పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. శనివారం గుత్తిలో 14.5 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా... బెళుగుప్పలో 14.9 డిగ్రీలు, గుంతకల్లు 15.3 డిగ్రీలు, బొమ్మనహాల్ 15.4 డిగ్రీలు, కంబదూరు 16.2 డిగ్రీలు, యాడికి 16.6 డిగ్రీలు, కళ్యాణదుర్గం, కనేకల్లు 16.8 డిగ్రీలు మేర కొనసాగాయి.
మిగతా మండలాల్లో 17 నుంచి 21 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 67 నుంచి 87, మధ్యాహ్నం 28 నుంచి 38 మధ్య ఉంది. గాలులు గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వీచాయి. రాత్రి ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగినా చలితీవ్రత ఇంకా కొనసాగుతోంది.