Vehicles collided
-
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్‌పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్‌పై ఆలూరు నుంచి గేట్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
పూడూరు: ఓ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న ఒకే కుటుంబంలోని ముగ్గురిని క్వాలిస్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్‌కు చెందిన సంతోష్‌రెడ్డి(36), స్వాతి దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఉద్యోగరీత్యా స్వాతి యూఎస్‌లో ఉంటోంది. సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రులు మల్లికార్జున్‌రెడ్డి (60) రాజ్యలక్ష్మి(56), కుమారుడు దేవాన్ రెడ్డి(6)తో కలసి హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఉంటున్నారు. వికారాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన దావత్‌కు సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రు లు, కుమారుడితో కలిసి వచ్చారు. మరుసటిరోజు ఉద యం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యా రు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి సమీపంలో రాంగ్రూట్లో వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌రెడ్డి, దేవాన్ రెడ్డి, రాజ్యలక్ష్మి మృతిచెందారు. సంతోష్‌రెడ్డి, క్వాలిస్ డ్రైవర్ మహ్మద్‌గౌస్, మరోవ్యక్తి గాయపడ్డారు. -
బోలేరో ఢీకొని 20 మంది గాయాలపాలు
సాక్షి, కమ్మర్పల్లి(బాల్కొండ): కమ్మర్పల్లి శివారులోని 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి మిషన్ భగీరథ పనుల కోసం కూలీలు వాహనంలో వెళ్తున్నారు. మెట్పల్లి నుంచి మహారాష్ట్రలోని చింగోలికి బోలేరో వాహనం వెళ్తోంది. కమ్మర్పల్లి శివారులోని మోర్తాడ్ రోడ్‌లోని జనని ధ్యాన యోగా శిక్షణ కేంద్రం వద్ద 63వ నంబరు జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాల్లోని సుమారు 20 మందికి పైగా గాయాలు కాగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని భీమ్‌గల్ సీఐ సైదయ్య సందర్శించి పరిశీలించారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని సత్తారుపల్లి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలెరో వాహనాలు ఢీ కొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. రొద్దం మండలం ఎల్.తిమ్మాపురం, లక్సానుపల్లి గ్రామాల నుంచి ఉదయం 6.45 గంటల సమయంలో టాప్‌లెస్ బొలెరో వాహనం (ఏపీ02 టీజే 0867)లో 26 మంది అనంతపురానికి బయలుదేరారు. పెనుకొండ మండలంలోని సత్తారుపల్లి వద్ద ఈ వాహనాన్ని ధర్మవరం సమీపంలోని దాడితోట నుంచి కర్ణాటకలోని టుంకూరుకు అరటి గెలలను తీసుకెళ్తున్న మరో బొలెరో వాహనం (ఏపీ02 టీహెచ్1409) 7.10 గంటల సమయంలో ఢీకొంది. ప్రమాదంలో అనంతపురానికి వెళ్తున్న వాహనంలోని ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు అనంతపురం, బెంగళూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానికులు, పోలీసులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో లక్సానుపల్లికి చెందిన గోపాల్‌రెడ్డి (60), రవీంద్రరెడ్డి (50), ఎల్.తిమ్మాపురానికి చెందిన జి.ఆంజనేయులు (40), వెంకప్ప (60), వడ్డి ఆంజనేయులు (38), వెంకటస్వామి (68), వడ్డి భీమయ్య (65), నారాయణప్ప (40) ఉన్నారు. మృతులంతా వ్యవసాయ కూలీలే. రెండు వాహనాల డ్రైవర్లు రాజేష్, శివారెడ్డి పరారీలో ఉన్నారు. అతివేగమే ప్రాణాలు తీసింది ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అత్యంత వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు నియంత్రణ కోల్పోవడంతోనే దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కూలీలతో ఉన్న వాహనం బోల్తా పడిన తర్వాత 100 అడుగుల మేర రోడ్డుపై ఈడ్చుకుని వెళ్లడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. మృతుల్లోని వెంకప్ప చెయ్యి తెగిపడటం చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. డ్రైవర్ వేగంగా నడుపుతుండటంతో ఆ బొలెరోలే ఎక్కిన కొంతమంది అంతకు ముందు రొప్పాల గ్రామం వద్ద దిగి మరో వాహనంలో వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను ట్రాక్టర్లో పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదన ఒక్కసారిగా మిన్నంటింది. ఇంటి నుంచి వెళ్లిన అరగంటలోపే విగతజీవులుగా మారిన తమ వారి మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ ప్రమాద సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్, పెనుకొండ సమన్వయకర్త శంకరనారాయణ, కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓఎస్డీ చౌడేశ్వరి, పెనుకొండ ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సత్తారుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందడంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. -
ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వాహనాల ఢీ
రామాయంపేట: అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన పందిని తప్పించబోయి ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ వాహన శ్రేణి (కాన్వాయ్)లోని కార్లు ఒకదాని వెంట ఒకటి ఢీకొనడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గురువారం జరిగింది. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి, ఇసన్నపల్లి గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే గోవర్దన్ తన అనుచరులతో కలసి వాహనాలలో బయలుదేరారు. మండలంలోని కోనాపూర్ శివారులోకి రాగానే వాహన శ్రేణిలో గంప వాహనం ముందుకు వెళ్లగానే అడవి పంది రోడ్డుపైకి వచ్చింది. దీంతో కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్ డీసీసీబీ డెరైక్టర్లు చంద్రారెడ్డి, కిష్టాగౌడ్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు అమృతరెడ్డి, బాల్‌రెడ్డి , మహేందర్‌రెడ్డి, శంకర్ గాయపడ్డారు.