సుభాష్‌నగర్: మన జీవితాలు యంత్రాలతో ఎంతగానో పెనవేసుకుపోయాయని, వాటిని వినియోగిస్తూనే సమాజంలో మానవతా విలువల్ని కూడా పరిరక్షించేలా మనం ముందుకు సాగాలని మహీంద్రా యూనివర్శిటీ చాన్స్‌లర్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బహదూర్‌పల్లిలోని మహీంద్ర యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, అప్‌గ్రేడ్ చైర్మన్ రొన్నీ స్రీవల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనంతరం ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 76 సంవత్సరాలుగా టెక్ మహీంద్ర కంపెనీ సేవలందించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు మానవాభివృద్ధికి దోహదపడే నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలన్నారు. టెక్ మహీంద్ర ఎండీ మోహిత్ జోషి, మహీంద్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేదురి, యూనివర్సిటీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment