తాండూరు, న్యూస్‌లైన్: రోజురోజుకూ విజృం భిస్తున్న చలి జిల్లా ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఉదయమంతా పొగమంచు కమ్ముకుంటుండ గా, మధ్యాహ్నం నుంచి చల్లనిగాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజ లు వజవజ వణికిపోతున్నారు. ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీంతో ఉదయం 8గంటలు దాటుతున్నా పొగమంచు వీడటం లేదు. శనివారం నమోదైన 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రెండేళ్ల తరువాత ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు.
గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి.
సాధారణంగా రాత్రి వేళలో 10-11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతేనే చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. గడిచిన రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ శనివారం 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది.
ఈ నెల 1వ తేదీన 16.5 డిగ్రీలు, 2న 17.9, 3న 19, 4న 16.9, 5న 12.9, 6న 11.2, 7వ తేదీన 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 4వ తేదీ నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. 4వ తేదీ నుంచి 5వ తేదీన నాటికి 4 డిగ్రీలు తగ్గిపోగా, 6వ తేదీ నుంచి 7వ తేదీ నాటికి రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తోంది.
విజృంభిస్తున్న చలి 9.2 డిగ్రీలు
Published Sat, Dec 7 2013 11:39 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement