
ప్రతీకాత్మక చిత్రం
ప్రకాశం, పొదిలి: సెల్ ఫోన్ జారి కిందపడుతుండగా దానిని అందుకునే ప్రయత్నంలో మోటారు సైకిల్ పై నుంచి జారిపడిన వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని సలకనూతల వద్ద శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన ఊటుకూరి వెంకట ప్రసాద్ భార్య విజయలక్ష్మి(45) పట్ణణంలో మీ సేవ సెంటర్ నిర్వహిస్తుంటారు. ప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలు సోదరునితో కలిసి మోటారు సైకిల్‌పై దొనకొండ అడ్డరోడ్డు వైపు వెళుతున్నారు.
ఆ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతుండగా అది కిందకు జారింది. దీంతో అది కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలో విజయలక్ష్మి మోటారు సైకిల్ నుంచి జారి పడింది. తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, పిల్లలు, బంధువులు విజయలక్ష్మి మృతదేహం భోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment