triple riding
-
కొత్వాల్ సాబ్ జర దేఖో!
నగరవాసికి ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ ఉల్లంఘనలు, ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్‌జాంలు తప్పట్లేదు. వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ విభాగం సిబ్బంది కెమెరాలు, ట్యాబ్‌లు చేతపట్టి ఈ–చలాన్లకే పరిమితమవుతున్నారు. చౌరస్తాలతో పాటు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటూ ఈ డ్రైవ్స్ చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ఉల్లంఘనులు రెచ్చిపోతున్నారు. రహదారులపై దూసుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచి్చపెట్టేవి. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్.. ఇలా ఇవన్నీ మూడో కేటగిరీ కిందికి వస్తాయి. రాజధానిలో మూడో కేటగిరీకి చెందిన ఉల్లంఘనలే ఎక్కువగా ఉంటున్నాయి. రెండోసారి సిటీ కొత్వాల్‌గా వచ్చిన సీవీ ఆనంద్‌కు ట్రాఫిక్ విభాగంపై మంచి పట్టుంది. గతంలో సుదీర్ఘకాలం సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన వేసుకున్న మార్కు ఇప్పటికీ పదిలమే. సైబరాబాద్, హైదరాబాద్ సీపీలుగా పని చేసినప్పుడూ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ట్రాఫిక్‌పై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు...
సాక్షి, చైన్నె: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టేవిధంగా చైన్నె పోలీసులు దూకుడు పెంచారు. గత ఏడు నెలల్లో రూ. 60 కోట్లను చలాన్ల రూపంలో వసూలు చేశారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు నుంచి ఏకంగా రూ. 19 కోట్లు రాబట్టారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే రీతిలో దూకుడు పెంచారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌లో ఆపకుండా ముందుకెళ్లే వారిపై గురి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారు , బైక్ రేసింగ్లలో పాల్గొనే వారికి జరిమానాల మోత మోగిస్తున్నారు. జరిమానాల జోరు.. నగరంలో అనేక కూడళ్లను హెల్మెట్ జోన్లు, స్పీడ్ కంట్రోల్ చెకింగ్ జోన్లుగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో నిరంతరం దృష్టి సారిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా జరిమానాల మోత మోగిస్తున్నారు. నిఘా నేత్రాల ద్వారా సైతం గురించి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో చలానా విధిస్తున్నారు. 32 రకాల నిబంధనలకు జరిమానాలు విధించాల్సి ఉన్నా, ప్రధానంగా ఏడు రకాల నిబంధనలు ఉల్లంఘించే వారిని నుంచి మాత్రమే ప్రసుత్తం ఫైన్ వసూలు చేస్తున్నారు. గత ఏడాది జరిమానాల రూపంలో ట్రాఫిక్ పోలీసు ఖాతాలో రూ. 149 కోట్లు చేరాయి. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ. 60 కోట్లను దాటేశారు. ఇందులో మందు బాబుల నుంచి ఎక్కువ మొత్తమే వసూలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 19,765 మందిపై కేసు నమోదు చేసి రూ. 19.76 కోట్లు జరిమానాల రూపంలో వసూళ్లు చేసి ఉన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 3,61,655 మంది నుండి రూ. 36.16 కోట్లు, ట్రిబుల్స్ డ్రైవింగ్‌లో 8,593 కేసులు నమోదు చేసి రూ. 85.93 లక్షలు, అతి వేగానికి సంబంధించి 2,716 కేసుల్లో రూ. 27.16 లక్షలు, సీటు బెల్ట్ ధరించని 9,101 మంది నుంచి రూ. 91.01 లక్షలు, సిగ్నల్ వద్ద వాహనం ఆపకుండా వెళ్లిన 39,320 మంది నుంచి రూ. 1.96 కోట్లు, కార్లకు బ్లాక్ ఫిల్మ్ అంటించిన 4,284 మంది నుంచి రూ.21.42 లక్షలు వసూలు చేశారు. ఇదే కాకుండా సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన వాహన నెంబర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా చాలానా విధించారు. వీటి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా లేదా, ట్రాఫిక్ జరిమాన వసూళ్లు కేంద్రాల ద్వారా వాహన దారులు త్వరితగతిన చెల్లిస్తే మంచిది. లేని పక్షంలో వారి వాహనాలు, లైసెన్స్‌లను సీజ్ చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచనున్నారు. ఇక వాహనదారులు నిబంధనలు సక్రమంగా పాటిస్తే, జరిమానాల మోత మోగించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా వాహన దారులకు మరింత అవగాహన కల్పించే విధంగా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చైన్నె పోలీసుల కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్ తెలిపారు. -
మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ
సాక్షి, బెంగళూరు: ప్రజలు ఎవరైనా బైక్ మీద హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకుని వేలకు వేల జరిమానా విధించి బండిని సీజ్ చేస్తారు. కానీ చట్టాన్ని కాపాడే పోలీసులే అతిక్రమిస్తే.. ఏమిటిది? అని ఓ మహిళ నిలదీసిన ఘటన వైరల్ అయ్యింది. నగరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, అది కూడా ఇద్దరు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తున్నారు. వీరిని గమనించిన ఒక మహిళ రూల్స్ చేసేది మీరే, ధిక్కరించేది మీరే అని క్లాస్ తీసుకుంటూ వీడియో తీశారు. అత్యవసర కార్యం ఉండడంతో హెల్మెట్ లేకుండా వచ్చామని మహిళా కానిస్టేబుల్స్ సమాధానమిచ్చారు. మీరు ఏం చేశారో చూసుకోండి, దయచేసి స్కూటీలో నుంచి దిగి హెల్మెట్ ధరించండి అని వారికి మహిళ హితబోధ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: (మతాంతర ప్రేమ పెళ్లి కలకలం) -
రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై నిబంధనలు కఠినతరం
-
Hyderabad: రాంగ్‌సైడ్, ట్రిపుల్ రైడింగ్‌కు ఇక బాదుడే
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాంగ్ సైడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులకు కళ్లెం వేసేందుకు సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. వ్యతిరేక దిశలో వాహనాలను నడిపితే సెక్షన్ 119/177, 184 కింద రూ.1,700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200 జరిమానా విధించనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 2020లో 15 మంది, 2021లో 21 మంది, ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 15 మంది, ట్రిపుల్ రైండిగ్ కారణంగా 2020లో 24 మంది, గతేడాది 15 మంది, గత నెలాఖరు వరకు 8 మంది మరణించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని, అందుకే స్పెషల్ డ్రైవ్‌లను చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: (కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ) -
ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ఉండేది ఎందుకు.. మనం జాగ్రత్తగా.. సేఫ్‌గా గమ్యం చేరడానికి. హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. తాగి డ్రైవ్ చేయకండి వంటి నిమయాలన్ని మన సేఫ్టి కోసం పెట్టినవే. కానీ జనాలు మాత్రం రూల్స్ ఉల్లంఘిస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతారు. ఇక చలానాల నుంచి తప్పించుకోవడానికి జనాలు వేసే వేషాలు.. పడే పాట్లు చూస్తే.. వీళ్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు అనిపిస్తుంది. గతంలో కేబుల్ బ్రిడ్జి మీద ఓ కుటుంబం నంబర్ ప్లేట్ మీద చున్నీ వేసిన ఘటన చూశాం. ఇక మరి కిందరు టీఎస్ తర్వత వచ్చే ఆల్ఫాబెట్ సిరీస్ కనపడకుండా స్టిక్కర్ అంటించడం.. మూతికి పెట్టుకోవాల్సిన మాస్క్ నంబర్ ప్లేట్‌కు పెట్టడం... ఇక బండి మీద వెనక కూర్చున్న ఆడవారు చున్నీ, చీర కొంగుతో బైక్ నంబర్ ప్లేట్ కనపడకుండా చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఎన్ని వేషాలు వేసినా.. ఒక్కసారి ట్రాఫిక్ వారి కంట్లో పడితే.. తాటా తీయడం మాత్రం ఖాయం. అంతేకాదండోయ్.. మనకు అర్థం అయ్యేలా చేయడానికి సూపర్ హిట్ సినిమాల నుంచి మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి మీమ్‌ను షేర్ చేయగా.. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ‘‘చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం. విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే హెల్మెట్ ఉంది. ఇక ట్రిపుల్ రైడింగ్‌కి చలానా పడుతుంది. దాంతో బైక్ మీద కూర్చున్న మహిళ అతి తెలివితో నంబర్ ప్లేట్ సరిగా కనపడకుండా ఉండేందుకుగాను తన కాలిను దాని మీద పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది. ఇంకేముంది వారు రంగంలోకి దిగి బైక్ నంబర్ ప్లేట్‌ని గుర్తించి.. 2,800 రూపాయల చలానా విధించారు. (చదవండి: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?) కావాలని వాహనం సమాచారం దాచినందుకు 500 రూపాయలు.. ప్రమాదకర డ్రైవింగ్‌కు 1,000 రూపాయలు.. ట్రిపుల్ డ్రైవింగ్‌కు 1,200.. వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేనందుకు గాను 100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు. ఇక వీరి ఫోటోతో పాటు షేర్ చేసిన మీమ్ సూపర్. అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్‌ని వీరికి అన్వయిస్తూ.. ‘‘నువ్వేమో 1,300 రూపాయలు కాపాడాలని కాలు పెట్టావ్.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో 1500 రూపాయలు ఎక్కువ పడ్డాయి’’ అంటూ క్రియేట్ చేసిన మీమ్ సూపర్బ్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
ట్రిపుల్... ట్రబుల్
సాక్షి, సిటీబ్యూరో: ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం సర్వసాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ నిత్యం ప్రమాదాల బారినడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ హరా దర్వాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నగరంలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మంగళ్‌హాట్ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుడు సైతం మద్యం తాగి ఉన్నారని, దీని వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించే వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణంగా టూ వీలర్స్ వినియోగించేది వీరే ఎక్కువ కావడంతో ప్రమాదాలబారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. బంధువుల కంటే స్నేహితులతో కలిసే ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడుతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కనిపించినా... జంక్షన్ వచ్చినా... ఆఖరులో కూర్చున్న యువకుడు తక్షణం దిగిపోయి నడుస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి. ఇలా చేస్తూ ట్రిపుల్ రైడర్లు అనేక సందర్భాల్లో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా దూసుకుపోతూ తరచు ప్రమాదాలకు లోనవుతున్నారు. అదుపు అసాధ్యం... ప్రతి వాహనానికీ దానిని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్ రైడర్ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పష్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇంజిన్ కెపాసిటీ: మోటారు వాహనాలకు ఉండే ప్రతి ఇంజిన్‌కు ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీనిని సాంకేతికంగా ఇంజిన్ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజిన్ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజిన్‌పై పడుతుంది. యాక్సిలరేటింగ్ కెపాసిటీ: ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది. బేకింగ్/బ్యాలెన్సింగ్ కెపాసిటీ: ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పును గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు. ఈ ఏడాది జరిగిన ‘ట్రిపుల్’ యాక్సిడెంట్స్‌లో కొన్ని... ♦రామ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ తన స్నేహితురాళ్లు అనూష, పల్లవితో కలిసి తన బైక్‌పై సంఘీ టెంపుల్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. గోపి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ♦ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చిన సురేష్ అహ్మద్‌గూడ వద్ద మోది కన్స్ట్రక్షన్స్లో పని చేసేవాడు. భార్య రాధిక, బావమరిది ఉదయ్‌లతో పాటు చిన్నారుల్ని తీసుకుని బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. సురేష్ మరణించగా మిగిలిన వారు క్షతగాత్రులయ్యారు. ♦డీ పోచంపల్లికి చెందిన సాయి తన స్నేహితులు కృపాకర్, విష్ణులతో కలిసి బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో సాయి చనిపోగా... మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ♦తాగాజా బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... మరొకరు క్షతగాత్రులయ్యారు. వీరు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు చెబున్నారు. -
మందుబాబులూ బహుపరాక్
మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎక్కువవుతోంది. దీని కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తూ.. పరిమితికి మించి మద్యం శాతం ఉంటే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: మోతాదుకు మించి మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలోనే కాకుండా సాధారణ రహదారుల్లోనూ తనిఖీలు చేపట్టి మందుబాబుల ఆటకట్టిస్తున్నారు. లెక్క దాటుతున్నారు..! బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో మద్యం మోతాదు(ఆల్కహాల్ కంటెంట్) 30 మిల్లీగ్రాములకు మించకూడదు. అయితే బ్రీత్‌అనలైజర్‌తో పరీక్షల్లో చాలా మందికి 100 మిల్లీగ్రాములను దాటేస్తోంది. విజయవాడలోని ఘంటసాల మ్యూజిక్ కళాశాల సమీపంలోని బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. మోటార్ బైక్‌పై వస్తున్న ఒక వ్యక్తి స్నేక్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. పోలీసులు అతన్ని ఆపి బ్రీత్‌అనలైజర్‌తో పరీక్ష చేయగా ఆల్కహాల్ కంటెంట్ 548 మిల్లీగ్రామలు ఉంది. అలాగే ఫూటుగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఏడుగురు వ్యక్తులు ఆటోనగర్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దొరికారు. వారందరినీ బ్రీత్అనలైజర్స్తో పరీక్ష చేయగా మద్యం మోతాదు 301 నుంచి 400 మిల్లీగ్రాములుగా నమోదైంది. ఇలా గత మూడు నెలల కాలంలో 17 రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో 1–100 మిల్లీగ్రాముల ఉన్న వారు 386 మంది, 101–200 మి.గ్రాములు నమోదైన వారు 231 మంది, 201–300 మి.గ్రాములు దాటిన వారు 46 మంది, 301–600 మిల్లీగ్రాములు ఉన్న వారు 9 మంది ఉన్నారు. ప్రమాదాలకు ఆస్కారం.. మద్యం నిషాలో వాహనాలు నడిపేప్పుడు అయోమయం, ఆందోళనకు గురై ప్రమాదాలు చేసే అవకాశాలున్నాయి. చాలామంది ఈ సమయంలో నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతుండడంతో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. 976 మందిపై కేసులు.. ఈ నేపథ్యంలో విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మందుబాబులపై దృష్టిసారించారు. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో 17 రోజులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జనవరి 31న 104 మందిపై కేసులు నమోదు చేయగా.. ఫిబ్రవరి 23న చేపట్టిన తనిఖీల్లో 107 మంది దొరికారు. అలాగే అదే నెల 29న మరో 93 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 672 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో మోటార్ సైకిల్ వాహనచోదకులు 742 మంది కాగా.. ఆటో డ్రైవర్లు 161 మంది, కారు డ్రైవర్లు 36 మందితోపాటు ఇతర వాహనాల డ్రైవర్లు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. రాత్రిపూటే కాకుండా పగటి పూట కూడా నగరంలోని ఇన్నర్ రింగ్‌రోడ్డు, సీవీఆర్ ఫ్లై ఓవర్, కనకదుర్గవారధి, కంకిపాడు, గన్నవరం, నున్న పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టగా 34 మంది లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిపైనా కేసులు నమోదు చేశారు. నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారు, ప్రమాదకర డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డేంజరస్ పార్కింగ్‌లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. తాగి నడిపితే కఠిన చర్యలు.. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకే డ్రంకెన్‌డ్రైవ్‌పై దృష్టి సారించాం. కొన్ని ప్రాంతాల్లో పగలూ నిర్వహిస్తున్నాం. గతంలో ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేసేవాళ్లం. ఇప్పుడు సాధారణ రహదారుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత మూడు నెలల్లో 17 రోజులు తనిఖీలు నిర్వహించి 976 మందిపై కేసులు నమోదు చేశాం. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి కౌన్సెలింగ్ నిర్వహించి జరిమానా విధిస్తున్నాం. భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటాం.– టి.వి. నాగరాజు, డిప్యూటీ పోలీసు కమిషనర్(ట్రాఫిక్) -
ప్రాణం తీసిన అతివేగం
కుత్బుల్లాపూర్: ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనంపై త్రిపుల్ రైడింగ్‌లో దూసుకు వెళ్తున్న కళాశాల విద్యార్థులు బస్సును ఢీకొనగా ఒకరు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రణధీర్‌రెడ్డి కొంపల్లిలోని డ్రైవేజ్ ఇండియా ట్రావెల్స్ నుంచి ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. తన క్లాస్మేట్స్ హిమాంశు, సాయివర్ధన్లతో కలిసి బైక్‌పై శుక్రవారం సాయంతరం 5.30 గంటలకు త్రిబుల్ రైడింగ్ చేస్తూ మైసమ్మగూడ నుంచి బహదూర్‌పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మూలమలుపు వద్ద బండి స్కిడ్ అవడంతో ముగ్గురు వాహనంపై నుంచి కింద పడ్డారు. అయితే రణధీర్ కుడి వైపున రోడ్డు మధ్యలో పడిపోవడంతో ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు రణధీర్‌రెడ్డి తలమీద నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రణధీర్‌రెడ్డి పెద్దపల్లి జిల్లా నుంచి చదువు కోవడానికి నగరానికి వచ్చాడు. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయం చేస్తుండగా తల్లి మాధవి గృహిణి. కాగా రణధీర్‌రెడ్డి త్రిపుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా బైకునడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా డ్రైవేజ్ ఇండియా ట్రావెల్స్ సంస్థ అద్దెకు ఇచ్చిన వాహనంపై మే 30, 2019 న కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్ వద్ద రాంగ్ రూట్, నో హెల్మెట్ నేరంతో రూ.1235 ఇ–చలాన్ జారీ అయింది. -
నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’
సాక్షి, సిటీబ్యూరో: అది వేళగాని వేళ... ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణిస్తున్నారు... దీనిని చూసిన మరో వాహనచోదకుడు ‘ఇంకొకరిని ఎక్కించుకోపోయారా?’ అన్నాడు...దీంతో ఆగ్రహించిన ఆ నలుగురూ వీరి వాహనాన్ని వెంటాడి అటకాయించారు... విచక్షణారహితంగా దాడి చేశారు... అంతటితో ఆగకుండా బాధితుడి వద్ద ఉన్న బంగారు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కుపోయారు... సీన్ కట్ చేస్తే ఈ నలుగురిపై దోపిడీ కేసు నమోదు కావడంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. ఖైరతాబాద్‌కు చెందిన డిగ్రీ విద్యార్థులు ఉదయ్‌కిరణ్, బి.రిషికేష్ యాదవ్, మల్లేపల్లికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి సి.రాహుల్, మరో ఇంటర్మీడియట్ విద్యార్థి స్నేహితులు. వీరిలో ఒకరి పుట్టి రోజు వేడుకలు చేసుకునేందుకు గత శనివారం రాత్రి నెక్లెస్‌రోడ్‌కు వెళ్లారు. అర్థరాత్రి ‘ఫంక్షన్’ పూర్తి చేసుకుని మద్యం మత్తులో తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మూసాపేట్‌కు చెందిన నలుగురు స్నేహితులు రెండు బైక్‌లపై బిర్యానీ కోసం బషీర్‌బాగ్ వైపు బయలుదేరారు. వీరికి ఆ నలుగురూ ఎర్రమంజిల్ ప్రాంతంలో తారసపడ్డారు. ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణించడాన్ని గమనించిన వీరిలోని ఓ వ్యక్తి ‘దానిపై నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు ‘రా నువ్వే ఎక్కు’ అంటూ అనడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఓ వాహనంపై ఉన్న నలుగురూ... రెండు బైక్‌లపై ఉన్న నలుగురి వెంటపడ్డారు. ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో వారిని అడ్డుకుని తమను కామెంట్ చేసిన వ్యక్తితో పాటు మరొకరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం బాధితుడి మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. అదే సమయంలో పోలీసు గస్తీ వాహనం అటుగా రావడంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. బాధితుడు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నలుగురూ సొత్తు కూడా లాక్కోవడంతో ఇది దోపిడీ దొంగతనం కేసుగా మారింది. నేరం జరిగిన తీరును బట్టి ఇది ప్రొఫెషనల్స్ పనిగా భావించిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులుతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుల వాహనం ఆచూకీ తెలిసింది . దీంతో ఆ ఫుటేజ్‌ను మరింత విశ్లేషించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాహుల్ ఫొటో సంగ్రహించగలిగారు. దీని ప్రింట్స్ తీసుకున్న బృందాలు ఆ ఫొటోలతో ఖైరతాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆరా తీశారు. ఫలితంగా స్థానికులు అతడిని గుర్తుపట్టి ఆచూకీ చెప్పారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... మిగిలిన ముగ్గురి వివరాలు తెలిశాయి. దీంతో మైనర్ సహా నిందితులను పట్టుకున్న పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురూ దాడి చేయడంతో ఆగితే సాధారణ కేసుగానే ఉండేదని, అయితే సొత్తు లాక్కుపోవడంతో దోపిడీగా మారి దాని ప్రాధాన్యత పెరిగిందని పోలీసులు పేర్కొన్నారు. -
కిరాక్ ఆన్సర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు
సాక్షి, హైదరాబాద్: ఫొటో చూసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని భ్రమపడ్డారా.? మీరే కాదండోయ్.. తెలంగాణ పోలీసులు కూడా అలానే భావించారు. అంతేనా.. వారికి ఆన్లైన్లో చలానా కూడా విధించారు. ఇది చూసి వాహనదారుడు షాకయ్యాడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ట్రిపుల్ రైడ్ కానే కాదు. ముందు వేరే వాహనంపై వెళ్తున్న వ్యక్తి సరిగ్గా ఇతని వాహనాన్నే నడుపుతున్నట్టుగా అనిపించడంతో పోలీసులు చలానా జారీచేశారు. కానీ కాస్త పరిశీలించి చూస్తే అది అబద్ధమని రుజువైంది. చేయని తప్పుకు చలానా విధిస్తారా అంటూ సదురు వాహనదారుడు పోలీసులపై మండిపడ్డాడు. సరిగ్గా చూడండి. మీకే తెలుస్తుంది వాహనంపై ముగ్గురున్నామా? లేక ఇద్దరున్నామా..? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. ఈ దెబ్బకు పోలీసులు తొలుత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘మీ అభ్యర్థనను స్వీకరించాం. ఆ చలానాను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ పెట్టుకోనందుకుగా మార్చుతున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. మీరు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.. ఎప్పుడూ హెల్మెట్ ధరించండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది చూసిన సోషల్‌మీడియా జనాలు పాపం.. ఆ వ్యక్తి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది అని సెటైర్స్ వేసుకుంటున్నారు. -
ముగ్గురు ఎక్కితే ముప్పే!
సాక్షి, సిటీబ్యూరో: ‘టూ వీలర్ ఫర్ టూ ఓన్లీ’... మోటారు వాహనచట్టం స్పష్టం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం రాజధానిలో సాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ నిత్యం ప్రమాదాల బారినడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున మెట్టుగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో పాతబస్తీలో ఒకరు, ఫిబ్రవరిలో గుడిమల్కాపూర్‌లో ముగ్గురు ట్రిపుల్ రైడింగ్‌కే బలయ్యారు. మృతులు, బాధితుల్లో యువతే ఎక్కువ... సాధారణంగా టూ వీలర్స్ వినియోగించే వారిలో యువతే ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలబారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. వీరు స్నేహితులతో కలిసే ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడుతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనిపించినా... జంక్షన్ వచ్చినా... ఆఖరులో కూర్చున్న యువకుడు తక్షణం దిగిపోయి నడుస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి. ఇలా చేస్తూ ట్రిపుల్ రైడర్లు అనేక సందర్భాల్లో పోలీసులను పక్కదారి పట్టించడమేగాక తరచూ ప్రమాదాలకు లోనవుతున్నారు. వాహనం అదుపు చేయడం అసాధ్యం... ప్రతి వాహనానికీ దానిని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్ రైడర్ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పష్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇంజన్ కెపాసిటీ మోటారు వాహనాల్లో ప్రతి ఇంజన్‌కూ ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీనినే సాంకేతికంగా ఇంజన్ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజన్ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజన్‌పై పడుతుంది. యాక్సిలరేటింగ్ కెపాసిటీ: ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది. బ్రేకింగ్/బ్యాలెన్సింగ్ కెపాసిటీ:ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పును గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు. కఠిన చర్యలు అవసరం ప్రస్తుతం నగరంలో డ్రంక్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం వంటివి చేస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు కౌన్సిలింగ్ తర్వాతే అప్పగిస్తున్నారు. అనేక సందర్భాల్లో కోర్టుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. యువతను బలి తీసుకుంటున్న ట్రిపుల్ రైడింగ్ విషయంలోనూ ఇలాంటి కఠిన చర్యలు అవసరం. డ్రంక్ డ్రైవర్ల విషయంలో అనుసరిస్తున్న మాదిరిగా కుటుంబీకులతో కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విధానం అవలంభించాలి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ట్రిపుల్ రైడింగ్‌ను అదుపు చేయడానికి కుటుంబీకుల సహకారం కూడా ఎంతో అవసరం. – రవాణా రంగ నిపుణులు ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్నాం నగరంలో ట్రిపుల్ రైడింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ చిక్కిన వారికి జరిమానా విధించడంతో పాటు అక్కడిక్కడే ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ఉల్లంఘన వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. వీటిలో భాగంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ చిక్కిన వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకోవడం, వారికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో (టీటీఐ) సమగ్ర కౌన్సిలింగ్ తర్వాతే జరిమానా కట్టించుకుని వాహనం తిరిగి ఇవ్వడం వంటి చర్యలు యోచిస్తున్నాం. ఉన్నతాధికారుల అనుమతి తర్వాత కార్యాచరణలో పెట్టే అవకాశం ఉంది. – అనిల్‌కుమార్, ట్రాఫిక్ చీఫ్ -
ర్యాష్ డ్రైవింగ్
జగిత్యాలక్రైం : రయ్..రయ్‌మంటూ కుర్రకారు జోష్.. ఆటోలను ఎలా నడిపిన తమను అడిగేవారు లేరనే ఆటోవాలాల ధీమ.. జగిత్యాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రయితే చాలు రోడ్లపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి హైస్పీడ్‌లో వెళ్తూ సడన్‌గా బ్రేక్‌లు వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ రాత్రయితే వీరు జోష్ పెంచుతున్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాలతో విపరీతమైన వేగంతో వెళ్తున్న వీరి సరదా ఎదుటి వారి ప్రాణాలమీదికి తెస్తుంది. రాత్రి వేళల్లో.. అర్ధరాత్రి ఆటోలు ఎక్కే ప్రయాణికులకు ఆటోవాలాలు తమను గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తారన్న భరోసా లేకుండా పోతుంది. కొందరు ఆటోవాలాలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకొని వేగంగా నడుపుతుండడంతో ప్రయాణికులు జంకుతున్నారు. మెల్లగా వెళ్లాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. రాత్రి వేళల్లో పోలీసుల నిఘా కరువవడంతోనే వీరి ఆగడాలు శృతిమించుతున్నాయి. నిఘా ఎక్కడా ? రోడ్లపై కొందరు ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కార్లు, జీపులు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న ప్రధాన చౌరస్తాల వద్ద పోలీసులు, పెట్రోలింగ్ పోలీసులు వీరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లాకేంద్రంలో న్యూసెన్స్‌కు పాల్పడేవారిపై ‘ఈ పెట్టి’ కేసులు ఎలా నమోదు చేస్తున్నారో వీరిపై అలాంటి కేసులు పెట్టాలని పలువరు అభిప్రాయపడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. భద్రత కల్పించాలి ఆటోలో ప్రయాణించే వారికి భద్రత కల్పించాలి. ముఖ్యంగా ఒంటరిగా ఆటోలో వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం కోల్పోతున్నారు. కొందరు ఆటోడ్రైవర్లు రాత్రివేళల్లో ప్రయాణికుల నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా ఆటోచార్జీలు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి. – కాటిపల్లి మునీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ చర్యలు తీసుకుంటాం జిల్లా కేంద్రంలో రాత్రిపూట ఆటోల వేగాన్ని నియ ంత్రించేందుకు చర్యలు చేపడతాం. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెట్టించి వేగంగా వెళ్లే ఆటోలు, ద్విచక్రవాహనదారులపై చ ర్యలు తీసుకుంటాం. ప్రయాణికులను ఇబ్బదిపెట్టినట్లు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – ఆరోగ్యం, ట్రాఫిక్ ఎస్సై, జగిత్యాల -
ఇలా వెళితే ప్రమాదాలు జరగవా?
చిత్తూరు: ఓసారి ఈ చిత్రం చూడండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, హెల్మెట్ వేసుకోండి అని ట్రాఫిక్ పోలీసులు ఓ వైపు చెబుతూనే ఉన్నా జనాలకు మాత్రం ఈ తరహా పైత్యం ఇంకా తగ్గలేదు. చిత్తూరు నగరం మురకంబట్టులో ఓ బైక్ మీద ఐదుగురు వెళుతూ సాక్షి కెమెరాకు చిక్కారు. మరి ఇలా వెళితే ప్రమాదాలు జరగవా? ఏ చిన్న తేడా వచ్చినా వీరి ప్రాణాలతో పాటు ఎదురుగా వచ్చే ప్రాణాలకూ ముప్పే కదా? -ఫోటో: ఎన్.మురళి, చిత్తూరు -
డబుల్ ‘ట్రిపుల్’ రైడ్
మచిలీపట్నం : ఒక బైక్.. ఆరుగురు ప్రయాణికులు.. ఆశ్చర్యంగా ఉందా.. ఈ చిత్రం చూడండి.. ముగ్గురు యువకులతో పాటు మేము సైతం అంటూ శునకాలు రాజసం ఒలకబోస్తున్నాయి. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకాలను ఇంట్లోనే కాక వృత్తి సమయంలోనూ తమ వెంట ఉంచుకుంటూ ఎక్కడికంటే అక్కడి వాటిని తీసుకెళుతున్నారు కొందరు మత్స్యకారులు. ఈ డబుల్ ట్రిపుల్ డ్రైవింగ్‌ను మంగినపూడి బీచ్‌రోడ్డులో ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.– సాక్షి ఫొటో గ్రాఫర్ -
మహిళల ట్రిపుల్ రైడింగ్.. వీడియో వైరల్
హైదరాబాద్: ముగ్గురు మహిళలు ఒకే బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యమహా ఆర్15 బైక్‌పై సాధారణంగా డైవర్‌తోపాటూ మరో వ్యక్తి కూర్చుంటే మూడో వ్యక్తి కూర్చోవడం చాలా కష్టం. అలాంటిది ఓ మహిళ చీర కట్టుకుని మరీ, మరో ఇద్దరు మహిళలను వెనకాల కూర్చోపెట్టుకొని నడిపింది. హైవే పై.. రై రై అంటూ ఎంచక్కా రైడింగ్ చేస్తుండగా పక్కనే కార్లో వెళుతున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. కార్లోని వ్యక్తి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న మహిళల బైక్ దగ్గరకు రాగానే, ఆంటీ మీరు చరిత్ర సృష్టిస్తున్నారూ.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మహిళలు యమహా ఆర్15 వంటి బైక్‌లను నడపడం చూస్తుంటే.. మహిళలు అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ కూడా లేకుండా బైక్ రైడ్ చేయడం రూల్స్ అతిక్రమించడమే అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. -
యమహా బైక్‌పై మహిళల ట్రిపుల్ రైడింగ్..
-
కారులో ట్రిపుల్ రైడింగ్‌కు జరిమానా
పట్నంబజారు : ద్విచక్ర వాహనంపై ముగ్గురు తిరగకూడదు...హెల్మెట్ పెట్టుకోవాలి..అంత వరకు ఓకే.. అయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు వింత నిబంధనలతో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారు. కారులో కూడా హెల్మెట్ పెట్టుకోవాలట.. ముగ్గురికి మించి ఎక్కకూడదట..ఇదేంటి అనుకుంటున్నారా..నిజమేనండీ. రోజుకు రెండు వందల కేసులు టార్గెట్...ఎవరెలా నవ్విపోతే నాకేలా...ద్విచక్ర వాహనం అయితే ఏంటీ..కారు అయితే ఏంటీ చలానా కొట్టామా...లేదా ఇదీ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం. వివరాల్లోకెళితే.. గుంటూరు నగరానికి చెందిన ఒక ఎనస్తీషియా డాక్టర్‌కు ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్ పోలీసులు చలానా పంపారు. రూ. 335 ఈ– సేవాలో కట్టాలని. త్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటం వలన జరిమానా విధించినట్లు చలానాలో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వాహనం ఏంటో తెలుసా..? కారు కావటం కొసమెరపు. AP07 CU5994 కారుకు పై విధంగా చలానా పంపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నిస్తే చలానా చెల్లించాల్సిందేననంటూ పోలీసులు సెలవిచ్చారు. నిత్యం టార్గెట్ల మయం.... వాహనం ఫొటో తీసిన తరువాత మీ సేవాకు లింక్ చేస్తారు. ఈ క్రమంలోనై కారు నంబరు చూడకపోవటం ట్రాఫిక్ అధికారుల, సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. నిత్యం రెండు వందల కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటంతోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. -
మీకో దండం.. ఇలావెళితే గండం
చిత్తూరు, మదనపల్లె క్రైం: బాబూ...మీకు నమష్కారం. తలకు హెల్మెట్ లేదు.. ద్విచక్ర వాహనంలో ముగ్గురు పిల్లలు, భార్యతో వెళ్తున్నావు. జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబమే పోతుంది..ఆ విషయాన్ని గుర్తించి నడుచుకోండి..రోడ్డు నిబంధనలు పాటించండి.. అంటూ మదనపల్లె టూటౌన్ ఎస్ఐ కృష్ణయ్య పరిమితికి మించి వెళుతున్న వాహనదారులను వేడుకున్నారు. నిమ్మనపల్లె సర్కిల్లో వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్ఐ అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనంలో ఐదుగురు ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించారు. వారికి రెండు చేతులతో నమస్కరించి ‘ఇలా అయితే ప్రమాదాలు జరగవా’ అంటూ చిన్నపాటి విజ్ఞాపనతో కూడిన క్లాసు తీసుకున్నారు. -
ట్రిపుల్ రైడింగ్ నో ‘ఫైన్’
రిమాండ్‌కు తీసుకెళ్తున్న ఖైదీని మధ్యలో కూర్చోబెట్టుకొని పోలీసులు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఈ దృశ్యం శుక్రవారం గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ సెంటర్లో కనిపించింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. – ఫొటో: రూబెన్ బెసాలియేల్, గుంటూరు