న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమనతుల్లాఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. వక్ఫ్ బోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఖాన్‌ను ఈడీ సోమవారం(సెప్టెంబర్2) అదుపులోకి తీసుకుంది. అమనతుల్లాఖాన్ అరెస్టుకు ముందు సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఉదయమే తన ఇంటికి ఈడీ వచ్చిందని, తనను అరెస్టు చేస్తుందని ఎమ్మెల్యే ఖాన్ ఎక్స్ (ట్విటర్)లో పోస్టులు పెట్టారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
అయితే సోదాల సందర్భంగా ఈడీ అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని, నాలుగు రోజుల క్రితమే క్యాన్సర్ సర్జరీ జరిగిన తన తల్లిని వేధించారని ఖాన్ తెలిపారు. రెండేళ్ల నుంచి తనపై తప్పుడు కేసుపెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment