త్రిబుల్ రైడింగ్‌లో వెళుతున్న మహిళా పోలీసులు
సాక్షి, బెంగళూరు: ప్రజలు ఎవరైనా బైక్ మీద హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకుని వేలకు వేల జరిమానా విధించి బండిని సీజ్ చేస్తారు. కానీ చట్టాన్ని కాపాడే పోలీసులే అతిక్రమిస్తే.. ఏమిటిది? అని ఓ మహిళ నిలదీసిన ఘటన వైరల్ అయ్యింది. నగరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, అది కూడా ఇద్దరు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తున్నారు.
వీరిని గమనించిన ఒక మహిళ రూల్స్ చేసేది మీరే, ధిక్కరించేది మీరే అని క్లాస్ తీసుకుంటూ వీడియో తీశారు. అత్యవసర కార్యం ఉండడంతో హెల్మెట్ లేకుండా వచ్చామని మహిళా కానిస్టేబుల్స్ సమాధానమిచ్చారు. మీరు ఏం చేశారో చూసుకోండి, దయచేసి స్కూటీలో నుంచి దిగి హెల్మెట్ ధరించండి అని వారికి మహిళ హితబోధ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.
చదవండి: (మతాంతర ప్రేమ పెళ్లి కలకలం)
Comments
Please login to add a commentAdd a comment