అనంతపురం అగ్రికల్చర్ : రాత్రి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. సాయంత్రం నుంచి వేకువజాము వరకు ఉష్ణోగ్రతలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదైంది.
డిసెం బర్‌లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడం ఇదే తొలిసారి అని రేకులకుంటలోని వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాధినేని మల్లీశ్వరి తెలిపారు. సాధారణంగా ఈ సమమంలో 15 డిగ్రీల మేర ఉండేదన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీలు గా నమోదైనట్లు తెలిపారు. ఫలితంగా జిల్లా ప్రజలను చలి గజ గజ వణికిస్తోంది. పగలు కూడా 26 డిగ్రీలకు మించడం లేదు. సాయంత్రం 6 నుంచే చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
వేకువ జామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. రహదారుల్లో పొగమంచు ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోం ది. ఉదయం వేళ శ్రామికులు, పాలు, పారిశుధ్య కార్మికులు, పల్లె ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెండు రోజులుగా చలి తీవ్రత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. డిసెం బర్‌లోనే ఇలా ఉంటే జనవరిలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చలి పులి దెబ్బకు ఉన్ని దుప్పట్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు, సాక్సు లు, టీ, కాఫీలకు గిరాకీ పెరిగింది.
సలి సంపేత్తోంది..
Published Sat, Dec 27 2014 3:30 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
Advertisement