మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : మెట్‌పల్లి మండలం ఆరపేట శివారు 63వ జాతీయ రహదారి శుక్రవా రం రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మెట్‌పల్లి ఏఎస్సై నారాయణబాబు కథనం ప్రకారం.. నిజామాబాద్–2 డిపోకు చెం దిన బస్సు కరీంనగర్ వైపు నుంచి నిజామాబాద్ వెళ్తోంది. ఆరపేట శివారులోకి రాగానే.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో రెండు వా హనాల ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యాయి. గుంటూరు జిల్లా నర్సంపేట మండలం అంబపూ డి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సింగారపు ఎలమంద (39) క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అతడిని బయటకు లాగేందుకు జేసీ బీని రప్పించారు.
లారీ శకలాలను తొలగించి.. జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయా డు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న పదమూడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల ద్వారా తెలి సింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై నారాయణబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువైపులా జాతీయ రహదారిపై ఆగిపోయిన ట్రా ఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ (మెట్‌పల్లి డిపో) స్టాలిన్, మానకొండూరు మండల కేం«ద్రానికి చెందిన రేణికుంట శ్రీధర్, తాళ్లపల్లి శేఖర్, గంజిరాజు, గంజివాణి, గంజి దుర్గ, విద్యప్రియ, రాజవిజయ్ సాగర్, రజిత్ ప్రిన్స్, కొత్తగూడెంకు చెందిన రోహిత్ ఉన్నారు. కండక్టర్లు జి.నర్సయ్య, ఎన్.సుభాష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్నున్నట్లు ఏఎస్సై వివరించారు.
అరగంటపాటు నరకయాతన
లారీడ్రైవర్ అరగంటపాటు నరకయాతన అనుభవించాడు. బస్సు ఢీకొన్న అనంతరం అందరూ అతడు చనిపోయాడని భావించారు. పోలీసులు.. స్థానికులు జేసీబీ సాయంతో వాహనాలను విడగొట్టి.. డ్రైవర్‌ను బయటకు తీయగా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా.. చనిపోవడం విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment