ధ్వంసమైన వాహనాలు
సాక్షి, కమ్మర్‌పల్లి(బాల్కొండ): కమ్మర్‌పల్లి శివారులోని 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి మిషన్ భగీరథ పనుల కోసం కూలీలు వాహనంలో వెళ్తున్నారు.
మెట్‌పల్లి నుంచి మహారాష్ట్రలోని చింగోలికి బోలేరో వాహనం వెళ్తోంది. కమ్మర్‌పల్లి శివారులోని మోర్తాడ్ రోడ్‌లోని జనని ధ్యాన యోగా శిక్షణ కేంద్రం వద్ద 63వ నంబరు జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాల్లోని సుమారు 20 మందికి పైగా గాయాలు కాగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని భీమ్‌గల్ సీఐ సైదయ్య సందర్శించి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment