండి నెంబర్ (టీఎస్10ఈడీ9176) నమోదు చేశారు. మిషన్ నుంచి వచ్చిన ప్రింట్ ఔట్ చూసి పోలీసులకే కళ్లు తిరిగాయి. ఆ ద్విచక్ర వాహనంపై 28 నెలల్లో 136 సార్లు జారీ అయిన ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లించాల్సిన పెనాల్టీ మొత్తం రూ.31,590కి చేరినట్లు అందులో ఉంది. వీటిలో జరిమానాల మొత్తం రూ.26,900 కాగా.. సర్వీస్ చార్జి మరో రూ.4690 ఉంది. ఆ ద్విచక్ర వాహనం కేకే ప్రకాష్ పేరుపై రిజిస్ట్రర్ అయింది. 2016 జూన్ 9న తొలిసారిగా హెల్మెట్ లేకుండా సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడంతో రూ.1100 చలాన్ జారీ చేశారు. అప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 136 ఈ–చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో కేవలం ఆరు మాత్రం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించినవి కాగా.. మిగతా 127 హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల జారీ చేసినవి. మిగిలినవి నో పార్కింగ్ ఏరియాలో వాహనం నిలిపిన ఉల్లంఘనకు సంబంధించినవి. ఈ పెండింగ్ చలాన్లలో కేవలం ఒక్కటి మాత్రమే సైబరాబాద్ పోలీసులు జారీ చేయగా మిగిలినవన్నీ సిటీకి సంబంధించినవే. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల నుంచి స్పాట్లో జరిమానా వసూలు చేయట్లేదు. కేవలం ఈ–చలాన్ మాత్రమే జారీ చేస్తూ ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, ఆన్లైన్లో వీటిని చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ వాహన చోదకుడు హెల్మెట్నే కాదు.. ఈ–చలాన్ల చెల్లింపునూ మర్చిపోవడంతో పెండింగ్ జాబితా చాంతాడంత అయింది. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ముందు అతగాడికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ సైతం ఇవ్వనున్నారు. -
ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపితే ఇంటికే
తిరుపతి సిటీ: సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడిపితే ఆర్టీసీ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇలా రుజువైతే ఉద్యోగం నుంచి తొలగించనుంది. తిరుమల డిపోకు చెందిన డ్రైవర్ జి. మంగయ్యను ఇటీవల ఇదే విధంగా తొలగించారు. సత్యవేడు డిపోకు చెందిన మరొకరు సెల్‌ఫోన్ డ్రైవ్ చేస్తుండటంతో తాజాగా సస్పెండ్ చేశారు. ఈ చర్యలతో డ్రైవర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈనెల 25 నుంచి విధులకు సెల్‌ఫోన్ తీసుకెళ్లరాదని ఆర్ఎం చెంగల్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనేబస్సు ప్రమాదాలు.. బస్సు నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడటం వల్ల జిల్లాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని విచారణలో తేలింది. ఇటీవల మదనపల్లి– 2 డిపోకు చెందిన హైయర్ బస్సు కలికిరి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. బస్సు డ్రైవర్‌కు వెన్నెముక పనిచేయలేని పరిస్థితి. అలాం టి పరిస్థితి ఎదురుకారాదని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్ఎం తెలిపా రు. వన్‌మ్యాన్ సర్వీసు డ్రైవర్లు, టిమ్ మిషన్ ఉపయోగించే డ్రైవర్‌కు ఈ నిబం ధనలు వర్తించవా అని కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లే టిమ్ మిషన్ ద్వారా టికెట్లు కొట్టి ఇస్తూ.. డబ్బులు తీసుకుంటూ పనిచేస్తున్నారు. ఆ సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడినంత మాత్రాన ఉద్యోగం నుంచి తొలగించడం సమంజసం కాదని ఎన్ఎంయూ రీజనల్ కార్యదర్శి రమణరావు అంటున్నారు. అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుం టుందని సూచించారు. -
ప్రాణాలు ముఖ్యమా? రాజకీయాలా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో రెండు శాతం వాహనాలు మాత్రమే దేశీయ రోడ్లపై నడుస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 12 శాతం ప్రమాదాలు భారత్‌లోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ లెక్కలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఒకటిన్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ స్వయంగా పార్లమెంట్‌కు తెలియజేశారు. దేశంలో రోడ్డు నెట్వర్క్ అత్యంత అధ్వాన్నంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల కారణంగా భారత్‌కు ప్రతి ఏటా తన జాతీయ స్థూలాదాయంలో మూడు శాతం అంటే, 5,8000 లక్షల డాలర్ల నష్టం వాటిల్లుతోందని ‘ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల కమిషన్’ తెలియజేసింది. ఈ నేపథ్యంలో దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరగుపర్చాల్సిన అవసరం ఉందని, అందుకు 30 ఏళ్ల నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలని నితిన్ గడ్కారీ నిర్ణయించారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన కొత్తలోనే బిల్లు ప్రతిపాదన తీసుకరాగా, సుదీర్ఘ కసరత్తు తర్వాత 2017లో బిల్లు తుది రూపు దాల్చింది. ఈ బిల్లును అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ అదే సంవత్సరం ఆగస్టు నెలలో ‘ఎంపిక కమిటీ’ పరిశీలనకు పంపించింది. ఆ కమిటీ నుంచి తగిన సూచనలతో బిల్లు సోమవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. దీన్ని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను సడలిస్తుందన్న కారణంగా అన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, కార్పొరేషన్లకు మేలు చేసే విధంగా కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవానికి బిల్లులో చాలా మంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచడంతోపాటు రోడ్ల నిర్మాణంలో, డిజైన్లలో, నిర్వహణలో లోపాలుంటే అందుకు కాంట్రాక్టర్లను, కన్సల్టెంట్లను, ప్రభుత్వ సంస్థలను బాధ్యులను చేస్తూ కఠిన శిక్షలు విధించడం, కొన్ని రకాల యాక్సిడెంట్లలో బాధితులకు నష్టపరహారం చెల్లించడం కోసం రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చేయడం, సరైన ప్రమాణాలకు అనుగుణంగా లేని మోటారు వాహనాలను, విడిభాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని సంబంధిత కంపెనీలకు పంపించడం, ఓ కంపెనీపై 500 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం విధించడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో బాధితులను ఆదుకునే పౌరులకు అధికారుల నుంచిగానీ చట్టం నుంచిగానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడడం, వీలైతే రివార్డులివ్వడం లాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. తాగి వాహనాన్ని నడిపితే పదివేల రూపాయల జరిమానా, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే ఐదువేల రూపాయలు, రెడ్ సిగ్నల్ దాటినా, సీటు బెల్టు పెట్టుకోక పోయినా, హెల్మట్ ధరించక పోయినా వెయ్యి రూపాయల జరిమానాలను విధించాలని ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. 30 ఏళ్ల అనంతరం తొలిసారి జరిగిన కసరత్తును రాష్ట్ర పాలకపక్ష పార్టీలు కాదనడం బాధాకరమే. రాష్ట్రాలు కూడా చట్టాలు తేవచ్చు దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఒక్క కేంద్రమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. ‘విజన్ జీరో ప్రోగ్రామ్’ పేరిట హర్యానా ప్రభుత్వం గతేడాది చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంలో రోడ్డు ప్రమాదం కారణంగా ఒక్కరి ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రమాదాలు ఐదు శాతం తగ్గాయి. అదే తరహాలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో రోడ్ ఫాటలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టగా ఇప్పటికీ పది శాతం ప్రమాదాలు తగ్గాయి. -
అనసూయను ట్రోల్ చేసి పడేశారు
యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ట్రాఫిక్ సిగ్నల్‌లో వీడియో చూస్తున్న ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేసి ఆమె ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అసలు విషయంలోకి వస్తే... బుధవారం సాయంత్రం అనసూయ.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆమె పక్క కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో వీడియో చూస్తున్నాడు. ఆ సన్నివేశాలను అనసూయ తన ఫోన్లో బంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను భయపెట్టిస్తున్నాయి. ఇంతకు ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి(గతేడాది మే నెలలో గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం జరిగి.. అనసూయకు గాయాలు అయ్యాయి కూడా) గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు.రోడ్లపైకొచ్చి తమకిష్టమొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని అనసూయ తన ట్వీట్లో తెలిపారు. అయితే ఆ వీడియో సందేశం తేడా కొట్టేసింది. చీప్ పబ్లిసిటీ స్టంట్ ఆమెను ట్రోల్ చేస్తూ పలువురు రీట్వీట్లు చేశారు. దీంతో అసంతృప్తి వెల్లగక్కిన నెటిజన్లు వరుస ట్వీట్లు చేశారు. ‘మంచి కారణంతో ఓ వీడియో పెడితే ట్రోల్ చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే’ అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక అక్కడి నుంచి మరికొందరు సైతం ఆమెపై విరుచుకుపడుతుండగా.. వారికి ఓపికగా వివరణలు ఇస్తూ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దిగి చెప్పే యత్నం చేయొచ్చు కదా అన్న ఓ వ్యక్తి ప్రశ్నకు.. అలా చేస్తే తర్వాత యూట్యూబ్‌ల్లో ఎలాంటి హెడ్డింగులు కనిపించేవో అందరికీ తెలుసంటూ అనసూయ బదులిచ్చారు. కొన్నిరోజుల క్రితం విరుష్కలు కూడా ఇదే తరహాలో ఓ వీడియోను పోస్ట్ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. (అనసూయపై ఫిర్యాదు) -
యాంకర్ అనసూయకు చేదు అనుభవం
-
దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘డ్రైవింగ్‌లో ఉండగా దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే బండి పక్కకు ఆపి, ప్రశాంతమైన చోటు వెదుక్కుని ఆయనతో మాట్లాడండి. ఒకవేళ దేవుడిని చూడాలనుకుంటే డ్రైవింగ్‌లో ఉండగా మొబైల్లో మెసేజ్‌లు పెడుతుంటే నేరుగా ఆయనకు దగ్గరకు వెళ్లిపోవచ్చు’ ఇది ఒక వాహనం వెనుక భాగంలో రాసివున్న సందేశం. ఈ ఫోటోను హైదరాబాద్ నగర పోలీసు అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఈ ఫొటో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? సెల్ఫోన్ల వినియోగం పెరగడంతో వాహనదారుల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగిపోతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ఫోన్లలో మాట్లాడుతూ, ఛాటింగ్ చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు నిరంతరం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇలా వచ్చిందే ఈ ఫొటో. కాబట్టి సెల్‌ఫోన్ వాడుతూ వాహనాలు నడపకండి, ప్రమాదాలు కొనితెచ్చుకోకండి. -
ఫోన్ కోసం బైక్‌పై నుంచి..
ప్రకాశం, పొదిలి: సెల్ ఫోన్ జారి కిందపడుతుండగా దానిని అందుకునే ప్రయత్నంలో మోటారు సైకిల్ పై నుంచి జారిపడిన వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని సలకనూతల వద్ద శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన ఊటుకూరి వెంకట ప్రసాద్ భార్య విజయలక్ష్మి(45) పట్ణణంలో మీ సేవ సెంటర్ నిర్వహిస్తుంటారు. ప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలు సోదరునితో కలిసి మోటారు సైకిల్‌పై దొనకొండ అడ్డరోడ్డు వైపు వెళుతున్నారు. ఆ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతుండగా అది కిందకు జారింది. దీంతో అది కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలో విజయలక్ష్మి మోటారు సైకిల్ నుంచి జారి పడింది. తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, పిల్లలు, బంధువులు విజయలక్ష్మి మృతదేహం భోరున విలపించారు. -
ప్రయాణం..ప్రాణసంకటం
ఆదిలాబాద్: ఈనెల 6న నల్లగొండ జిల్లాలో పరిమితికి మించి ట్రాక్టర్లో 25మంది వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం లోయ లో పడి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపడం, ఇంజిన్ సీటుపై ముగ్గురు కూర్చోవడంతో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్నా.. డ్రైవర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీపులు, ఆటోలు, టాటాఏసీల్లో పరిమితికి మించి నిత్యం ఇలా ప్రమాదపు అంచున ప్రయాణిస్తూ కనిపిస్తుంటారు. ఇందులో చాలా మంది సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం డ్రైవింగ్ చేసే వారే ఉంటారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి ప్రయాణం.. పరిమితికి మించి ప్రయాణం.. ప్రాణం మీదకు తెస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏడాది ప్రయాణికులను తరలించే వాహనాలతో పాటు కొన్నిసార్లు గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఇందులో ముఖ్యంగా జీపులు, ఆటోలు, టాటాఏస్‌లు టాప్ పైనే కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. డ్రైవర్ కూర్చొని వాహనం నడిపే వీలులేకుండా ముందర సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఆటోలో నలుగురు ప్రయాణికులు కూర్చోవాలి. కానీ ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. జీపులు, టాటాఏస్‌లో కూడా ఈ ఇదే పరిస్థితి. గ్రామాల నుంచి తరలింపు.. వాహనాల్లో ప్రయాణించే క్రమంలో గ్రామాల నుంచి వచ్చే జీపులు, ఆటోలు, టాటా ఏఎస్‌లలో 10 మందికి తక్కువ కాకుండా తీసుకొస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసే సమయంలో వారిని చూసే వాహనాలు అక్కడే నిలిపివేస్తున్నారే తప్ప.. ప్రయాణికులను మాత్రం తగ్గించడం లేదు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే సమయంలో, పాఠశాలలకు విద్యార్థులను తరలించేటప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారు. నిత్యం ఆదిలాబాద్ పట్టణంలో ఆటోల్లో విద్యార్థులు ముందు సీట్లలో, వెనకసీట్లలో నిండిపోయి కనిపిస్తుంటారు. జరగరానిది ఏదైనా జరిగితే చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వాహనదారులు, డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది పరిమితికి మించి ప్రయాణికులను తరలించి ప్రాణం మీదకు తీసుకొస్తున్నారు. నిబంధనలు గాలికి.. వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులతో పాటు ప్రయాణికులను తరలించే డ్రైవర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇందులో అతివేగంగా నడపడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం నిబంధనలకు విరుద్ధమే. కొంత మందికి లైసెన్సు లేకుండా కూడా వాహనాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనఖీ చేసే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిబంధనల ప్రకారం వాహనాలకు ఉండాల్సిన పత్రాలు ఉంచుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆటోల్లోనే పట్టణాలకు వస్తుంటారు. అయితే వాహనాలు నిండే వరకు డ్రైవర్ ప్రయాణికులను తీసుకెళ్లకపోవడం గమనార్హం. దీంతో డ్రైవర్‌కు ముందు సీట్లలో ఇరువైపులా కూర్చోబెట్టుకోవడం ద్వారా వాహనం అదుపు చేయలేక బోల్తాపడుతున్నాయి. పరిమితికి మించితే చర్యలు వాహనాల్లో ప్రయాణికులను పరిమితికి మించి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఆటోలు, జీపులపైన కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడడం వల్ల వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మన ప్రాణాలే కాదు.. మన మీద ఆధారపడిన వారు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకొని డ్రైవర్లు వాహనాలు నడపాలి. – నర్సింహారెడ్డి, డీఎస్పీ ఆదిలాబాద్ -
కానిస్టేబుల్ సెల్‌ఫోన్ డ్రైవింగ్ చెంప పగిలింది
-
ఒక్కసారి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళిరండి !
విద్య - విలువలు శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల, సక్రమమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా నూటికి 95 మందిలో మధుమేహ వ్యాధి వస్తుంది. మీరు పిల్లలు. ఈ వయసులో ఆ వ్యాధి ప్రభావమేమిటో మీకంతగా తెలియదు. మధుమేహం, రక్తపోటు - ఈ రెండూ కానీ వచ్చాయా, అసలు జీవితానికి సంతోషం ఉండదు. ఎక్కువ తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది, తక్కువతింటే ఓ నాలుగుగంటలపాటూ ఓ పనిమీద నిలబడలేడు. చక్కెరశాతం పడిపోతే స్పృహతప్పి పడిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా జేబులో చాక్లెట్, లేదా బిస్కెట్ ప్యాకెట్ ఉండాలి. తప్పకుండా తింటూండాలి. తినలేదా తట్టుకోలేడు. కొద్దిగా మోతాదుమించి తిన్నాడా, ఏ కన్ను దెబ్బతింటుందో, మూత్రపిండాలు ఎక్కడ చెడిపోతాయో తెలియదు. త్రాసులో తూచుకుని, గడియారం చూసుకుని తింటుండాలి. తినగలిగి ఉండి కూడా తినడానికి అవకాశం లేకపోవడం ఎంత శాపమో మధుమేహంతో బాధపడేవారికి తెలుస్తుంది. అందుకే మీరటువంటి వ్యాధులకు బలికాకండి. నియమంగా వ్యాయామం చేయండి. వ్యాయామం అలవాటైతే శరీరం తేలిగ్గా ఉంటుంది. ఏ పనయినా సునాయాసంగా చేయగలుగుతారు. రక్తపోటుకు గురికాకుండా మంచి ఆహారం తీసుకుంటే ఒత్తిళ్ళను తట్టుకోగలుగుతారు. ఆటుపోటు ఓర్చుకోగల శక్తి పొందుతారు. ఎప్పుడూ ఏసీల్లో ఉండడం, కాసేపయినా నడవకపోవడం... ఇవి మంచి అలవాట్లు కావు. చిన్నతనంలో మీ బట్టలు మీరు ఉతుక్కోవడం, ఇంటిపట్టున ఉన్నప్పుడు మీ అమ్మగారి శ్రమలో ఓ 15 నిమిషాలు పాలుపంచుకోవడం వంటివి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి. మీరెంత పెద్ద పదవిలో ఉన్నా అమ్మచేతిపని అందుకుని సాయంచేస్తే పొంగిపోతుంది, అమ్మ రుణం జీవితంలో తీర్చుకోలేనిది. మన ప్రధానమంత్రి నరేంద్రమోడీగారు ఈ మధ్యకాలంలోనే పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘రోజులో ఒక్కగంటయినా శరీరానికి చెమటపట్టేలా చేయడం అలవాటు చేసుకోండి’’ అన్నారు. ఎంత గంభీరమైన మాటో చూడండి. ఎంతపెద్ద అధికార పదవిలో ఉండనీయండి, శరీరానికి తగిన శ్రమ ఇవ్వకపోతే అది ఆ వ్యక్తి జీవితానికి మంచిదికాదు, అతడు ఎందుకూ పనికిరాని వాడయిపోతాడు. శరీరాన్ని కష్టపెడితే మీరు సుఖపడతారు, దాన్ని సుఖపెడితే మీరు కష్టపడతారు. సచిన్ తెందూల్కర్‌కు అంత ఐశ్వర్యమున్నా, అతను మైదానంలో దిగితే ఎంత ఎండలోనైనా సరే, రోహిణీ కార్తె అయినా సరే, అన్ని గంటలసేపు నిలబడి ఫీల్డింగ్ చేయగలిగాడు - అంటే వయసు 40 దాటినా కళ్ళజోడు పెట్టుకోకుండా, అంత దేహదారుఢ్యంతో, అంత వ్యాయామంతో తట్టుకోగలిగాడు. అంటే ఇన్ని కీర్తిప్రతిష్ఠలున్నా, అంత ఐశ్వర్యమున్నా, ఎంత వ్యాయామం చేశాడో, ఎంత క్రమశిక్షణ ఉన్నవాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇంత కష్టపడతాడా అని అతని ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. చదవండి. అందుకే వ్యక్తిత్వ వికసనమునందు మొట్టమొదట మనిషి తెలుసుకోదగినది ఏది అంటే భగవంతుడిచ్చిన ఈ శరీరం విలువ. భగవంతుడిచ్చిన అవయవాలు ఎంత గొప్పవో అవి లేనివాళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఆయన మనకు ఊపరితిత్తులు లోపలపెట్టాడు. మూత్రపిండాలు లోపలపెట్టాడు. అవి ఉన్నాయనికానీ, వాటి విలువకానీ మనకు తెలియదు. కానీ ఊపిరితిత్తులకు కొద్దిగా వ్యాధి సోకి ఆయాసం వచ్చి మాట్లాడలేక, మంచంమీదపడి లక్షలకు లక్షలు వైద్యశాలలకు కట్టి, ఇంట్లోవాళ్ళు పోషించలేక, మందులు వేసుకోలేక, ఆహారం తినలేక ఆయాసంతో బాధపడేవారిని చూస్తే తెలుస్తుంది, వాటి విలువ ఏపాటిదో. ఎముకలు దేముడు అమర్చిన ఒక అద్భుతమైన వ్యవస్థ. వెన్నుపాము ఈశ్వరుడిచ్చిన ఒక అపురూపమైన నిర్మాణం. ఏదో అప్పటికి సంతోషంగా ఉంటుంది కదాని అక్కరలేనంత వేగంతో వెళ్ళడం, మెలికలు మెలికలుగా మోటారు సైకిలు నడపడం ఆ నిమిషంలో బాగుంటుంది. ఈమధ్య కాలంలో నా స్నేహితుడి కుమారుడొకడు మోటారు సైకిలు మీది నుంచి పడిపోయాడు. రోడ్డు గరుగ్గా ఉండడంతో చర్మం నడుం నుంచీ ముఖం వరకూ చెక్కేసినట్లయింది. కొన్ని నెలలపాటూ వైద్యశాలలో ఉన్నాడు. ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నారు. తొడమీద చర్మం కత్తిరించి ముఖానికంతా అంటించడం, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తొడమీద కొత్త చర్మం పట్టడం, దాన్ని మళ్ళీ కత్తిరించి పైన అంటించడం... చాలా కాలం పట్టింది. ఈలోగా అతనితో చదువుకున్నవాళ్ళు కోర్సు పూర్తి చేసుకుని క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు పొంది వెళ్ళిపోయారు. తండ్రి ఐశ్వర్యంపోయి, ఈ పిల్లవాడి చదువుపోయి భ్రష్టుడయి... ఇదంతా దేనివల్ల...? ? ? అక్కడక్కడా బోర్డులు కనిపిస్తుంటాయి. ‘స్పీడ్ థ్రిల్స్, బట్ కిల్స్’ (వేగం ఉత్కంఠభరితమే, కానీ ఊపిరికూడా తీస్తుంది) అని! ఈవేళ ఒక రోడ్డెక్కితే భద్రత కష్టం. ఒక పక్క కారు డ్రైవ్ చేస్తుంటాడు. మరో చేత్తో సెల్‌ఫోన్ మాట్లాడుతుంటాడు. మోటారు సైకిళ్ళమీదా అంతే... భుజాల దగ్గర నొక్కిపట్టి సెల్‌ఫోన్ మాట్లాడుతూ బండి వేగంగా నడుపుతుంటాడు. వెన్నుపూసలో ఒక్కపూస జారిందా... ఆ వ్యక్తి జీవితాంతం పడే బాధ అలాఇలా ఉండదు, నరకమయమయిపోతుంది జీవితం. మీ మేనమామగా అనుకోండి. మీ మీద ప్రేమతో మీ మేలుకోరి ఒక కఠినమైన సలహా ఇస్తా. మీలో ప్రతి ఒక్కరూ ఎప్పుైడనా మీకు తీరిక ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభుత్వ ఆస్పత్రికెళ్ళి ఎముకల విభాగం, ఊపిరితిత్తుల విభాగం చూసిరండి. మీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యం ఏమిటో బోధపడుతుంది. మీ జీవితంలో మోటారు సైకిల్ మీద వెడుతూ మళ్ళీ సెల్‌ఫోన్ మాట్లాడరు. ఈవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే దాని అర్థం మీరు ఎప్పటికీ ఇలానే ఉంటారని కాదుకదా! ఆరోగ్యంగా ఉన్నాననుకుని తినకూడని పదార్థం ఒకటి తిన్నారనుకోండి. ఒక గంటలోనే మీ ఆరోగ్యంలో తేడా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు చేయవలసిన కార్యక్రమాలను అప్పుడు చేయడం ఎలా సాధ్యపడుతుంది... శరీరం సహకరించినప్పుడేకదా ! మీరు జీవితంలో వృద్ధిలోకి వచ్చి మీ కుటుంబంతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలన్నా, సమాజానికి సేవ చేయాలన్నా మీ శరీరం ఆరోగ్యం లేకుండా ఎలా సాధ్యం? ఒకవేళ భగవంతుడు మీకు వరంగా మంచి ఆరోగ్యమిచ్చినా, చక్కటి వ్యాయామంతో, చాలినన్ని పోషకాలతో దాన్ని కాపాడుకోవాలి కదా ! అలాకాక పాడు చేసుకుంటే నష్టపోయేది మీరూ, మీ కుటుంబమే కాదు, ఈ సమాజం కూడా ఒక ప్రతిభావంతుడి, ఒక మంచి పౌరుడి మేధస్సును, సేవలను కోల్పోతుంది అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తెరిగి బాధ్యతతో మసలుకోండి. మంచి వ్యాయామం చేసుకోండి, తాజా పండ్లకు మనకు కొరత లేదు. ఏ ఋతువులో ప్రకృతి మనకు అనుగ్రహించి ఇచ్చిన పండ్లేవో ఆ కాలంలో తీసుకోండి. చెడుతిళ్ళు తినకండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సెల్‌ఫోన్ డ్రైవింగ్ .. ఆర్టీసీ డ్రైవర్ కు ఫైన్
హైదరాబాద్: బస్సు నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్న ఆర్టీసీ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ సంఘటన నగరంలోని కూకట్పల్లి వద్ద రెమెడీ ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. బస్సు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కేపీహెచీ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండగా కంటపడటంతో స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రూ.1000 జరిమానా విధించాడు. -
రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్‌లు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ షార్ట్ఫిల్మ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, త్రిబుల్ రైడింగ్ తదితర అంశాలపై డిజిక్విస్ట్ సంస్థ రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను శుక్రవారం నుంచి తెలంగాణ జిల్లాలోని ఉన్న థియేటర్లలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. ప్రతి థియేటర్ యాజమాన్యం ఈ షార్ట్ ఫిల్మ్‌లను నెలరోజుల వ్యవధిలో కనీసం ఏడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది. -
ఇదేం బాదుడు?
సాక్షి, సిటీబ్యూరో:మౌలిక వసతుల కల్పన మా విధి కాదంటున్న ట్రాఫిక్ పోలీసులు.. ఆ బాధ్యత తనదే అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బల్దియా అధికారులు.. ఫలితంగా పార్కింగ్ వసతుల్లేకుండా నడుస్తున్న సముదాయాలు.. చివరకు జరిమానా చెల్లించి జేబుకు చిల్లుపెట్టుకునేది మాత్రం సామాన్యులు.. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సోమవారం నుంచి ‘భారీ బాదుడు’ షురూ చేశారు. సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్‌తో పాటు నో పార్కింగ్ ఉల్లంఘనలకు రూ.1000 చొప్పున వడ్డిస్తున్నారు. మిగిలిన మూడింటి విషయం అలా ఉంచితే ‘నో పార్కింగ్’ విషయంలో మాత్రం నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాలకు సరైన పార్కింగ్ వసతులే లేనప్పుడు అక్కడకు వచ్చిన తాము వాహనాలను ఎక్కడ పార్క్ చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. వాణిజ్య సముదాయూలకు పార్కింగ్ స్థలం తప్పనిసరంటూ చేసేవన్నీ ఆర్భాటపు ప్రకటనలేనా? అని నిలదీస్తున్నారు. నగరంలోని అనేక వాణి జ్య సముదాయూలు, కేఫ్, దుకాణాలు సరైన పార్కింగ్ స్థలాలు లేకుండానే కొనసాగుతున్నా యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన పాపానికి వాహనదారులు ‘భారం’ మోయాల్సి వస్తోంది. జీవో ఉన్నా అమలు సున్నా... నగరంలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా మౌలిక సదుపాయాలు, రోడ్లు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా నో-పార్కిం గ్‌లోనూ వాహనాలు నిలపడం అనివార్యమైం ది. ట్రాఫిక్ ఇబ్బందులకు ఇదీ ఓ ప్రధాన కారణమే. పలుచోట్ల వాణిజ్య సముదాయూలు, దుకాణాలకు సరైన పార్కింగ్ వసతుల్లేవు. వాటికి వచ్చిన వారంతా రోడ్లపైనే వాహనాలకు ఆపుతున్నారు. ఫలితంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నారుు. ఈ క్రమంలో ప్ర భుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బ న్ డెవలప్మెంట్ శాఖ ద్వారా 2006లో జీవో నెం. 86 జారీ చేసింది. నగరంలోని వాణిజ్య సముదాయూలు, వ్యాపార సంస్థలకు పార్కింగ్ స్థలాలు ఎంత శాతం ఉండాలన్నది ఇందులో స్పష్టంగా ఉంది. మల్టీప్లెక్స్‌తో కూడిన సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు మొత్తం విస్తీర్ణంలో 60 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు 40 శాతం పార్కింగ్ స్థలం తప్పనిసరి. వాణిజ్య సముదాయాలు తదితరాలకు 25 శాతం ఉం డాలి. అలా లేని వాటికి లెసైన్స్ రెన్యువల్ చేయవద్దని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. రెన్యువల్స్ ఎలా సాధ్యం? వాణిజ్య సముదాయూలు, సినిమా హాళ్లు, కేఫ్‌ల యజమానులకు ఏటా జనవరి నుంచి డిసెంబరు వరకు పోలీసులు లెసైన్స్ జారీ చేస్తారు. వీటి రెన్యువల్ ప్రక్రియ నిరంతరాయం. ఆ సమయంలో శాంతి భద్రతల కోణం నుంచే కాక వీటివల్ల ఏవైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయూ? అనే కోణంలోనూ పరిశీలించాల్సి ఉంటుంది. జీవో ప్రకారం నిర్దేశించిన పార్కింగ్ స్థలం లేకుంటే లెసైన్స్ రెన్యువల్ నిలిపివేయూలి. అరుుతే నగరంలో ఉన్న వాణిజ్య సముదాయూలు, కేఫ్‌ల్లో దాదాపు 70 శాతం సరైన పార్కింగ్ స్థలాలు లేవు. వీటి లెసైన్సుల రెన్యువల్ చేసే సమయంలో పోలీసు శాఖ పట్టించుకోకపోవడమే దీనికి కారణం. కొన్నైతే ఏకంగా రెన్యువల్ చేరుుంచకుండానే కొనసాగుతున్నారుు. మరికొ న్ని సంస్థల యూజమాన్యాలైతే రెన్యువల్ కోసం కట్టిన చలాన్ రసీదునే లెసైన్స్‌గా పేర్కొంటూ నెట్టుకొచ్చేస్తున్నారు. వీటి విషయంలో నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పుడు మాత్రం భారీ జరిమానాల పేరుతో బాదేయడాన్ని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. పార్కింగ్ వసతులు లేని సముదాయాలు, వాణిజ్య ప్రాంతాలకు రెన్యువల్ ఆపేస్తే... అక్కడకు తాము వెళ్లడం, నో పార్కింగ్‌లో వాహనం నిలపాల్సిన అవసరమే ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు. పట్టనట్లు వ్యవహరిస్తున్న ‘గ్రేటర్’... నిబంధనల ప్రకారం ఏదైనా స్థలం, సముదాయూనికి సంబంధించిన కొలతలు తీయూల్సిన బాధ్యత ఇంజనీరింగ్ విభాగానికి. ఇది జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉంటుంది. సముదాయం ఉన్న ప్రాంతం, వాటిలోని విభాగాలు, ఇతర ప్రాంతాలను కచ్చితంగా లెక్కకట్టడానికి అవసరమైన సాంకేతిక అర్హత, పరిజ్ఞానం వారికే ఉంటుంది. నగరంలో మాత్రం ఈ పార్కింగ్ ఏరియూను కొలిచే బాధ్యత ఏమాత్రం ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. ఇది తమ పని కాదన్నట్లు ‘గ్రేటర్’ అధికారులు వ్యవహరిస్తున్నారు. లెసైన్స్ రెన్యువల్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తునూ పరిశీలించడం, ఆ సముదాయూన్ని సందర్శించి కొలతలు తీసి సరిచూడటం వీరి పనే. ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా లేని వాటిని కూల్చే సే అధికారం సైతం వీరికి ఉంటుంది. అయితే దీన్ని పక్కాగా అమలు చేసిన పాపాన పోవట్లేదు. జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఉంది. ఇక్కడ ఇంజనీర్లూ అం దుబాటులో ఉంటారు. వీరి సహాయం తీసుకొనే విషయం ఎవరూ పట్టించుకోవట్లేదు. రూ.20 కోట్లకు పైగా ‘అక్రమ దోపిడీ’... నాలుగేళ్లలో (2009-2012)నో పార్కింగ్, డేంజరస్ పార్కింగ్‌ల్లో వాహనాలు ఉంచారంటూ స్పాట్లో విధించిన చలాన్లతో పాటు ఆ వాహనాలను వేరే ప్రాంతానికి క్రేన్ల ద్వారా తరలించి (టోవింగ్) చేసిన కేసులు 21,62,479 నమోదయ్యాయి. వీరిలో ఒక్కోక్కరికీ కనిష్టంగా రూ.200 జరిమానా విధించారనుకున్నా... రూ.43,24,95,800 వసూలు చేశారు. ఇందులో సగం మంది అవకాశం ఉన్నా ఉల్లంఘనలకు పాల్పడ్డారని భావించినా ... పార్కింగ్ అవకాశం లేక అనివార్యంగా నో పార్కింగ్‌లో ఆపి దొరికిపోయారు. వీరి నుంచి వసూలు చేసిన రూ.20 కోట్లకు పైగా జరిమానాలు ‘అక్రమ దోపిడీ’ కిందికే వస్తుందనడంలో సందేహం లేదు. ముందు ‘పార్కింగ్’ చూపించండి వ్యాపార సంస్థల వద్ద పార్కింగ్ స్థలం ఉండదు. ఆయా అవసరాలకు దుకాణాలకు వెళ్లే వారు వాహనాల్ని ఎక్కడ నిలపాలి? రోడ్డు పక్కన నిలిపితే రూ.వెయ్యి వదుల్చుకోవాల్సిందే. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆయా వ్యాపార సంస్థలు తప్పకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. నేను రోడ్డు పక్కన బండి ఆపి టీ తాగిన పాపానికి భారీగా చెల్లించాల్సి వచ్చింది. ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్ ఆక్రమణలు ఎందుకు తొలగించరు? ఇదేం న్యాయం? - రఘురాంరెడ్డి, విద్యావేత్త, విద్యానగర్ విజ్ఞానపురి కాలనీ ట్రాఫిక్ చిక్కులు పరిష్కరించండి అడుగడునా అడ్డంకులు. రోడ్ల నిండా గోతులు ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్కమ పార్కింగ్లు. నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందే కనిపించరు. వీటిని పరిష్కరించకుండా జరిమానాల పేరిట వేలకు వేలు గుంజడం న్యాయం కాదు. - మదన్, మెకానికల్ ఇంజనీర్, నల్లకుంట -
ఉల్లంఘిస్తే..కట్టాల్సిందే!
హైదరాబాద్: మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే..అంతకు మించి జరిమానా కట్టాల్సిందే అంటున్నారు పోలీస్ బాస్‌లు. ఇంకా సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్ రాయుళ్లు భారీగా జరిమానా చెల్లించాల్సిందేనంటూ తాజాగా పోలీస్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి బుధవారం సమావేశమైన పోలీస్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్., ఓవరలోడ్, రాంగ్ పార్కింగ్‌లకు రూ.1000లు చెల్లించాలంటూ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పమస్య తీవ్రం కావడంతో పాదచారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.