సూరీడు మండుతున్నాడు. అంతకంతకూ తన ప్రతాపం చూపుతూ ఉక్కపోతతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
- ఠారెత్తిస్తున్న ఎండలు
– జిల్లా అంతటా పెరిగిన గ్మ్రీష్మతాపం
– ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనం
అనంతపురం అగ్రికల్చర్ : సూరీడు మండుతున్నాడు. అంతకంతకూ తన ప్రతాపం చూపుతూ ఉక్కపోతతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. దీంతో జిల్లా అంతటా గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఆదివారం పామిడి, కళ్యాణదుర్గం, చెన్నేకొత్తపల్లి, యల్లనూరు, తాడిమర్రి, గుంతకల్లు మండలాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
పుట్లూరు, కదిరి, ఆత్మకూరు, పెద్దవడుగూరు, గుడిబండ, బుక్కరాయసముద్రం 41 డిగ్రీలు, వజ్రకరూరు, గార్లదిన్నె, తనకల్లు, కూడేరు, రాప్తాడు, గుత్తి, కంబదూరు, ముదిగుబ్బ, విడపనకల్, నార్పల, బత్తలపల్లి, శెట్టూరు, ధర్మవరం, బెళుగుప్ప, బుక్కపట్టణం, కనగానపల్లి, అనంతపురం, కొత్తచెరువు మండలాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇక గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో జనం ఆందోళన చెందుతున్నారు.