అనంతపురం అగ్రికల్చర్ : ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శనివారం పెద్దపప్పూరు, తాడిపత్రి, యల్లనూరు, చెన్నేకొత్తపల్లి, తాడిమర్రి మండలాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పామిడి. పుట్లూరు, నార్పల, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, కూడేరు, యాడికి మండలాల్లో 41 డిగ్రీలు, బత్తలపల్లి, ముదిగుబ్బ, పెద్దవడుగూరు, కంబదూరు, వజ్రకరూరు, తనకల్లు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, అనంతపురం, కళ్యాణదుర్గం, గార్లదిన్నె, రాప్తాడు మండలాల్లో 40 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమ శాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 18 నుంచి 28 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.