
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు
పాట్నా: బిహార్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి క్షేమంగా ఉన్నారని పాట్నా పోలీసులు వెల్లడించారు.
చికిత్స అనంతరం మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. శరణ్ జిల్లాలోని ఛాప్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో రూడీ పాల్గొని పాట్నాకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా దెబ్బతింది.