Degrees
-
ఆ కంపెనీలకు ‘ఇంకా డిగ్రీ’లే కొలమానం!
సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకుంటాయి. అయితే ఆ ధోరణికి స్వస్తి పలుకుతామని కొన్ని కంపెనీలు గతంలో వాగ్దానాలు చేశాయి. డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించాయి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అభ్యర్థులకు కళాశాల డిగ్రీలు ఉండాలనే నిబంధనను వదులుకుంటామని వాగ్దానం చేసిన కంపెనీలలో ఉన్నాయి. అయితే హార్వర్డ్ బిజినెస్ స్కూల్, బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.. వారి నియామక పద్ధతులు ఇప్పటికీ పాత ధోరణినే అనుసరిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇప్పటికీ కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. ఆయా కంపెనీల్లో డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకుంటామని చెప్పిన సుమారు 11,300 ఉద్యోగాలను 2014 తర్వాత నుంచి అధ్యయనం పరిశీలించింది. గత సంవత్సరం జరిగిన 700 మంది నియామకాలను పరిశీలించగా డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకున్న ఉద్యోగం ఒక్కటీ లేదని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనంలో కంపెనీలను మూడు వర్గాలుగా విభజించారు. వాల్‌మార్ట్, యాపిల్, టార్గెట్‌తో సహా 37 శాతం కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకంలో పురోగతి సాధించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్‌లతో సహా 45 శాతం కంపెనీలు డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేపట్టడంలో విఫలమయ్యాయి. ఇక మూడవ వర్గం కంపెనీలను "బ్యాక్స్లైడర్స్" అని పిలుస్తారు. వాటిలో నైక్, ఉబెర్, డెల్టా ఉన్నాయి. నివేదికలో 18 శాతంగా ఉన్న ఈ కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకాల విషయంలో మొదట్లో పురోగతిని సాధించాయి. కానీ తర్వాత పాత పద్ధతికే వచ్చేశాయి. -
డిగ్రీ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు.. యూజీసీ కీలక ఆదేశాలు
డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు ముద్రించకూడదంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఆదేశించింది. రిక్రూట్మెంట్ లేదా అడ్మిషన్ సమయంలో పేర్కొన్న పత్రాల వెరిఫికేషన్‌లో తదుపరి ఉపయోగం కోసం తాత్కాలిక సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలపై పూర్తి ఆధార్ నంబర్లను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన ఆధార్ రెగ్యులేషన్స్ 2016 చట్టంలోని రెగ్యులేషన్ 6, సబ్-రెగ్యులేషన్ (3) ప్రకారం ఏ విద్యా సంస్థా విద్యార్థుల ఆధార్ నంబర్లతో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పంపిన సెప్టెంబర్ 1 నాటి లేఖలో యూజీసీ కార్యదర్శి మనోజ్ జోషి పేర్కొన్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. UGC Letter regarding display of Aadhaar number on provisional certificates and degrees issued by universities. Read:https://t.co/jtxN2oDipB pic.twitter.com/TSK9ne8hdV — UGC INDIA (@ugc_india) September 1, 2023 -
మానవతా విలువల్ని పరిరక్షిద్దాం
సుభాష్‌నగర్: మన జీవితాలు యంత్రాలతో ఎంతగానో పెనవేసుకుపోయాయని, వాటిని వినియోగిస్తూనే సమాజంలో మానవతా విలువల్ని కూడా పరిరక్షించేలా మనం ముందుకు సాగాలని మహీంద్రా యూనివర్శిటీ చాన్స్‌లర్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బహదూర్‌పల్లిలోని మహీంద్ర యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, అప్‌గ్రేడ్ చైర్మన్ రొన్నీ స్రీవల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 76 సంవత్సరాలుగా టెక్ మహీంద్ర కంపెనీ సేవలందించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు మానవాభివృద్ధికి దోహదపడే నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలన్నారు. టెక్ మహీంద్ర ఎండీ మోహిత్ జోషి, మహీంద్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేదురి, యూనివర్సిటీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఏకకాలంలో రెండు కోర్సులు అభ్యసించేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు జారీచేసింది. పీహెచ్డీ మినహా మిగిలిన కోర్సులకు నిబంధనలను అనుసరించి వీటిని విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అన్ని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఈమేరకు చర్యలు చేపట్టాలని తాజాగా ఆదేశించింది. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 విధానాల్లో పూర్తిగా మార్పులు చేయాలని సూచించింది. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలో నచ్చిన కోర్సులను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని, ఆన్లైన్ విద్య కార్యక్రమాలను సిద్ధం చేయాలని ఆయా విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. ఇవీ మార్గదర్శకాలు ♦ఒక విద్యార్థి ఫిజికల్ మోడ్‌లో రెండు విద్యా కార్యక్రమాలను పూర్తి సమయం కొనసాగించవచ్చు. తరగతి సమయాలు భిన్నంగా ఉండేలా చూడాలి. ♦విద్యార్థి రెండు విద్యా కార్యక్రమాలను ఒకేసారి కొనసాగించవచ్చు, ఒకటి పూర్తి సమయం భౌతికంగా మరొకటి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్)/ఆన్లైన్ మోడ్‌లో చేయవచ్చు. లేదా రెండూ ఓడీఎల్/ఆన్లైన్ ప్రోగ్రామ్‌లలో ఏకకాలంలో అభ్యసించవచ్చు. ♦ఓడీఎల్/ఆన్లైన్ మోడ్ కింద డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లు యూజీసీ/చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వాలు గుర్తించిన కార్యక్రమాలకే పరిమితం కావాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థలే వీటిని చేపట్టాలి. ♦యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రెండు డిగ్రీలు చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా ఉంటే యూజీసీ నిబంధనలను అనుసరించి అనుమతి పొందాలి. నూతన విధానం లక్ష్యాలు ♦విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతించాలి. ♦సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్స్ సహా ఇతర విభాగాల్లో అవకాశం కల్పించాలి. ♦భాష, ప్రొఫెషనల్, టెక్నికల్, వొకేషనల్ విషయాలను కూడా అందుబాటులోకి తేవాలి. ♦నచ్చిన అంశాలను నేర్చుకోవడంతోపాటు ఆసక్తి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో క్షుణ్నంగా అధ్యయనానికి వీలు కల్పించాలి. -
ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు: యూజీసీ అనుమతి
న్యూఢిల్లీ: ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు ఫుల్‌టైమ్ డిగ్రీ కోర్సులు చేసేందుకు యూజీసీ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నిబంధనలు జారీ చేస్తామని, ఈ అవకాశం 2022–23 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా విద్యార్థులు ఒకేసారి బహుళ నైపుణ్యాలు ఆర్జించేందుకు వీలుగా ఒకేమారు రెండు డిగ్రీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామన్నారు. ఒకే విశ్వవిద్యాలయం లేదా వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు చేయవచ్చని చెప్పారు. చదవండి: (ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాక్ నూతన ప్రధాని) -
2014 తర్వాత డిగ్రీలు చెల్లవు!
పలు తత్సమాన కోర్సులపై కేంద్ర ఉత్తర్వులు - అప్పట్లోనే మార్గదర్శకాలు జారీ.. ఆలస్యంగా వెలుగులోకి.. - టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తెప్పించిన విద్యాశాఖ - 129 డిగ్రీలే చెల్లుబాటు.. 2014 తర్వాత వేరే పేర్లతో ఉంటే చెల్లవు - 16 రకాల డిగ్రీ తత్సమాన కోర్సులు చెల్లవని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: తెలుగు పండిత శిక్షణ, ఉర్దూ పండిత శిక్షణ, హిందీ పండిత శిక్షణ... రాష్ట్రంలో ఇటీవలి వరకు కొనసాగిన ఉపాధ్యాయ విద్యా కోర్సులివి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ 2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2014 తరువాత ఆ కోర్సులేవీ చెల్లుబాటు కావు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవి పనికిరావు. ఆ కోర్సులను 2014కు ముందు చేసి, అది కూడా ఎన్సీటీఈ గుర్తింపు కలిగి ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇవేకాదు డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటున్న మరో 16 రకాల కోర్సులు కూడా చెల్లుబాటు కావు. ఈ కోర్సులను కూడా 2014కు ముందు చేసి, అప్పట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఇచ్చిన డిగ్రీల జాబితాలో ఉంటే మాత్రమే ప్రస్తుతం ఉద్యోగ దరఖాస్తులకు చెల్లుబాటవుతాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా డిగ్రీలన్నీ ఒకేరకంగా ఉండాలని అప్పట్లోనే యూజీసీ స్పష్టం చేసింది. మొత్తంగా 129 రకాల డిగ్రీలు మాత్రమే ఉండాలని, ఈ మేరకు అవసరమైన మార్పులు చేసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించింది కూడా. విద్యాశాఖ చొరవతో వెలుగులోకి.. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు కొత్త కొత్త పేర్లతో డిగ్రీ తత్సమాన సర్టిఫికెట్లు అంటూ దరఖాస్తు చేస్తున్నారు. అవి సరైన డిగ్రీలా, కాదా? అన్న సందేహం తలెత్తింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన డిగ్రీలు ఉండాలంటూ 2014 జూలై 11న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ వెబ్సైట్లో అందుబాటులో లేకపోవడంతో ఏయే డిగ్రీలకు గుర్తింపు ఉందన్న సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా కోర్సులపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నుంచి స్పష్టత తీసుకురావాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దాంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దీనిపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను, పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్‌ను, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డిని కలిశారు. వాస్తవానికి ఈ అంశాన్ని తేల్చాల్సింది ఉన్నత విద్యా మండలి. అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డి, ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లి.. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటూ నిర్వహిస్తున్న పలు కోర్సులను యూజీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీలకు యూజీసీ గుర్తింపు లేదని, అవి చెల్లవని అధికారులు తేల్చారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మరో 7 రకాల డిగ్రీలపై సందేహాలు ఉన్నాయని, దీనిపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు. యూనివర్సిటీలకే తెలియని పరిస్థితి! డిగ్రీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ యూనివర్సిటీలకే యూజీసీ మార్గదర్శకాలు, డిగ్రీల విషయంలో స్పష్టమైన అవగాహన లేదని.. దాంతో పాత పేర్లతోనే డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని చెబుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి ఒకే రకమైన డిగ్రీలు ఉండాలన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీల పేర్లను మార్చాల్సి ఉందని పేర్కొంటున్నాయి. -
స్నాతకోత్సవంలో విద్యార్థుల పట్టాభిషేకం
⇒ బంగారు పతకాలు అందుకున్న ప్రతిభావంతులు ⇒ మాజీ సీఈసీ వి.ఎస్.సంపత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం ⇒ ప్రణాళికతో సవాళ్లను అధిగమించవచ్చు : సంపత్ ⇒ విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం: వీసీ శ్యాంసుందర్ వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కనులపండువగా సాగిన ఈ సంబరానికి విద్యార్థులు ప్రత్యేక దుస్తులు (గౌనులు) ధరించి హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి వి.ఎస్. సంపత్ లైబ్రరీ బిల్డింగ్ వద్ద గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వైస్‌చాన్స్‌లర్,రిజిస్ట్రార్, డీన్లు ఆయనతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఈసీ సంపత్ మాట్లాడుతూ యువ పట్టభద్రులారా.. చక్కటి ప్రణాళికలతో సవాళ్లను అధిగమించవచ్చని తెలిపారు. స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. స్వచ్ఛ ఇంధనాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే తను వైవీయూలో 20 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని పేర్కొన్నారు. ⇒ పట్టభద్రులంతా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం సంపత్‌కు వైస్‌చాన్స్‌లర్ శ్యాంసుందర్ గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ 2012లో మొదటి స్నాతకోత్సవం నిర్వహించామని, ఇప్పుడు 2, 3,4, 5వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతం ఇస్తూ ర్యాగింగ్‌ను దూరంగా ఉంచుతూ చక్కటి వాతావరణం నెలకొనేలా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో డిజిటల్ లైబ్రరీ, ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలను అందిస్తామని తెలిపారు. అధ్యాపక బృందం రూ.19 కోట్ల విలువైన 72 పరిశోధక ప్రాజెక్టులతో పాటు వివిధ సంస్థల నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొందారన్నారు. అనంతరం పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ సబ్జెక్టుల్లో ప్రథములుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ⇒ అనంతరం లాంఛనంగా డిగ్రీ, డిప్లొమా పట్టాలకు సంబంధించిన రికార్డుపై సంతకం వీసీ సంతకం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.వై.నజీర్అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య బి. జయపాల్‌గౌడ్, డీన్లు ఆచార్య కె.వలీపాషా, జయచంద్రారెడ్డి, శ్రీనివాస్, సాంబశివారెడ్డి, గులాంతారీఖ్, ఆర్థికశాఖ కార్యదర్శి సుబ్రమణ్యం, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు బెరైడ్డి రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, అక్బర్‌ఖాన్, నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ శివశంకర్‌రెడ్డి, డెరైక్టర్ శ్రీదేవి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
బిహార్ టాపర్స్ స్కాంలో మరో సంచలనం!
పాట్నా: బిహార్ టాపర్స్ స్కాం వరుసలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. జేడీయూ మాజీ మహిళా ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో అత్యంత దారుణమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం. అంతేకాదు అవధ్ యూనివర్సిటీ నుంచి 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు ఆమె సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనగా.. యూనివర్సిటీ ప్రారంభమైందే 1976లో. అయినా రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఒకే ఏడాదిలో ఎలా కంప్లీట్ చేశారు అనే విషయం అంతుచిక్కడం లేదు. ఉషా సిన్హా తన పీహెచ్‌డీని సైతం 23 ఏటా పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొనడం చూసి ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఆమె పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో హిందీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. టాపర్స్ స్కామ్‌లో ఉషా సిన్హా పేరు కూడా వినిపిస్తోంది. ఈమె భర్త లోకేశ్వర్ ప్రసాద్ గతంలో బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. -
'ఇలాంటి రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన స్నాతకపూర్వ(బీఏ)విద్యతోపాటు, స్నాతకోత్తర విద్య(పీజీ)ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మోదీ విద్యార్హత గురించి అబద్ధాలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బీఏను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారని వెల్లడించారు. 'ఒకరి వ్యక్తిగత విషయంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మోదీ విద్యార్హతలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి' అని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో మోదీ బీఏ పూర్తి చేశారన్నది అవాస్తవం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
స్మృతి డిగ్రీలు నకిలీవేమో.. ఆమె నిజం
పట్నా: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీలు నకిలీవి కావచ్చునేమో కానీ.. ఆమె నకిలీ కాదని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆమె తన విద్యార్హతలను తప్పుగా చూపారంటూ దాఖలైన కేసును ఢిల్లీ కోర్టు స్వీకరించటంపై లాలు గురువారం పట్నాలో స్పందించారు. ‘డిగ్రీలతో చేసేదేముంది? ఇరానీ నిజంగా ఉన్నారు. ఆమె ఒక మహిళ. ఆమె ‘సాస్ భీ కభీ బహూ థీ’ టీవీ సీరియల్లో నటించారు. ఆమె నన్ను గౌరవిస్తారు’ అని విలేకరులతో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం మొత్తం నకిలీదని విమర్శించారు. -
స్నాతకోత్సాహం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ 54వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మూడేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవానికి విద్యార్థులు హాజరై, డిగ్రీలు తీసుకున్నారు. 1,297 మంది ప్రత్యక్షంగా, 18,762 మంది పరోక్షంగా పట్టాలు పొందారు. స్నాతకోత్సవంలో 117 మంది పీహెచ్‌డీలు, 12 ఎంపీల్, 18 మంది ఎంటెక్, 14 ఎంబీఏ, 7 ఎంసీఎ, 30 ఎంఈడీ, 4 ఎంఎల్ఐసీ, 17 ఎంఫార్మసీ, 6 ఎల్ఎల్ఎం, 677 ఎమ్మెస్సీ, 302 ఎంఏ, 72 ఎంకాం, 6 ఎంఎఫ్‌ఎం, 15మంది ఎంబీఈ డిగ్రీలు పొందారు. పతకాల పంపిణీ గందరగోళం ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పంపిణీ చేసే సమయంలో గందరగోళం ఏర్పడింది. పరీక్షల విభాగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పలువురు స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడం, బంగారుపతకాలు అందుకోవాల్సిన జాబితాను సిబ్బంది సరిగా పెట్టుకోకపోవడంతో ఆటంకాలు తలెత్తాయి. ఒకరి డి గ్రీలు మరొకరికి ఇచ్చేశారు. పలుమార్లు అంతరాయం ఏర్పడి గందరగోళం ఏర్పడింది. దీంతో వైస్‌చాన్సలర్ నేరుగా వెళ్లి సిబ్బందితో మాట్లాడి, సరిగా డిగ్రీలు ప్రదానం చేయాలని సూచించారు. డిగ్రీలు అందించే సమయంలో గవర్నర్ చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎక్కువ సార్లు ఆటంకం ఏర్పడడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, డీన్ ఉషారాణి, కేవీ శర్మ, భగవాన్‌రెడ్డి, కార్తికేయన్, కృష్ణయ్య, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్వో రవి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి ,మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి హాజరయ్యారు. పసిడి వీరులు వీరే ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పొందినవారి వివరాలిలావున్నాయి. జోహారాభాను (గణితం), సునీతా(గణితం), మీనాకుమారి (బయోకెమిస్ట్రీ), సి.అలే ఖ్య (బోటనీ), కె.స్వాతి, సుధామణి, గీతారాణి, హేమలత, విజయలక్ష్మి (కెమిస్ట్రి), జాహ్నవి(కంప్యూటర్‌సైన్స్), కె.మహేశ్వరి (హోంసైన్స్), సోమశేఖర్( జియాలజీ), ఎం.ప్రియదర్శిని, పవన్‌కుమార్ (ఫిజిక్స్), శ్రీనప్ప(ఆంథ్రోపాలజీ), పి.శ్రీహరిత, ఎవి ప్రసాద్(స్టాటిస్టిక్స్), వెంకటరామయ(జువాలజీ), వీరేష్ (ఎకనామిక్స్), జయపద్మ( ఇంగ్లి షు), పి.రవి(హిస్టరీ), లక్ష్మీప్రసన్న (హిందీ), శ్రీకాంతమ్మ (సోషియాలజీ), రాజేష్(తమిళం), నాగరాజు , బిందు (తెలుగు), ఈశ్వరయ్య (కామర్స్), కె.అనిత (ఎంఎఫ్‌ఎం), ఎం.జయశంకర్ (ఎల్ఎల్ఎం), కె.రమ్యకృష్ణ, ప్రత్యూష(ఏంబీఏ), వి.సతీష్‌కుమార్ (ఎంఎల్ఐసీ), ఫణికుమార్ (ఎంటెక్)లు బంగారు పతకాలు పొందారు. -
ప్రమాద ఘంటికలు
అనంతపురం టౌన్: తాగునీటి సమస్య ఈసారి పట్టణాలనూ వదిలేటట్లు లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడంతో రానున్న మూడు నెలల్లో నీటి సమస్య తీవ్రత గురించిన ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి వనరులను సద్వినియోగించుకోవడంపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో పట్టణ జనం గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సిందే. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నివేదిక పంపించారు. వేసవిలో నీటి ఎద్దడి నుంచి గట్టేందుకు ఏ మేరకు నీరు అవసరముందో తెలియజేస్తూ స్పష్టమైన ప్రతిపాదనలు ఇందులో ఉంచారు. వాటి అమలు దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటే చాలా వరకు సమస్య నుంచి గట్టెక్కవచ్చు. పీఏబీఆర్‌లో 0.727 టీఎంసీలు నిల్వ చేయాలి జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు పెన్న అహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి నీటిని ఇస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఆగస్టు వరకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే 0.727 టీఎంసీల నీటిని డ్యాంలో నిలువ చేయాలి. అనంతపురం కార్పొరేషన్‌కి పీఏబీఆర్ పైప్‌లైన్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తుంటే, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇస్తున్నారు. వేసవిలో అనంతపురం కార్పొరేషన్ అవసరాలకు0.508 టీఎంసీలు, హిందూపురం మునిసిపాలిటీకి 0.155 టీఎంసీలు, కళ్యాణదుర్గం మునిసిపాలిటీకి 0.042 టీఎంసీలు, మడకశిర మునిసిపాలిటీకి 0.022 టీఎంసీలు మొత్తం 0.727 టీఎంసీ నీరు అవసరం. ఈ మేరకు నీటిని పీఏబీఆర్‌లో నిలువ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సీబీఆర్‌లో 0.640 టీఎంసీలు నిలువ చేయాలి ధర్మవరం, కదిరి, పుట్టపర్తి మునిసిపాలిటీలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి నీటిని ఇస్తున్నారు. వేసవిలో ఆగస్టు వరకు ఈ ప్రాంతాల్లో నీటి అవసరాలకు 0.640 నీరు అవసరం అవుతుంది. ధర్మవరం మునిసిపాలిటీకి 0.323 టీఎంసీ, కదిరి మునిసిపాలిటీకి 0.236 టీంఎసీ, పుట్టపర్తి మునిసిపాలిటీకి 0.081 టీఎంసీ మొత్తం 0.640 టీఎంసీ నీరు అవసరమవుతుంది. పెన్నాకి రెండు టీఎంసీలు కావాలి పెన్నానదిలో బోర్లు ద్వారా తాడిపత్రి, పామిడి, గుత్తి మునిసిపాలిటీలకు నీటిని ఇస్తున్నారు. అయితే గత నాలుగేళ్లగా పెన్నా పూర్తిగా ఎండిపోవడంతో బోర్లలో నీరు లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. వేసవిలో ఈ సమస్య మరింత ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఇదే విషయాన్ని ఈఎన్సీ ఉంచారు. ఈ సమస్యను అధిగమించాలంటే పెన్నా నదికి మిడ్ పెన్నార్ నుంచి రెండు టీ ఎంసీ నీటిని ఇవ్వాలి. ఈ నీటితో భూగర్భజలాల పెరిగి బోర్లు రిచార్జ్ అవుతాయి. తద్వారా నీటి ఎద్దడి తలెత్తకుండా చూడవచ్చని నివేదికలో పేర్కొన్నారు. -
జిల్లాలో చలితీవ్రత
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలితీవ్రతకు సామాన్యులు గజగజ వణుకుతున్నారు. మధ్యాహ్నం వేళ చల్లగాలులు వీస్తున్నాయి. జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో అతితక్కువగా 11, 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఆదివారం సరాసరిగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇదిలాఉండగా, మూడురోజుల క్రితం జిల్లాలోని ఎదిరలో అతితక్కువగా నమోదైన 7డిగ్రీల ఉష్ణోగ్రతను పరిశీలిస్తే చలితీవ్రత అర్థమవుతోంది. ఇప్పటివరకు జిల్లాలో గతేడాది డిసెంబర్లో అతి తక్కువగా 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈ సారి మాత్రం సింగిల్‌డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు. వీటికితోడు పొద్దస్తమానం చల్లగాలులు వీస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం వేళ పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి తీవ్రస్థాయిలో చలిని గతంలో ఎన్నడూ చూడలేదని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ఆజ్యం పోస్తున్న అల్పపీడనం.. జిల్లాలో వారం రోజులుగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత ఆజ్యం పోస్తుంది. రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. దీంతో చలితీవ్రత మరింత పెరిగింది. జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు గద్వాలటౌన్: చలికాలంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కావునా వాతావరణ మార్పుల కారణంగా త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయటతిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సులు, ఆటోల్లో వెళ్లే విద్యార్థులకు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మంచు కురిసేవేళ.. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. ఒక్కసారి మంచు చాలా దట్టంగా కురిసి దారి కనిపించకుండా పోతోంది. దీనివల్ల ముందుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చేవరకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్లు వేసుకోవడంతో పాటు తక్కువ వేగంతో వాహనాలు నడపాలి. చలికాలం మామూలుగా ఉంటేనే చలితో వణికిపోతాం. అలాంటిది వాహనాలపై ప్రయాణిస్తే వణుకు పుడుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి వస్తే వెచ్చగా ఉండే జర్కిన్, తలకు, చెవులకు రక్షణగా మంకీక్యాప్, చేతులకు గ్లౌస్లు వేసుకోవాలి. -
సలి సంపేత్తోంది..
అనంతపురం అగ్రికల్చర్ : రాత్రి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. సాయంత్రం నుంచి వేకువజాము వరకు ఉష్ణోగ్రతలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదైంది. డిసెం బర్లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడం ఇదే తొలిసారి అని రేకులకుంటలోని వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాధినేని మల్లీశ్వరి తెలిపారు. సాధారణంగా ఈ సమమంలో 15 డిగ్రీల మేర ఉండేదన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీలు గా నమోదైనట్లు తెలిపారు. ఫలితంగా జిల్లా ప్రజలను చలి గజ గజ వణికిస్తోంది. పగలు కూడా 26 డిగ్రీలకు మించడం లేదు. సాయంత్రం 6 నుంచే చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వేకువ జామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. రహదారుల్లో పొగమంచు ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోం ది. ఉదయం వేళ శ్రామికులు, పాలు, పారిశుధ్య కార్మికులు, పల్లె ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెండు రోజులుగా చలి తీవ్రత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. డిసెం బర్‌లోనే ఇలా ఉంటే జనవరిలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చలి పులి దెబ్బకు ఉన్ని దుప్పట్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు, సాక్సు లు, టీ, కాఫీలకు గిరాకీ పెరిగింది. -
ఆక్వా చెరువుల్లో మృత్యుఘంటికలు
పిట్టలవానిపాలెం : ప్రస్తుతం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. శీతల పరిస్థితులను వెనామీ రకం రొయ్యలు తట్టుకోవడం కష్టం. వారం రోజులుగా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలి ఎక్కువగా ఉండడంతోపాటు, మంచు అధికంగా కురుస్తోంది. ఈ ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాల్లో వెనామీ రకం రొయ్య సాగవు తోంది. గత కొంత కాలంగా వెనామీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. చెరువులపై మంచు తెరలు ఉదయం 10 గంటలకు కూడా తొలగడం లేదు. ప్రస్తుతం సాగులో ఉన్న నెలలోపు వెనామీ రొయ్యలు చలికి తట్టుకోలేకపోతున్నాయి. కొన్ని పిల్లలు చెరువులోనే మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని మేత కూడా తీసుకోలేక పోవడం వల్ల పెరుగుదల లోపం కనిపిస్తోంది. కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగితే 50 నుంచి 70 శాతం మేర రొయ్య పిల్లలు మృత్యువాత పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెనామీకి ఈ వాతావరణం ఇబ్బందికరమే... కొద్ది రోజులుగా శీతల వాతావరణ పరిస్థితులు వెనామీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రత అధికమైంది. దీంతో రొయ్య పిల్ల సరిగా మేత తినలేక ఎదుగుదల నిలిచిపోతోంది. రోజుల పిల్లలైతే చలికి తట్టుకోలేక చెరువు లోనే మృత్యువాత పడుతున్నాయి. - బడుగు ప్రకాశరావు,రైతు వేసవి పంటకు ఈ పంటకు తేడా ఉంది.. వేసవి కాలంలో సాగు చేసే రొయ్యసాగుకు ప్రస్తుతం చలికాలంలో సాగుకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో రొయ్యలు మేత సరిగా తినక పోవడం వల్ల ఎదుగుదల ఉండడం లేదు. మరోవైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి. - మంతెన గంగరాజు,రైతు -
వణికిస్తున్న చలి పులి
నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దీంతో ఇందూరు సిమ్లాను తలపిస్తోంది. ఉత్తర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న గాలులతోనే చలి పెరిగిందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో మరి కొద్ది రోజులు ప్రజలు గజగజ వణకాల్సిందే. జనవరి, ఫిబ్రవరి మాసాలలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని, మంచు బాగా కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇందూరులోనే తెలంగాణలోని ఇతర జిల్లాలకంటే ఇందూరులో భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. నవంబర్ నెలాఖరులోనే చలి ఎక్కువైనా, హేమంత రుతు వు ఆరంభంతో తీవ్రత మరింత పెరిగింది. ఈనెల నాలుగో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ సీజన్లో సాధారణంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాలని, అయితే జిల్లాలో ఆదివారం 11.9 డిగ్రీలు నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి 1982లో ఒకసారి జిల్లాలో ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోగా 2009లో 12 డిగ్రీలకు పడిపోయింది. చలితో అనారోగ్యం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజ లు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. న్యూమోనియా, అస్తమా, ద గ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పొద్దెక్కేంతవరకు ముసుగుతన్ని పడుకుంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు ఇంట్లోనుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లేవారు స్వెట్టర్లు, మఫ్లర్లు, టోపీలు, గ్లౌస్లు ధరిస్తే మంచిది. ఇంట్లోనూ ఉన్ని దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. చలి తీవ్రత పెరిగిన దృష్ట్యా పిల్లలు, వృద్ధులను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. -
విజృంభిస్తున్న చలి 9.2 డిగ్రీలు
తాండూరు, న్యూస్‌లైన్: రోజురోజుకూ విజృం భిస్తున్న చలి జిల్లా ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఉదయమంతా పొగమంచు కమ్ముకుంటుండ గా, మధ్యాహ్నం నుంచి చల్లనిగాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజ లు వజవజ వణికిపోతున్నారు. ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీంతో ఉదయం 8గంటలు దాటుతున్నా పొగమంచు వీడటం లేదు. శనివారం నమోదైన 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రెండేళ్ల తరువాత ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. సాధారణంగా రాత్రి వేళలో 10-11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతేనే చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. గడిచిన రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ శనివారం 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. ఈ నెల 1వ తేదీన 16.5 డిగ్రీలు, 2న 17.9, 3న 19, 4న 16.9, 5న 12.9, 6న 11.2, 7వ తేదీన 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 4వ తేదీ నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. 4వ తేదీ నుంచి 5వ తేదీన నాటికి 4 డిగ్రీలు తగ్గిపోగా, 6వ తేదీ నుంచి 7వ తేదీ నాటికి రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తోంది.