చలిగిలి
చలి పంజా విసిరింది. చిన్నా పెద్దా..ముసలీ ముతకా అనే తేడా లేకుండా అందరూ గజగజవణుకుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి ఉషో్ణగ్రత 14,15 డిగ్రీలకు పడిపోతుండటంతో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లపైనే జీవితాన్ని గడిపే నిరాశ్రయులు, పారిశుద్ధ్య కార్మికులు, చిరువ్యాపారులు, పనిచేస్తే కానీ పూటగడవని కూలీల పరిస్థితి చెప్పనక్కరలేదు. చలికి వణుకుతూ వారు పడే యాతన అంతా ఇంతా కాదు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలలో ప్రయాణికులు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బెడ్‌షీట్లు, టవళ్లు, సె్వటర్ కప్పుకొని, మరికొందరు టీ తాగుతూ, ఇంకొందరు చలిమంటలు వేసుకుంటూ వెచ్చదనం పొందుతున్నారు.
- వి. శ్రీనివాసులు, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు