సాక్షి, హైదరాబాద్: గడువు కావాలని కోరుతూ చేసిన అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించడంతో విచారణకు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్జి. రోహిత్ రెడ్డి లేఖను తిరస్కరిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు కచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేసింది ఈడీ. దీంతో తాను విచారణకు హాజరైనట్లు చెప్పారు రోహిత్‌రెడ్డి. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు సమయం కోరాను. కానీ అందుకు ఈడీ నిరాకరించింది. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో వచ్చాను. చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చాను ఏ కేసులో విచారణకు పిలిచారో తెలియదు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్‌ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment