injured in road accident
-
డబుల్ బెడ్రూం కోసం నడిరోడ్డుపై హల్చల్.. ఇంతలో ప్రమాదం..
సంగారెడ్డి: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని త్వరగా అందజేయాలని ఓ వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. మండల కేంద్రం పుల్కల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ గ్రామానికి చెందిన బట్టు చిరంజీవి రాజుకు అతని భార్య మమత పేరుపై పుల్కల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం మంజూరైంది. అయితే వాటిలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. దీంతో ఇల్లు మంజూరైనా కాలయాపన జరుగుతుండటంతో అసహనానికి గురైన చిరంజీవి రాజు శుక్రవారం ఉదయం పెట్రోలు సీసాతో పుల్కల్ ప్రధాన రోడ్డుపై హల్చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతు ఇబ్బంది కలిగించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తుండగా కింద పడిపోయాడు. గమనించిన డ్రైవర్ ఆపే ప్రయత్నం చేస్తుండగానే వెనుక చక్రాలు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ విజయ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రాజయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను గుర్తించామని, ఇళ్లను కూడా కేటాయించామని తెలిపారు. చిన్న చిన్న పనులు మిగిలిపోవడంతో కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు. -
Hyderabad: మద్యం మత్తులో ఏకంగా ఇన్స్పెక్టర్ను ఢీకొట్టాడు..
-
ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది!
సత్తెనపల్లి: ఆటో డ్రైవరు సెల్‌ఫోన్ నిర్వాకం తొమ్మిది మంది ప్రయాణికులను ఆస్పత్రి పాల్జేసింది. సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఆవుల బాలకృష్ణ కథనం మేరకు సోమవారం బెల్లంకొండ నుంచి పది మంది ప్రయాణీకుల తో సత్తెనపల్లి వస్తున్న ఆటో వెన్నాదేవి వద్దకు రాగానే ఆటోడ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. సదరు ఫోన్ మాట్లాడే క్రమంలో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌లోడు ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణీకుల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
దైవదర్శనం కోసం 30 మంది వెళుతుండగా.. అంతలో..
సాక్షి,వెల్దుర్తి(కర్నూలు): దైవ దర్శనానికి బయలుదేరిన భక్త బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం ఘాట్ రోడ్డు ప్రారంభంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏటా కార్తీక మాసం అమావాస్య సందర్భంగా కోడుమూరు కొండపేటకు చెందిన పెద్దయ్య కుటుంబం, వివిధ ప్రాంతాల్లో వారి బంధువర్గం వెల్దుర్తి మండల పరిధిలోని శ్రీరంగాపురం కొండల్లో వెలసిన పాలుట్ల రంగస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో శనివారం 30 మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. డోన్ మండలం వెంకటాపురానికి చెందిన రంగడు, తన భార్య రంగమ్మ, కూతురు రాధ (14)తో కలిసి మదార్‌పురం వద్ద బొలెరో ఎక్కారు. అక్కడి నుంచి వాహనం గోవర్ధనగిరి, శ్రీరంగాపురం మీదుగా వెళ్తుండగా ఆలయానికి కి.మీ దూరంలో ఘాట్ రోడ్డు ప్రారంభంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు డోన్ బాలికల జెడ్పీ హెస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. గాయపడిన వారిలో మృతి చెందిన బాలిక తల్లిదండ్రులతో పాటు కోడుమూరుకు చెందిన పెద్దయ్య, రేవతి, సరోజ, మహేశ్వరమ్మ, రామలక్ష్మమ్మ, చాముండేశ్వరి, రంగస్వామి, రాజు, గణేశ్, విజయచంద్రసాయి, మంజుల, గౌరమ్మ, శివకృష్ణ, నారాయణమ్మ, పద్మావతి, రాధ, సుశీలమ్మ, నాగప్ప, వెంకటేశ్, లక్ష్మీదేవి, శ్రీరాములు, రాఘవేంద్ర, ముంతాజ్‌బేగం, డ్రైవర్ రామలింగడు ఉన్నారు. డోన్, ప్యాపిలి, వెల్దుర్తి నుంచి వచ్చిన మూడు 108 వాహనాల్లో క్షతగాత్రులను వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ సాగరిక ప్రాథమిక చికిత్స చేసి 15 మందిని మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలుకు తరలించారు. వెల్దుర్తి ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డోన్ రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. చదవండి: భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే.. -
అయ్యో భగవంతుడా.. పొట్ట కూటి కోసమని వెళ్తుంటే..
సాక్షి, చెన్నై: పొట్ట కూటి కోసం వెళ్తున్న నలుగురు మహిళా కార్మికులను రోడ్డు ప్రమాదం కబళించింది. మరో 15 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారంలోని ఓ పరిశ్రమ లో పుదియ ముత్తురు, నడువ కురిచ్చి, సిల్లంధం, ఉప్పిలి పట్టి పరిసర గ్రామాలకు చెందిన మహిళలు పనిచేస్తున్నారు. రోజూ మహిళల్ని ఇళ్ల వద్ద నుంచి ఆ పరిశ్రమకు చెందిన వాహనాల్లోనే తరలించడం జరుగుతోంది. గురువారం ఉదయం ఐదారు వ్యాన్లలో వందమందికి పైగా మహిళలు విధులకు బయలుదేరారు. మార్గం మధ్యలో ఓ వాహనం ప్రమాదానికి గురైంది. తూత్తుకుడి నుంచి పుదియ ముత్తూరు వైపుగా వచ్చిన ట్యాంకర్ లారీని వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ముందువైపుగా కూర్చుని ఉన్న సెల్వరాణి(45), కుమారి అలియాస్ జ్యో తి(40), సత్య(48) ఘటనా స్థలంలోనే మరణించా రు. శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రుల్ని బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.ఇందులో పుదియముత్తురుకు చెందిన మణిమేఘలై(20) చికిత్స పొందుతూ మరణించారు. మరో పదిహేను మంది మహిళలు, డ్రైవర్ తీవ్ర గాయాలతో తూత్తుకుడి, ఒట్టపిడారం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ఘటనలో... శుభకార్యానికి వెళ్లి వస్తూ.. మరో ముగ్గురు విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని నాచ్చియాపురానికి చెందిన షణ్ముగ వేల్(55), మురుగేషన్ (53) అన్నదమ్ముళ్లు. తిరునల్వేలి జిల్లా కైత్తారులో బుధవారం జరిగిన బంధువుల ఇంటి శుభకార్యానికి కారులో కుటుంబంతో కలిసి వెళ్లారు. రాత్రి తిరుగు పయనంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన షణ్ముగప్రియ(10), ఆవుడయమ్మాల్(50), ధనలక్ష్మి(52) ఘటనా స్థలంలోనే మరణించారు. షణ్ముగ వేల్, మురుగేషన్, ముత్తులక్ష్మి, రామలక్ష్మి తీవ్రంగా గాయపడి మదురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం.. -
రెండు గంటలు నరకయాతన..
సాక్షి, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదగిరిగుట్ట వైపు నుండి చిట్యాల వైపు వస్తున్న డీసీఎం వాహనం.. చిట్యాల నుండి యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న కారు.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు, డీసీఎం వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నుంచి క్లీనర్ బయటపడగా.. డ్రైవర్ మాత్రం సుమారు రెండు గంటల సేపు క్యాబిన్లో ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. పక్కనే ఉన్న కంపెనీలో ఉన్న జేసీబీ క్రేన్ సహాయంతో రెండు గంటలసేపు కష్టపడి డ్రైవర్ని క్యాబిన్ నుంచి వెలికితీశారు. దీంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు నార్కట్‌మిల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. -
బోలేరో ఢీకొని 20 మంది గాయాలపాలు
సాక్షి, కమ్మర్పల్లి(బాల్కొండ): కమ్మర్పల్లి శివారులోని 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి మిషన్ భగీరథ పనుల కోసం కూలీలు వాహనంలో వెళ్తున్నారు. మెట్పల్లి నుంచి మహారాష్ట్రలోని చింగోలికి బోలేరో వాహనం వెళ్తోంది. కమ్మర్పల్లి శివారులోని మోర్తాడ్ రోడ్‌లోని జనని ధ్యాన యోగా శిక్షణ కేంద్రం వద్ద 63వ నంబరు జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాల్లోని సుమారు 20 మందికి పైగా గాయాలు కాగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని భీమ్‌గల్ సీఐ సైదయ్య సందర్శించి పరిశీలించారు. -
జాతీయ రహదారిపై రక్తసిక్తం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : మెట్పల్లి మండలం ఆరపేట శివారు 63వ జాతీయ రహదారి శుక్రవా రం రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మెట్పల్లి ఏఎస్సై నారాయణబాబు కథనం ప్రకారం.. నిజామాబాద్–2 డిపోకు చెం దిన బస్సు కరీంనగర్ వైపు నుంచి నిజామాబాద్ వెళ్తోంది. ఆరపేట శివారులోకి రాగానే.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో రెండు వా హనాల ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యాయి. గుంటూరు జిల్లా నర్సంపేట మండలం అంబపూ డి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సింగారపు ఎలమంద (39) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతడిని బయటకు లాగేందుకు జేసీ బీని రప్పించారు. లారీ శకలాలను తొలగించి.. జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయా డు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న పదమూడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల ద్వారా తెలి సింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై నారాయణబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువైపులా జాతీయ రహదారిపై ఆగిపోయిన ట్రా ఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ (మెట్పల్లి డిపో) స్టాలిన్, మానకొండూరు మండల కేం«ద్రానికి చెందిన రేణికుంట శ్రీధర్, తాళ్లపల్లి శేఖర్, గంజిరాజు, గంజివాణి, గంజి దుర్గ, విద్యప్రియ, రాజవిజయ్ సాగర్, రజిత్ ప్రిన్స్, కొత్తగూడెంకు చెందిన రోహిత్ ఉన్నారు. కండక్టర్లు జి.నర్సయ్య, ఎన్.సుభాష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్నున్నట్లు ఏఎస్సై వివరించారు. అరగంటపాటు నరకయాతన లారీడ్రైవర్ అరగంటపాటు నరకయాతన అనుభవించాడు. బస్సు ఢీకొన్న అనంతరం అందరూ అతడు చనిపోయాడని భావించారు. పోలీసులు.. స్థానికులు జేసీబీ సాయంతో వాహనాలను విడగొట్టి.. డ్రైవర్‌ను బయటకు తీయగా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా.. చనిపోవడం విషాదాన్ని నింపింది. -
తండ్రీకూతుళ్లను కారుతో ఢీకొట్టిన బాలుడు
ఏలూరు టౌన్ : ఏలూరులో ఆదివారం జరిగిన ఎంసెట్ పరీక్ష రాసి తిరిగి ఇంటికి వెళుతుండగా ఒక బాలుడు కారు ను వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళుతోన్న తండ్రీ, కూతుళ్లను ఢీకొనటంతో వారిద్దరూ రోడ్డు పక్కన పొదల్లో పడిపోయారు. భయంతో కారును ఆపకుండా బాలుడు వెళ్లిపోగా, పొదల్లో పడి ఉన్న తండ్రీ, కూతుళ్లను స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి....కృష్జాజిల్లా ఆటపాకకు చెందిన చెల్లిముంత గంగాధర్ (48), కుమార్తె చెల్లిముంత మానస (18) ఉదయం ఏలూరులో జరిగే ఎంసెట్ పరీక్ష రాసేందుకు వచ్చారు. గంగాధర్ విజయవాడలో స్టేట్‌బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతున్నారు. పరీక్ష ముగిసిన అనంతరం తిరిగి వెళుతుండగా, లింగారావుగూడెం వద్దకు వచ్చే సరికి వేగంగా నడుపుతూ వస్తోన్న బాలుడు కారుతో మోటారుసైకిల్‌ను ఢీకొనటంతో ఇద్దరూ ఎగిరి పొదల్లో పడిపోయారు. అయితే ఆ బాలుడు కారును ఆపకుండా వెళ్లిపోయి లింగారావుగూడెంలోని శ్మశానంలో ఆపాడని, కారుకు రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కారును స్వాధీనం చేసుకున్న ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ పైనుంచి దూకిన మహిళ మృతి
తొగుట(దుబ్బాక): బైక్ పైనుంచి దూకి గాయపడిన మహిళ సోమవారం మరణించిందని తొగుట ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరెడ్ల భారతమ్మ (50) రోజూ సిద్దిపేటలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేందుకు ఘణపురం వెళ్లే ఆటోలో మెట్టు వరకు వచ్చింది. అక్కడ మరో ఆటోకోసం ఎదురుచూస్తున్న క్రమంలో వేములఘాట్ మదిర తుర్కబంజేరుపల్లికి చెందిన ఇరుగదిండ్ల ప్రశాంత్ బైక్ ఎక్కింది. ఈ క్రమంలో అతడు ఎల్లారెడ్డిపేట స్టేజీ వద్ద బైక్ ఆపకుండా వెళ్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన భారతమ్మ బైక్ పైనుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను ప్రశాంత్ చికిత్స కోసం సిద్దిపేటకు తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్ వద్ద భారతమ్మ మృతిచెందింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ వివరించారు. -
తాండూర్‌కు వస్తుండగా ఎమ్మెల్యేకు ప్రమాదం..
సాక్షి, వికారాబాద్: కర్ణాటక ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్నబొలెరో వాహనాన్ని కర్ణాటకలోని పోలక్‌పల్లి వద్ద వెనకే వస్తున్న గ్జైలో బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తాండూర్ మండలం కొత్లాపూర్లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఉమేష్ స్నేహితుడు జనార్దన్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరిని హుటాహుటిన చించోలీ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కారుకు అడ్డుగా వచ్చిన ఆవును తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉమేష్ జాదవ్ కర్ణాటక చించోలీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
తిరుమలాయపాలెం : మండలంలోని కొక్కిరేణి స్టేజీ సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్సీఎం బోర్డింగ్ హాస్టల్లో ఉంటున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ఆర్సీఎం బోర్డింగ్ హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను హాస్టల్ వార్డెన్ జూగుట్ల ప్రభాకర్‌రావు శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రెండు మోటార్ సైకిళ్లపై ఖమ్మంలో సెకండ్‌షో సినిమాకు తీసుకవెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఓ మోటార్ సైకిల్ రిపేరుకి రావడంతో అర్థరాత్రి సమయంలో ఆరుగురు విద్యార్థులను ఒకే మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజి సమీపంలోకి రాగానే అదుపుతప్పి మోటార్ సైకిల్ పడిపోయింది. ఈ సంఘటనలో విద్యార్థులు నీలం మహేష్, కంచం సతీష్, మిద్దె ప్రతాప్, బానోత్ తరుణ్, రంజిత్ కుమార్, దారావత్ నాగేందర్‌కు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా వీరిని 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అజాగ్రత్తతో పాటు అపరిమితంగా వాహనంపై ఎక్కించుకుని పిల్లల ప్రమాదానికి కారణమైన వార్డెన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు
పాట్నా: బిహార్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి క్షేమంగా ఉన్నారని పాట్నా పోలీసులు వెల్లడించారు. చికిత్స అనంతరం మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. శరణ్ జిల్లాలోని ఛాప్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో రూడీ పాల్గొని పాట్నాకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా దెబ్బతింది.