సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాంగ్ సైడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులకు కళ్లెం వేసేందుకు సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. వ్యతిరేక దిశలో వాహనాలను నడిపితే సెక్షన్ 119/177, 184 కింద రూ.1,700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200 జరిమానా విధించనున్నారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 2020లో 15 మంది, 2021లో 21 మంది, ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 15 మంది, ట్రిపుల్ రైండిగ్ కారణంగా 2020లో 24 మంది, గతేడాది 15 మంది, గత నెలాఖరు వరకు 8 మంది మరణించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని, అందుకే స్పెషల్ డ్రైవ్‌లను చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: (కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ)
Comments
Please login to add a commentAdd a comment