thandur
-
Thandur: నారాయణ స్కూల్ బరితెగింపు
‘‘అడిగినంత కట్టకపోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో చేర్చుతాం.. కంప్లయింట్ చేస్తారా?.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’.. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరు ఇది. అధిక ఫీజులతో వేధింపులకు పాల్పడుతుండడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. దీంతో విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సదరు నారాయణ స్కూల్ యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న తీరూ బయటపడింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై నిబంధనలు ఉన్నా పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ పాఠశాల యాజమాన్యం బరితెగింపునకు దిగింది. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై వేధింపులకు గురిచేస్తుంది. నిబంధనలుకు విరుద్ధంగా ఫీజులు కట్టాలని ఒత్తిడికి పాల్పడుతుంది. ఫీజులు కట్టక పోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతోంది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. అధికారులు మమల్ని ఏమీ చేయలేరంటూ జులుం ప్రదర్శిస్తోంది. పాఠశాల యాజమాన్యం తీరుపై విసుగెత్తిపోయిన తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి మరీ.. పిల్లలకు అంగీకరించిన ఫీజుల కంటే ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. తల్లిదండ్రులు కట్టమని చెబితే.. దుర్భాషలాడుతున్నారని, పిల్లల విద్యాసంవత్సరం నష్టపోయేలా చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించని నారాయణ స్కూల్ పిన్సిపాల్. యాజమాన్యంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే స్కూల్‌కు అపాలజీ నోటీసు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ స్కూల్‌కు ఏడవ తరగతి వరకే అనుమతి ఉండగా.. పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందన దాటవేయడం గమనార్హం. -
చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గడువు కావాలని కోరుతూ చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించడంతో విచారణకు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్జి. రోహిత్ రెడ్డి లేఖను తిరస్కరిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు కచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేసింది ఈడీ. దీంతో తాను విచారణకు హాజరైనట్లు చెప్పారు రోహిత్‌రెడ్డి. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు సమయం కోరాను. కానీ అందుకు ఈడీ నిరాకరించింది. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో వచ్చాను. చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చాను ఏ కేసులో విచారణకు పిలిచారో తెలియదు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. ఇదీ చదవండి: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్! -
ఒత్తిడి చేస్తున్నారు.. అక్కడి నుంచే పోటీ చేస్తా
సాక్షి,తాండూరు(వికారబాద్): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తాండూరు నుంచి పోటీ చేస్తానని, ఈమేరకు ఇక్కడి ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్, సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తంరావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తాను తాండూరులో ఉంటున్నానని, నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యానన్నారు. దీంతో ఈ స్థానాన్ని వదులుకొనే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పెద్దఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారని, ప్రజల అభీష్టం మేరకు పోటీకి దిగుతానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ తాను విజయం సాధిస్తానని ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు సైతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు చేరిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ కేడర్ పటిష్టంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులే ఎమ్మెల్యే వెంట వెళ్లారని, అయినా తనకు ఫోన్లో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మంత్రి పదవి రానుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. అది సీఎం చేతిలో ఉందని స్పష్టం చేశారు. తాండూరు ప్రజలకు ఇప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు. తాండూరు మున్సిపాలిటికి ఐదేళ్లపాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగుతారని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత చైర్పర్సన్ మార్పు ఉంటుందని గతంలో ప్రకటించిన విషయాన్ని విలేకర్లు గుర్తు చేయగా.. అది అప్పటి పరిస్థితుల మేరకు టెన్షన్లో తీసుకున్న నిర్ణయమని కొట్టిపారేశారు. అనంతరం వీరశైవ సమాజం ప్రతినిధులకు స్మశానవాటిక అభివృద్ధికి రూ.5 లక్షల నిధులను కేటాయించి ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బొబ్బిలి శోభరాణి, ప్రవీణ్‌గౌడ్, రామకృష్ణ, వెంకన్నగౌడ్, నాయకులు జబేర్లాలా, వడ్డె శ్రీనివాస్, బిర్కట్ రఘు ఉన్నారు. -
వాహనదారులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు
-
ఒక్కటైన కాంగ్రెస్ నేతలు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి మరోసారి రుజువైంది. నిన్న మొన్నటి వరకు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కాంగ్రెస్ తాండూరు నేతలు నేడు ఐక్యతారాగం వినిపిస్తున్నారు. తాండూరులో పార్టీ పగ్గాలు తమ చేతుల్లో నుంచి జారిపోతున్నాయనే భావనే దీనికి కారణం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతూ.. అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన తమకు.. కొత్త నేతల ఎంట్రీతో ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని భావించారు. దీంతో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఒక్కతాటిపైకి వచ్చారు. తాండూరులో ఇన్నాళ్ల పాటు రెండు వర్గాలుగా కొనసాగిన మహరాజులు, లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో స్థానికంగా జరుగుతున్న పరిణామాలన్నింటికీ పైలెట్ రోహిత్‌రెడ్డియే కారణమంటూ ఏకంగా టీపీసీసీ నేతలను కలిసి ఫిర్యాదు చేయడం గమనార్హం. తాండూరు : ఏడాది క్రితం వరకు తాండూరులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయం సాధిస్తారనే విధంగా ఉండేది. ఏడాది క్రితం పట్టణంలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఏఐసీసీ ప్రతినిధులు.. తమ అభ్యర్థిగా రమేష్ మహరాజ్ పేరు ప్రకటించారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని సీనియర్ నాయకులు మహరాజుల కుటుంబంపై తిరుగుబావుటా ఎగురవేశారు. నాటి నుంచి మహరాజుల(రమేష్ మహరాజ్)కు వ్యతిరేకంగా పని చేశారు. లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్ తాము సైతం ఎన్నికల బరిలో ఉంటామని ప్రచారం చేసుకున్నారు. రమేష్ వర్గంతో దూరంగా ఉంటూవచ్చిన వీరిరువురూ కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. రమేష్ మహరాజ్ ఏడాది కాలంగా పార్టీలో చురుగ్గా పని చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఆయనకు పూర్తి సహకా రం అందించారు. అయితే లక్ష్మారెడ్డి, సునీత తీరు రమేష్‌కు ఇబ్బందికరంగా మారడంతో కలత చెందారు. ఈ నేపథ్యంలో తన వంశస్తుల నుంచి, లక్ష్మారెడ్డివర్గం నుంచి సరైన మద్దతు లభించలేదు. అప్పటికే కొంత అనారోగ్యానికి గురైన రమేష్ మహరాజ్ వైద్య పరీక్షల కోసం ఆమెరాకా వెళ్లాల్సి వచ్చింది. అనుకోకుండా ప్రభుత్వం రద్దు కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఏళ్ల తరబడి తన వెంట నడిచిన నాయకులను.. కొత్తగా పార్టీలో చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డికి జత కలిపారు. టికెట్ సైతం పైలెట్‌కు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాసి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవల ఇండియా తిరిగొచ్చిన రమేష్‌కు తాండూరు రాజకీయాలు విస్మయం కలిగించాయి. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కబెట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి నడుం కట్టారు. సీనియర్లలో అంతర్మథనం.. తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున పైలెట్ రోహిత్‌రెడ్డి పేరును అధిష్టాన నేతలు జాబితాలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు సీనియర్లు అంతర్మథనానికి గురయ్యారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేతలు.. ఇక పార్టీ బాధ్యతలు తమ చేతుల్లో నుంచి జారిపోతున్నాయని భావించారు. రోహిత్ వస్తే తమ ప్రభావం ఉండదని నిర్ణయించుకున్నారు. సీనియర్లకే అవకాశం ఇవ్వాలని, దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న వారిని పక్కనబెట్టి కొత్తవారికి రెడ్ కార్పెట్ వేయొద్దని అభ్యర్థిస్తూ గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు. అయి తే వాట్సప్ గ్రూపుల్లో బీసీలపై అనుచిత వ్యాఖ్య లు చేశారని రోహిత్‌రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బీసీ సంఘం నాయకులు రంగంలోకి దిగి రోహిత్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముదిరాజ్‌లతో పాటు బీసీలను దూషించిన రోహిత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోహిత్‌కు టికెట్ రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ తాండూరు నాయకులంతా ఒక్కటయ్యారు. ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఢిల్లీకి చేరడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. రోహిత్‌ను సస్పెండ్ చేయండి టీఆర్ఎస్ బహిష్కృత నేత, యంగ్లీడర్స్ అధ్యక్షుడు రోహిత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తాండూరుకు చెందిన ఆ పార్టీ నాయకులు గురువారం టీపీసీసీ నేతలకు విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్‌మహరాజ్, సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి చందుమహరాజ్ తనయుడు నరేష్ మహరాజ్, సంపత్‌కుమార్, తాండూరు పట్టణ అధ్యక్షుడు పట్లోళ్ల నర్సింలు, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసచారి తదితరులు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పెద్దలను కలిశారు. పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ హోంమంత్రి జానారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ హోంమంత్రి సబితారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.నియోజకవర్గంలో అత్యధిక జనాభా,ఓటర్లు ఉన్న బీసీలపై, ముదిరాజ్ సామాజికవర్గంపై రోహిత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఈయన కారణంగా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పారు. -
తాండూర్‌కు వస్తుండగా ఎమ్మెల్యేకు ప్రమాదం..
సాక్షి, వికారాబాద్: కర్ణాటక ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్నబొలెరో వాహనాన్ని కర్ణాటకలోని పోలక్‌పల్లి వద్ద వెనకే వస్తున్న గ్జైలో బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తాండూర్ మండలం కొత్లాపూర్లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఉమేష్ స్నేహితుడు జనార్దన్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరిని హుటాహుటిన చించోలీ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కారుకు అడ్డుగా వచ్చిన ఆవును తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉమేష్ జాదవ్ కర్ణాటక చించోలీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
తాండూరులో భారీ చోరీ
వికారాబాద్ : తాండూరు మండలం బెల్కటూరు గ్రామ సమీపంలోని పెన్నాకాలనీలో భారీ చోరీ జరిగింది. సుమారు ఎనిమిది ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. కాలనీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అలారం తొలగించి దుండగులు ఈ ప్రయత్నానికి ఒడిగట్టారు. చోరీ జరిగిన ఇళ్లను తాండూరు డిఎస్పీ రామచంద్రుడు, సీఐ సైదిరెడ్డి పరిశీలించారు. కొంత మంది బాధితులు హైదరాబాద్ హాస్టల్లో ఉంటున్న వాళ్ల పిల్లల దగ్గర కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది బాధితులు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
పుర్రెలు, ఎముకలతో భయాందోళన
తాండూరు: పట్టణంలో మనిషి పుర్రెలు, ఎముకలు కలకలం సృష్టించాయి. జనవాసాల సమీపంలో రోడ్డు పక్కన పుర్రె, ఎముకలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన బుధవారం తాండూరులో వెలుగు చూసింది. వివరాలు.. తాండూరులోని యాదిరెడ్డి చౌక్ నుంచి పోలీసుస్టేషన్ వెళ్లే మార్గంలో రోడ్డుపక్కన ఓ ప్లాస్టిక్ కవర్‌ను పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించారు. అందులో చూడగా మనిషికి చెందిన రెండు పుర్రెలు, ఎముకలు, దంతాలు కనిపించాయి. కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు సమాచారంతో ఎస్ఐ మహ్మద్ ఖలీల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పుర్రెలు, ఎముకలు గుర్తుతెలియని వ్యక్తులు కొద్దిదూరంలో ఉన్న శ్మశానంలో క్షుద్రపూజల కోసం వినియోగించి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలపై ఇంగ్లీష్‌లో మెడికల్ టర్మినాలజీ పదాలు రాసి ఉన్నాయని ఎస్ఐ చెప్పారు. ఆస్పత్రుల నిర్వాహకులు, లేదా ఎంబీబీఎస్ విద్యార్థులు తమ చదువుల నిమిత్తం పుర్రెలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
చెప్పులతో కొట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు
తాండూరు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఇద్దరు కౌన్సిలర్లు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం చోటు చేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోఫియా, ఫసియుద్దీన్ లకు గత కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశానికి వారు ఇరువురు హజరయ్యారు. సమావేశంలో సర్వే నెంబరు 128 స్థల వివాదంలో ఒకరిని ఒకరు దూషించుకోవడంతో ఆగ్రహానికి గురై చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. వెంటనే స్పందించిన తోటి కౌన్సిలర్లు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా గొడవ సద్దుమనగలేదు. కాగా, చైర్ పర్సన్ తీసుకున్న నిర్ణయాలను వైస్ చైర్ పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు తప్పుపట్టడంతో సమావేశం వాయిదా పడింది. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
తాండూరు (రంగారెడ్డి): భర్త చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని మాల్కాపూర్ గ్రామానికి చెందిన అంతమ్మపై భర్త భీమయ్య ఆగస్టు 31న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
తాండూరు: ఆదిలాబాద్ జిల్లా తాండూరులో గూడ్స్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో రేచినిరోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న అంజయ్య (35) అనే కూలీని గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థి వాహనంపై దాడి
-
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో మార్పులుండవు
తాండూరు, న్యూస్‌లైన్: టీఆర్ఎస్తో పొత్తు, విలీనం.. ఏది జరిగినా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో అధిష్టానం మార్పులు చేయదని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ స్థానాలపైనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పొత్తా, విలీనమా అనేది పక్కనపెడితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సోనియాగాంధీకి పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని, కేసీఆర్ కూడా అదేవిధంగా ఉంటారని అనుకుంటున్నట్టు చెప్పారు. సర్వేల ప్రకారం గెలిచే నాయకులకే జిల్లాలో ఎమ్మెల్యే టికె ట్లు వస్తాయని, ఈ విషయంలో తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని అన్నారు. మున్సిపల్ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగానే భావిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కదనే కొందరు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. వికారాబాద్‌లో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. రెండేళ్లు మంత్రిగా జిల్లాలో ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సమర్థవంతమైన నేతనే సీఎంగా చేయాలన్నా రు. సమావేశంలో పార్టీ నాయకులు రమేష్, విశ్వనాథ్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, అనురాధ ముదిరాజ్, అపూ, డా.సంపత్‌కుమార్, ధారాసింగ్ పాల్గొన్నారు. -
‘ఎస్ఎన్సీయూ’లో విద్యుత్ అంతరాయం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో (ఎస్ఎన్సీయూ) ఏర్పడిన విద్యుత్ అంతరాయం చిన్నారులకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల చికిత్స పొందుతున్న చిన్నారులను బయటకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. అనారోగ్యంతో జన్మించిన శిశువుల సంరక్షణార్థం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనిని నివారించటానికి ఎస్ఎన్సీయూని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో మంగళవారం విద్యుత్ సరఫరా చేసే ఇన్వర్టర్లు పాడయ్యాయి. దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లా ఆస్పత్రి టెక్నీషియన్లు మరమ్మతు చేసేందుకు విఫలయత్నం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చికిత్స పొందుతున్న 13 మంది చిన్నారులను బయటకు తరలించాల్సి వచ్చింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అకస్మాత్తుగా ఎస్ఎన్సీయూకి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇన్వర్టర్లలో సమస్య తలె త్తిందని వెంటనే మరమ్మతు చేయిస్తామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 13 మంది శిశువుల్లో 10మంది ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని ఇంటికి తీసుకెళ్లవచ్చని కుటుంబసభ్యులకు చెప్పామన్నారు. అయితే ముగ్గురు చిన్నారుల పరిస్థితి బాగలేకపోవడంతో రిఫర్ చేశామన్నారు. కాగా సాయంత్రం ఇన్వర్టర్లకు మరమ్మతు చేయించి తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
‘కోట్‌పల్లి’ ఆధునికీకరణకు రూ.25 కోట్లు
తాండూరు, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రాంతంలో చెరువుల అభివృద్ధి, కొత్తవి నిర్మించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు మైనర్ ఇరిగేషన్ విభాగం తెలంగాణ రీజియన్ సీఈ రాజేశ్వర్ చెప్పారు. శనివారం ఆయన తాండూరు ఇరిగేషన్ డీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.330కోట్ల ‘జైకా’ (జపాన్) నిధులతో తెలంగాణ రీజియన్‌లో 52 చిన్ననీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటిలో ఆదిలాబాద్ జిల్లాలోనే 50 చెరువులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లాలోని ఎర్రబంక వాగు వద్ద ఒక చెరువు, రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలో ఒక చెరువు నిర్మిస్తున్నామన్నారు. నీటి నిల్వ కోసం మెదక్ జిల్లాలో 7 చెక్‌డ్యాంలు నిర్మిం నిర్మించినట్టు చెప్పారు. రాష్ట్ర నీటి కేటాయింపుల ప్రకారం ఆదిలాబాద్‌లో నీటి వనరులు అధికంగా ఉన్నందున ఇక్కడ చిన్ననీటి ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 52 చిన్ననీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలో సుమారు 27వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గత ఏడాది జూన్‌లోనే ఈ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉండగా.. ఆలస్యం జరిగిందని, వచ్చే ఏడాది జూన్‌లో వీటిని పూర్తిచేస్తామన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు)లో రూ.8.52కోట్లతో చేపట్టనున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రస్తుతం చెక్‌డ్యాం నిర్మాణానికి అవసరమైన పది ఎకరాల స్థలం సేకరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మూడు మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ చెక్‌డ్యాంలో 0.30టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉందని అన్నారు. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌తో పాటు తాండూరు పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు సమస్య ఉండదన్నారు. సుమారు 30 గ్రామాల పరిధిలో బోర్లు, బావులో భూగర్భ జలాలు పెంపొందుతాయని చెప్పారు. పెద్దేముల్‌లోని కోట్‌పల్లి మధ్యతరహా ప్రాజెక్టును రూ.25కోట్లతో ఆధునికీకరించనున్నట్టు తెలంగాణ రీజియన్ మైనర్ ఇరిగేషన్ సీఈ రాజేశ్వర్ తెలిపారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల ఫైలు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) పరిశీలనలో ఉందని, త్వరలోనే క్లియరెన్స్ వస్తుందన్నారు. అలాగే మరో రూ.24కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించనున్నట్టు చెప్పారు. యాలాల మండలంలో ఆగిపోయిన శివసాగర్ ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు. సుమారు 12 కిలోమీటర్ల కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి స్థలం కేటాయింపు జరగలేదన్నారు. రైతులకు పరిహారం అందించిన తరువాత ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కాంట్రాక్టర్‌కు ఇప్పుడున్న సిమెంట్, డీజిల్, స్టీల్ ధరల ప్రకారం చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. తాండూరు పట్టణంలోని ఐబీ అతిథిగృహాన్ని కొత్తగా జీ+1 పద్ధతిలో రూ.2కోట్లతో నిర్మించనున్నట్టు ఆయన వివరించారు. కబ్జాకు గురైన అతిథిగృహం స్థలం తిరిగి పొందేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ ందర్భంగా చెక్‌డ్యాం నిర్మించనున్న కాగ్నా వాగును సీఈ పరిశీలించారు. అంతకుముందు నాగులపల్లిలో రూ.2కోట్లతో నిర్మించనున్న చెరువు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. విలేకరుల సమావేశంలో మైనర్ ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (హైదరాబాద్) వి.లింగరాజు, వికారాబాద్ ఈఈ వెంకటేష్, తాండూరు డీఈ నర్సింహ, జేఈ ధర్మకుమార్, నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్ అమరేందర్ పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న చలి 9.2 డిగ్రీలు
తాండూరు, న్యూస్‌లైన్: రోజురోజుకూ విజృం భిస్తున్న చలి జిల్లా ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఉదయమంతా పొగమంచు కమ్ముకుంటుండ గా, మధ్యాహ్నం నుంచి చల్లనిగాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజ లు వజవజ వణికిపోతున్నారు. ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీంతో ఉదయం 8గంటలు దాటుతున్నా పొగమంచు వీడటం లేదు. శనివారం నమోదైన 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రెండేళ్ల తరువాత ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. సాధారణంగా రాత్రి వేళలో 10-11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతేనే చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. గడిచిన రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ శనివారం 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. ఈ నెల 1వ తేదీన 16.5 డిగ్రీలు, 2న 17.9, 3న 19, 4న 16.9, 5న 12.9, 6న 11.2, 7వ తేదీన 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 4వ తేదీ నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. 4వ తేదీ నుంచి 5వ తేదీన నాటికి 4 డిగ్రీలు తగ్గిపోగా, 6వ తేదీ నుంచి 7వ తేదీ నాటికి రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తోంది.