Mallikarjuna Rao
-
వాళ్లు సర్క్యులేషన్ కోసం ఏవైనా రాస్తారు.. నేనలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు
మరీ ఇంత బరితెగింపా? రామోజీరావుకేమయింది? ‘ఈనాడు’ అసలు పత్రికేనా? కోర్టుల్లో న్యాయమూర్తులు చేయని వ్యాఖ్యల్ని సైతం వాళ్లకు అంటగట్టి రాసేస్తే ఎలా? ‘మీరు పోలీసులేనా?.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడితే.. సామాన్యుల పరిస్థితేంటి?’’ అని ఓ న్యాయమూర్తి అన్నట్టుగా పతాక శీర్షికను వండేసిన రామోజీకి.. అసలు ఆ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలే చేయలేదన్న నిజం తెలియదా? ఈ రాతల వల్ల పోలీసుల ఆత్మ స్థయిర్యం ఎంతలా దెబ్బతింటుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లటమే లక్ష్యంగా దుష్ప్ర చారంతో చెలరేగిపోతున్న రామోజీకి వయసు తప్ప బుద్ధి రాలేదా? ఎంతసేపూ చంద్రబాబు యావే తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహమేంటో అర్థమవుతోందా రామోజీ!?. సాక్షి, అమరావతి : ఓ కేసు ప్రస్తావన సమయంలో తాను చేసిన వ్యాఖ్యలంటూ ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్క్యులేషన్ కోసం ఏవైనా రాస్తాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాంటి కథనాలపై తానెందుకు స్పందించాలని ప్రశ్నిచారు. ఆ పత్రికలు ఏం రాశాయో కూడా తనకు తెలియదన్నారు. ఇటీవలి కాలంలో పత్రికలు చదవడమే మానేశానని తెలిపారు. ‘వాళ్లేం రాశారో మీరు (పబ్లిక్ ప్రాసిక్యూటర్) ఇప్పుడు చెబితేనే నాకు తెలిసింది. నేనేదో యధాలాపంగా మాట్లాడానే తప్ప ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. వాళ్ల రాతలు పరువు నష్టం కలిగించే విధంగా ఉంటే అందుకు అనుగుణంగా మీరు (ప్రభుత్వం) తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. మీడియాలో నాకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాశారు. అయినా నేను గొంతెత్తలేను. అదేమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. పత్రికల్లో వచ్చే కథనాలకు నేనేం చేయగలను?’ అని జస్టిస్ మల్లికార్జునరావు అన్నారు. న్యాయమూర్తి నుంచి ఈ స్పందనను ఊహించని ఎమ్మెల్యే తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఎల్లో మీడియా కథనాలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ పత్రికల వారితో తాను మాట్లాడానని, ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికే అలా ప్రచురించామని వారు చెప్పారని పోసాని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి స్పందిస్తూ.. మీరు వ్యాఖ్యలు చేశారంటూ ప్రచురించిన కథనాల వల్ల పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే వాటిని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నామని న్యాయమూర్తికి వివరించారు. అలాగే 41(ఏ) విషయంలో కోర్టుకు స్పష్టతనిచ్చేందుకు, కోర్టు సందేహాలను నివృత్తి చేసేందుకు, అర్నేష్ కుమార్ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏముందో స్పష్టంగా తెలిపేందుకే సుదీర్ఘ వాదనలు వినిపించామన్నారు. అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) నోటీసు ఇస్తామని దుష్యంత్ కోర్టుకు వివరించారు. ఈ విషయంలో పోలీసు అధికారుల నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నాయని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, ఎమ్మెల్యే సాంబశివరావుకు 41(ఏ) నోటీసులు ఇచ్చి, అర్నేష్ కుమార్ కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించారు. 41(ఏ) నోటీసులు ఇస్తామని చెప్పినందున కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని జస్టిస్ మల్లికార్జునరావు తెలిపారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులపై దాడి చేసిన ఎమ్మెల్యే గ్రానైట్ ఫ్యాక్టరీ తనిఖీకి వచ్చిన తమను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే కాక తమపై దాడి కూడా చేశారంటూ గనుల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సాంబశివరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, విధులు నిర్వర్తించకుండా అధికారులను అడ్డుకున్నారని తెలిపారు. న్యాయమూర్తులపై గతంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వారిపై నమోదు చేసిన కేసులు కూడా ఏడేళ్ల లోపు శిక్షలు పడేవేనని, అయినా వారికి కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదన్నారు. 70 రోజుల పాటు వారంతా జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఆ కేసుల్లో అడ్వొకేట్లు కూడా అరెస్టయ్యారని వివరించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదన్నారు. నేరాన్ని మళ్లీ చేస్తారన్న నిర్ణయానికి పోలీసు అధికారి వస్తే చాలని, నిందితుడిని అరెస్ట్ చేయవచ్చని చెప్పారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, ఇప్పుడు కూడా పోలీసులు మౌనంగా ఉండాలంటే ఎలా అని ప్రశ్నిచారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపే సమయంలో నేరం చేశారనేందుకు మేజి్రస్టేట్‌కు స్పష్టమైన ఆధారాలు చూపితే సరిపోతుందన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురి చేశారని, అందుకు వీడియో ఆధారాలున్నాయని చెప్పారు. 41(ఏ) నోటీసు ఇవ్వాలా లేక అరెస్ట్ చేయాలా అన్నది పూర్తిగా పోలీసుల విచక్షణాధికారమని తెలిపారు. కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఈ విషయంలో ఇదే హైకోర్టు ఓ తీర్పులో స్పష్టంగా చెప్పిందని నివేదించారు. ఈ కేసులో కూడా ఎమ్మెల్యేకు 41(ఏ) నోటీసులు ఇస్తామన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ చేయకూడదన్నారు. సెక్షన్ 41(ఏ) నోటీసులు ఇచ్చి తీరాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు పోలీసులు వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారన్నారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని లేని పక్షంలో 41(ఏ) నోటీసులు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
మన సంగీతానికి నీరాజనం!
మనిషి జీవితంలో ఓ అంత ర్భాగం సంగీతం. అన్ని సందర్భాల్లోనూ ఆయా భావాలను వ్యక్తం చేయడానికి సంగీతం ఒక వాహిక. అయితే ప్రపంచంలో అనేక రకాల సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో భారతీయ సంగీత సంప్రదాయాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంగీతం రాగ ప్రధానమైనది అయితే పాశ్చాత్య సంగీతం స్వరమేళన ప్రధానం. భారతీయ సంగీతం గురించి వేదాల్లో ఒకటైన సామ వేదంలోనూ ప్రస్తావితమయ్యింది. భరతముని తన ‘నాట్యశాస్త్రం’ (క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2 వ శతాబ్దం)లో భారతీయ సంగీతం గురించి విపులంగా వివరించాడు. మధ్య ఆసియా నుండి వచ్చిన తుర్కీయులు, తాతార్లు, పర్షియన్లు, అఫ్గాన్లు పాలన చేస్తున్నప్పుడు భారతీయ సంగీతం ఉత్తర, దక్షిణ సంగీత సంప్రదాయాలుగా విడిపోయింది. ఉత్తర సంప్రదాయాన్ని ‘హిందుస్తానీ’ సంగీతమనీ, దక్షిణపు సంప్రదాయాన్ని∙‘కర్ణాటక’సంగీతం అనీ పిలవడం ప్రారంభమయింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో పార్శీ దేశానికి చెందిన అమీర్ ఖుస్రూ ఉండేవాడు. ఇతడు పార్శీ సంగీతంలోని రాగ క్రమ పద్ధతిని భారతీయ సంగీతంతో మేళవించి ఒక కొత్త సంగీత సంప్రదాయాన్ని సృష్టించాడు. అదే ‘హిందుస్తానీ’ సంగీతం. హిందూస్తానీ సంగీతం ‘రాగ రాగిణుల’ చిత్ర కళా సంప్రదాయాన్ని కూడా సృష్టించింది. ఒక రాగాన్ని వినేప్పుడు కలిగే భావనావృత్తి కొన్ని దృశ్యరూపాలతో సంలగ్నమై ఉంటుంది. అటువంటి దృశ్యరూపాన్ని చిత్రరూపంలో పొందుపరచేందుకు ఉత్తర భారతంలో కృషి జరిగింది. ఆ కృషి ఫలితాలే రాగరాగిణి చిత్రాలు. హిందూస్తానీ సంప్రదాయంలో సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, జయదేవుడు వంటివారు భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేశారు. కొందరు గజల్స్ రూపంలో మధురభక్తిని సృష్టించారు. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం. ‘కర్ణాటిక్’ అనే పదానికి సంస్కృత పదం అయిన ‘కర్ణేషు అతతి’ (చెవులకు ఇంపైన సంగీతం కనుక కర్ణాటక సంగీతం) మూలం అని కొందరి పరిశోధకుల అభిప్రాయం. ‘కరనాడు’ అంటే సముద్ర తీరం అనీ, మూడు వైపులా సముద్ర తీరం గల దక్షిణ భారతదేశంలో పుట్టిన సంగీతం కనుక దక్షిణ సంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చింది అనీ మరికొందరి అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో హిందుస్తానీ సంప్రదాయంలాగా భక్తి, శృంగార రసాలకు ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది. శృంగార రసం కొన్ని సందర్భాల్లో పరిణతి చెంది భక్తిగా రూపాంతరం చెందుతుంది. త్యాగయ్య, శ్యామశాస్త్రి, పురంధరరాసు, రామదాసు వంటి వాగ్గేయకారుల పదసాహిత్యం భక్తి కోవకి చెందినది. జావళీలు, ప్రత్యేకించి క్షేత్రయ్య పదాలు శృంగార రసానికి చెందినవి. కర్ణాటక సంగీతంలో ప్రధాన లక్షణంగా పరిగణించే రాగాన్ని పతంగుడు పేర్కొన్నాడు. రాగాల్లో కొన్ని రాగాలు ఉల్లాసాన్నీ, మరికొన్ని రాగాలు విషా దాన్నీ, కొన్ని కరుణ రసాన్నీ స్ఫురింపజేస్తాయి. ఈ విధంగా ఆ యా రాగాలు శ్రోతల హృదయంలో ఆయా అనుభూతులను కలిగించగలుగుతున్నాయి. కర్ణాటక సంగీతశాస్త్రంలో మరో ప్రాధాన్య లక్ష్యం ‘శ్రుతి’. ‘శ్రు’ (అంటే వినుట) అనే ధాతువు నుండి ‘శ్రుతి’ అనే పదం పుట్టింది. భారతీయ సంగీతానికి గమకాలు ఒక విశిష్టతను చేకూర్చాయి. గానానికి వీటిని మాల అలంకారాలుగా వర్ణింపవచ్చునని సంగీతవేత్తల అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు భాష ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు భాష మధురమైన భాష. ఈ భాష పదాలకూ, వ్యాకరణానికీ సరైన ప్రాధా న్యమిస్తూ శ్రావ్యమైన కూర్పులను అందిస్తుంది. అలాంటి కూర్పులు వాగ్గేయకారులచే స్వరపరచబడి పద్యం అందాన్ని మరింత పెంచాయి. అందుకనే కాబోలు ఆనాటి తొలి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య మొదలుకొని రామదాసు, క్షేత్రయ్య; సంగీత మూర్తి త్రయంలోని త్యాగయ్య, శ్యామశాస్త్రి, తమిళులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ముత్తయ్య భాగవతార్; కన్నడ దేశానికి చెందిన మైసూర్ వాసుదేవాచారి ఇత్యాది వాగ్గేయకారులు తెలుగు భాషనే ఎంచుకొని, తమ రచనలు సాగించారు. అంతటి విశిష్టమైనది మన తెలుగు భాష. అందుకనే తెలుగు రాష్ట్రాల పునర్విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘కృష్ణ వేణి సంగీత నీరాజనం’ అనే సంగీతోత్సవాన్ని ఈ డిసెంబరు 10 నుండి 12 వరకు విజయ వాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో, అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, కృష్ణానది దుర్గా ఘాట్ల వద్ద ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నిర్వహిస్తోంది. ఈ సంగీతోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మన అద్భుతమైన సంగీత సంప్రదాయాలను పరిరక్షించడం... తద్వారా హరికథ, నామ సంకీర్తన సంప్రదాయాలపై దృష్టిని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం; తెలుగు భాష గొప్పతనాన్నీ, వారసత్వాన్నీ వెలుగులోకి తీసుకు రావడం. ఈ ఉత్సవం సంగీత కళాశాలల విద్యా ర్థులకూ, విశ్వ విద్యాలయాల విద్యార్థులకూ నేర్చుకోవ డానికీ, వారి ప్రతిభను ప్రదర్శించ డానికీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆర్. మల్లికార్జున రావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు -
చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే అప్పటి మద్యం కుంభకోణం జరిగిందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలిలో చర్చలేకుండానే వరుసగా జీవోలు జారీ చేశారని, తద్వారా పలు డిస్టిలరీలకు, బార్లకు లబ్ధి చేకూర్చారని ఆయన వివరించారు. ఇందులో చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నిందితులకు సైతం సంబంధం ఉందన్నారు. వీరి చర్యల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ సైతం తేల్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్వలాభం కోసం, డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు. అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి చేకూర్చారని శ్రీరామ్ తెలిపారు. మద్యం కుంభకోణంలో కొల్లు రవీంద్రకు డబ్బు అందిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వాస్తవాలు దర్యాప్తులో బయటపడుతాయని చెప్పారు. ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలను పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. ముందస్తు బెయిల్ పేరుతో దాఖలు చేసిన ఈ పిటిషన్.. క్వాష్ పిటిషన్ రీతిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయాన్ని తేల్చాలన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు సహకారం మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్ పేరు లేదన్నారు. సీఐడీ మాత్రం కొల్లు రవీంద్రను రెండో నిందితుడిగా చేర్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం మేరకే పిటిషనర్ వ్యవహరించారన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తెలిపారు. అడ్వొకేట్ జనరల్ తన వాదనల సమయంలో 17ఏ గురించి ప్రస్తావించడంతో దానిపై వాదనలు వినిపిస్తానని, విచారణను వాయిదా వేయాలని పోసాని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్ లాగడంతో రైలు నిలిచింది. దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2.30గం.ల. సమయంలో సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి. నలుగురు దొంగలు! హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది. సూళ్లూరుపేట స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్2 నుంచి ఎస్8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి. -
మానవతా విలువల్ని పరిరక్షిద్దాం
సుభాష్‌నగర్: మన జీవితాలు యంత్రాలతో ఎంతగానో పెనవేసుకుపోయాయని, వాటిని వినియోగిస్తూనే సమాజంలో మానవతా విలువల్ని కూడా పరిరక్షించేలా మనం ముందుకు సాగాలని మహీంద్రా యూనివర్శిటీ చాన్స్‌లర్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బహదూర్‌పల్లిలోని మహీంద్ర యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, అప్‌గ్రేడ్ చైర్మన్ రొన్నీ స్రీవల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 76 సంవత్సరాలుగా టెక్ మహీంద్ర కంపెనీ సేవలందించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు మానవాభివృద్ధికి దోహదపడే నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలన్నారు. టెక్ మహీంద్ర ఎండీ మోహిత్ జోషి, మహీంద్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేదురి, యూనివర్సిటీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పదిన్నరకు భోజనం రెడీ
ఒకప్పుడు తన కడుపు నింపుకోవడానికే కష్టపడిన యువకుడు ఇప్పుడు రోజుకు సుమారు రెండువేల మంది కడుపు నింపుతున్నాడు! అలాగని అతనేదో పెద్ద ఆస్తిపరుడో, ఉన్నతోద్యోగో ఏమీ కాడు. రూపాయి పొదుపు చేయడం రూపాయి సంపాదించడంతో సమానమని నమ్మినవాడు. పెద్ద పెద్ద ఫంక్షన్లలో వృథాగా పడవేస్తున్న ఆహార పదార్థాలను సేకరిస్తూ ఆకలితో అలమటిస్తున్న వారి కడుపులు నింపుతున్నవాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే... ‘‘మాది రాజమండ్రి. మేము నిరుపేదలమేమీ కాదు. కాస్త భూమి ఉన్న వాళ్లమే. అయితే, ఎవరో చెప్పిన మాటలు విని మా నాన్న మాకున్న ఎకరం నేల అమ్మేసి నాగపూర్‌లో అంతకు పదింతలు భూమి కొన్నారు. అక్కడ వ్యవసాయం చేయడం కోసం మా కుటుంబాన్ని నాగపూర్‌కు తరలించాడు. అయితే నాన్నకు తెలిసిన వ్యవసాయ పరిజ్ఞానం అక్కడ ఏమీ పనికి రాలేదు. దాంతో సర్వం కోల్పోయి మా కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. తినడానికి తిండి కూడా లేని దుస్థితి. దాంతో తెలిసిన వారి ద్వారా నిజామాబాద్ వచ్చాం. అలా నేను నా పదేళ్ల వయసులో నిజామాబాద్ వీధులలో ఆకలితో తిరుగుతూ కనిపించినప్పుడు సంఘ సేవకురాలు హేమలతా లవణం గారు నన్ను చేరదీశారు. ఆవిడే నన్ను ఆదరించి నిజామాబాద్‌లోని ఆశ్రమ విద్యాలయలో చేర్పించారు. అక్కడ పదో తరగతి పూర్తి చేశాను. తర్వాత కొందరు దాతల సాయంతో హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎలాగైనా సరే నాకు సరిపడా సంపాదించుకుంటూ, మా కుటుంబానికి అండగా ఉంటూ, ఇతరులకు కూడా సహాయపడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. చిన్నతనంలోనే పబ్లలోను, పెద్ద పెద్ద ఫంక్షన్లలోనూ క్యాటరింగ్ పని చేసేవాణ్ణి. నేనేమో ఒకపక్క కడుపునిండా తిండి లేక నకనకలాడిపోతూనే పని చేస్తుంటే అక్కడ ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఆహారం వృథా కావడం చూస్తే బాధేసేది. అప్పుడే నాలో ‘ఇలా వృథా అవుతున్న ఆహారాన్ని ఏం చేయాలా’ అన్న ఆలోచన కలిగింది. అదే ‘డోంట్ వేస్ట్ ఫుడ్’ అనే నా సంకల్పానికి పునాది వేసింది. అప్పటినుంచి హైదరాబాద్‌లో మిగులు ఆహారాన్ని సేకరించి, అన్నం లేక బాధపడుతున్న వారి కడుపు నింపడం మొదలు పెట్టాను’’ అంటూ తన ప్రస్థానం గురించి వివరించారు మల్లేశ్వరరావు. రాత్రి పది తర్వాత ‘డోంట్ వేస్ట్ ఫుడ్’ గురించి చెబుతూ.. ‘‘ప్రతి రోజూ రాత్రి పది గంటలకు హోటల్స్ మూసే సమయానికి హైదరాబాద్ మధురానగర్‌లో నా హాస్టల్ నుంచి కొంత మంది ఫ్రెండ్స్‌తో కలిసి కాలినడకన, వాహనాల మీద బయలుదేరి, ఖైరతాబాద్ వరకు ఉన్న హోటల్స్‌లో మిగులు ఆహారాన్ని సేకరిస్తాను. ముందుగా నేను రుచి చూసి, తాజాగా ఉన్న ఆహారాన్ని ప్యాక్ చేసి, తిండి లేకుండా, దారి పక్కన అనా థల్లా ఉన్నవారికి అన్నం పెట్టి, మళ్లీ రాత్రి 12 గంటలకు రూమ్‌కి చేరతాను. ఇది నా దినచ ర్య. ఆరు సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను, పని లేకుండా కూర్చునేవారికి, తాగుబోతులకు ఒక్క ముద్ద కూడా పెట్టను. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండే కార్మికులకు కూడా అన్నం అందచేయడం మొదలుపెట్టాను. వారాంతాలలో ఐటీ ఉద్యోగులు మాకు సహకరిస్తున్నారు. ఒక్కోరోజు నేను ఒంటరిగానే ఈ పని చేయవలసి వస్తుంది. ఫేస్బుక్ పేజీ కూడా క్రియేట్ చేశాం. రెస్టారెంట్ యజమానులు అందులో మెసేజ్ పెడితే చాలు, మేమే స్వయంగా వెళ్లి ఆహారం సేకరిస్తాం’’ అని మల్లేశ్వరరావు తెలిపారు. – డాక్టర్ వైజయంతి పురాణపండ అన్నోన్ హీరో మల్లేశ్వరరావు యూట్యూబ్ చానెల్స్ కోసమూ క్రియేటివ్ వర్క్ చేశారు. బీటెక్ పూర్తయ్యాక ఢిల్లీ వెళ్లి అక్కడ ‘జోష్ టాక్స్’ డైరెక్టర్‌గా ఉత్తేజాన్నిచ్చే కథలు చెప్పారు. కాలేజీ మ్యాగజైన్ లో ‘మా మాట’ శీర్షికకు ఎన్నో వ్యాసాలు రాసిన మల్లేశ్వరరావుకు మంచి జర్నలిస్టు కావాలన్నదే జీవితాశయం. ఫుడ్‌మ్యాన్‌గా అతడికి ఇండియన్ యంగ్ ఐకాన్ అవార్డు –2018 (నేషనల్ హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా), రాష్ట్రీయ గౌరవ్ అవార్డు– 2019 (శిక్షాలయ అండ్, సి.జె గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఢిల్లీ) వంటి మొత్తం 26 పురస్కారాలు లభించాయి. ‘సన్ ఆఫ్ సాయిల్’ అవార్డు (సామ్సంగ్ అండ్ సి.జె.) కూడా అందుకున్నారు. ‘అన్నోన్ హీరోస్’ అని త్వరలో రాబోతున్న పుస్తకంలో మొదటి స్టోరీ అతడిదే కావడం విశేషం. ఆ పుస్తకాన్ని దివ్య అనే ప్రముఖ బ్లాగర్ రాస్తున్నారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో యువకుడి మోసం
ముహూర్తం సమయానికి మాయం సింగ్‌నగర్ స్టేషన్లో కేసు మధురానగర్ : ప్రేమించిన యువతిని ముందుగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని, తరువాత పెద్దల సమక్షంలో వివాహమాడతానని ఆమె తల్లిదండ్రులను ఓ యువకుడు నమ్మించాడు. తీరా ముహూర్తం సమయానికి మాయమయ్యాడు. దీనిపై సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన యువతి (21) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ఆమె సహచరుడైన గుండా మల్లిఖార్జునరావు గత నెల ఎనిమిదో తేదీన యువతి ఇంటికి వచ్చాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ పెళ్లి విషయంలో తమకు అభ్యంతరం లేదని ఆమె తండ్రి చెప్పారు. మీ కుటుంబసభ్యులు అంగీకరిస్తే వివాహం చేస్తానని చెప్పారు. తన కుటుంబసభ్యులతో మాట్లాడతానని చెప్పి మల్లికార్జునరావు వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తరువాత తిరిగి వచ్చి తమ ఇంట్లో పెళ్లికి అంగీకరించటం లేదని చెప్పాడు. తన ప్రేమ స్వచ్ఛమెనదని, తాను కచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారు సరేనన్నారు. ఈనెల 13వ తేదీన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోండంటూ చెప్పి ఖర్చుల కోసం రూ.10 వేలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. 13వ తేదీన ముహూర్తం సమయానికి అతడు రాలేదు. దీంతో మోసపోయామని యువతి కుటుంబీకులు భావించారు. దీనిపై యువతి తండ్రి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మల్లీ.. ఇదేం లొల్లి..!
సాక్షి, గుంటూరు :కొత్త లీడరుతో రేపల్లె టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగుతోంది. ఇక్కడ టీడీపీలో కొత్తగా చేరిన మల్లికార్జునుడి హవా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనగాని సత్యప్రసాద్‌కు సైతం ఈయన చేతిలో పరాభవం తప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒంటెత్తు పోకడలతో పార్టీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఆయనపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చివరికిది పార్టీలో అంతర్ధ్యుద్ధానికి దారితీయడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పెత్తనమేంటంటున్న కార్యకర్తలు.. గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ నాయకులను టార్గెట్ చేసి అణగదొక్కారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడీ నాయకునికి పెత్తనం ఇవ్వడమేంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఈ మాజీ ఎమ్మెల్యేను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడటం ఆలోచించదగిన అంశం. 2004 ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముమ్మనేని వెంకటసుబ్బయ్య ఓడిపోవటానికి కారణమవ్వటమే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులు ఓటమికి తీవ్ర కృషి చేశారని, దీంతోపాటు ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను కనీసం బయటకు తిరగనివ్వకుండా పోలీసు కేసుల్లో ఇరికించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఇటువంటి వ్యక్తి తిరిగి తమపై పెత్తనం చెలాయించడం ఏమిటని బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్నిపల్ ఎన్నికల్లో సైతం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను విస్మరించిన ఈ మాజీ ఎమ్మెల్యే తన అనుచరులకు పలు వార్డుల్లో సీట్లు కేటాయించటంపై గుర్రుమంటున్నారు. కనీసం అభ్యర్థికి కూడా గౌరవం ఇవ్వకుండా దూషించడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే నష్టపోతామని.. సదరు అభ్యర్థికి ఆయన వర్గం నాయకులు సూచిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జిల్లా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా మహిళలపై దురుసుగా ప్రవర్తించేవారని విమర్శలున్నాయి. అప్పటి జెడ్పీ చైర్‌పర్సన్‌పై, అప్పటి కలెక్టర్లను వేర్వేరు సందర్భాల్లో ఏకవచనంతో సంబోధించటంతో పాటు వారిపై దురుసుగా ప్రవర్తించటంపై ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటున్నారు. అనుచరుల అరాచకాలపై విమర్శలు..టీడీపీలో ఇటీవల చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అధికారంలో ఉండగా ఆయన అనుచరులు చేసిన అరాచకాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూళ్లు నుంచి మున్సిపాలిటీతో పాటు చెరుకుపల్లి మండలంలో ఏ చిన్న పనికావాలన్నా ఆయన అనుచరులు వసూళ్లకు తెగబడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకోవటంతో పనులు నాణ్యత లేకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పట్టణంలో డ్వాక్రా గ్రూపు మహిళా రుణాల కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు ఆయన అనుచరులేననే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పార్టీలో చేరటంతో ఆ ప్రభావం పార్టీపై పడుతున్నదనే ఆవేదన టీడీపీ పాత నాయకుల్లో వ్యక్తమవుతోంది.