తాండూరు: ఆదిలాబాద్ జిల్లా తాండూరులో గూడ్స్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో రేచినిరోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న అంజయ్య (35) అనే కూలీని గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.