తాండూర్‌కు వస్తుండగా ఎమ్మెల్యేకు ప్రమాదం.. | Chincholi MLA Injured In Car Accident | Sakshi
Sakshi News home page

తాండూర్‌కు వస్తుండగా ఎమ్మెల్యేకు ప్రమాదం..

Published Wed, Mar 28 2018 8:28 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Chincholi MLA Injured In Car Accident - Sakshi

సాక్షి, వికారాబాద్‌: కర్ణాటక ఎమ్మెల్యే ఉమేష్‌ జాదవ్‌ ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్నబొలెరో వాహనాన్ని కర్ణాటకలోని పోలక్‌పల్లి వద్ద వెనకే వస్తున్న గ్జైలో బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తాండూర్‌ మండలం కొత్లాపూర్‌లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఉమేష్‌ స్నేహితుడు జనార్దన్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరిని హుటాహుటిన చించోలీ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కారుకు అడ్డుగా వచ్చిన ఆవును తప్పించే క్రమంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉమేష్‌ జాదవ్‌ కర్ణాటక చించోలీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement