ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వాహనాల ఢీ | MLA convoy of vehicles collided | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వాహనాల ఢీ

Published Fri, Apr 10 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వాహనాల ఢీ

ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వాహనాల ఢీ

రామాయంపేట: అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన పందిని తప్పించబోయి ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ వాహన శ్రేణి (కాన్వాయ్)లోని కార్లు ఒకదాని వెంట ఒకటి ఢీకొనడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గురువారం జరిగింది. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి, ఇసన్నపల్లి గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే గోవర్దన్ తన అనుచరులతో కలసి వాహనాలలో బయలుదేరారు.

మండలంలోని కోనాపూర్ శివారులోకి రాగానే వాహన శ్రేణిలో గంప వాహనం ముందుకు వెళ్లగానే అడవి పంది రోడ్డుపైకి వచ్చింది. దీంతో కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్ డీసీసీబీ డెరైక్టర్లు చంద్రారెడ్డి, కిష్టాగౌడ్‌తో పాటు టీఆర్‌ఎస్ నాయకులు అమృతరెడ్డి, బాల్‌రెడ్డి , మహేందర్‌రెడ్డి, శంకర్ గాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement