
ప్రతీకాత్మక చిత్రం
సత్తెనపల్లి: ఆటో డ్రైవరు సెల్‌ఫోన్ నిర్వాకం తొమ్మిది మంది ప్రయాణికులను ఆస్పత్రి పాల్జేసింది. సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ ఆవుల బాలకృష్ణ కథనం మేరకు సోమవారం బెల్లంకొండ నుంచి పది మంది ప్రయాణీకుల తో సత్తెనపల్లి వస్తున్న ఆటో వెన్నాదేవి వద్దకు రాగానే ఆటోడ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. సదరు ఫోన్ మాట్లాడే క్రమంలో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌లోడు ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణీకుల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’!