wrong side driving
-
Hyderabad: ఇయాల్టి నుంచి హెల్మెట్ మస్ట్ ..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో గడిచిన మూడు రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్ చీఫ్ పి.విశ్వప్రసాద్ సోమవారం పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నుంచి నగర వ్యాప్తంగా హెల్మెట్, రాంగ్ సైడ్/రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 215 మంది అశువులుబాశారన్న ఆయన...వీరిలో 100 మంది ద్విచక్ర వాహన చోదకులే అని పేర్కొన్నారు. వీరిలో 46 మంది హెల్మెట్ ధరించని కారణంగానే చనిపోయారని, హెల్మెట్ ధరిస్తే క్షతగాత్రులుగా మారే ప్రమాదం 70 శాతం, మృత్యువాతపడే ముప్పు 40 శాతం తగ్గుతుందని విశ్వప్రసాద్ వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే చోదకులకు రిస్క్ మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ద్విచక్ర వాహనచోదకులు 100 శాతం హెల్మెట్ ధరించేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్న ఆయన మంగళవారం నుంచి దీంతో పాటు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించని వారికి రూ.200, రాంగ్ సైడ్/రాంగ్ రూట్ డ్రైవింగ్‌కి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపారు. నగరవాసులు సైతం తమ దృష్టికి వచ్చిన ఉల్లంఘనల్ని ట్రాఫిక్ పోలీసు అధికారిక ఫేస్బుక్, ఎక్స్ ఖాతాలతో పాటు హెల్ప్‌లైన్ నెం.9010203626 ద్వారా అధికారుల దృష్టికి తేవాలని కోరారు. -
రాంగ్‌సైడ్‌లో వెళ్తే లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా వందల సంఖ్యలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఆయా ప్రమాదాలలో వాహనదారులే కాదు పాదచారులు, తోటి ప్రయాణికులు సైతం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దయ్యేలా చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు.. అభియోగపత్రాల్లో మందుబాబుల వ్యవహార శైలి, మద్యం మత్తులో చేసిన ప్రమాదాల వివరాలను నమోదు చేస్తున్నారు. న్యాయస్థానాలు వారికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానాలు విధించడంతో పాటు కొందరికి 3 నెలల నుంచి 6 నెలల వరకు లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాయి. తాజాగా అపసవ్య దిశలో (రాంగ్ సైడ్) వాహనాలు నడపడం, అతివేగం కారణంగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దయ్యేలా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలోనే గ్రేటర్లో అమల్లోకి రానున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. హైవేలపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు: జాతీయ రహదారులపై పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో హైవేలపై ప్రజలు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 103 బ్లాక్స్పాట్లు (ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు) ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వీటి మరమ్మతులు, నిర్వహణపై జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, ఇతరత్రా విభాగాలతో జరిగిన సమావేశంలో చర్చించారు. రోడ్డు మధ్యలో డివైడర్ల ఎత్తును పెంచడంతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చూడాలని నిర్ణయించారు. మరోవైపు ప్రమాదాలకు ప్రధాన కారణాలను కూడా పోలీసులు గుర్తించారు.ప్రమాదాలకు ప్రధాన కారణాలు» జాతీయ రహదారులపై డ్రైవర్లు 15–18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం. » హైవేలపై లైనింగ్ నిబంధన పాటించకపోవడం. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడం. » రాత్రివేళ సరైన నిద్రలేకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం. » హైవేలపై కేటాయించిన స్థలంలో కాకుండా రోడ్డు మధ్యలో వాహనాలను నిలపడం. » పాదచారులు జాతీయ రహదారులపై లైట్లు లేని ప్రాంతంలో రోడ్లను దాటుతుండటం.భవిష్యత్తు అంధకారమే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపడంతో పాటు ఇతరుల మరణానికి కారణం అయితే చేజేతులా భవిష్యత్తును అంధకారం చేసుకున్నట్లే. మోటార్ వాహన చట్టం (ఎంవీ) కేసులలో పోలీసులు న్యాయస్థానాల్లో సమర్పిస్తున్న అభియోగపత్రాల ఆధారంగానే ఉల్లంఘనల విషయంలో చర్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే ఉన్న ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ అవకాశాల సమయంలో విద్యార్థులు, యువకులను ఈ కేసులు ఇబ్బంది పెడతాయి. – వి.శ్రీనివాసులు, డీసీపీ, ట్రాఫిక్, రాచకొండ -
Hyderabad: రాంగ్‌సైడ్, ట్రిపుల్ రైడింగ్‌కు ఇక బాదుడే
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాంగ్ సైడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులకు కళ్లెం వేసేందుకు సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. వ్యతిరేక దిశలో వాహనాలను నడిపితే సెక్షన్ 119/177, 184 కింద రూ.1,700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200 జరిమానా విధించనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 2020లో 15 మంది, 2021లో 21 మంది, ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 15 మంది, ట్రిపుల్ రైండిగ్ కారణంగా 2020లో 24 మంది, గతేడాది 15 మంది, గత నెలాఖరు వరకు 8 మంది మరణించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని, అందుకే స్పెషల్ డ్రైవ్‌లను చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: (కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ) -
ఎదురేమొచ్చినా తగ్గేదేలే! రాంగ్ రూట్లో రయ్.. రయ్!
‘కరీంనగర్ పట్టణంలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ లెక్చరర్ పాపారావు దంపతులు ఈనెల 12న పనినిమిత్తం హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద రాంగ్రూట్లో వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. పాపారావు దంపతులతో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.’ ‘కరీంనగర్‌లోని ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం భోజనం చేసేందుకు బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. కోతిరాంపూర్ సమీపంలో రాంగ్రూట్లో వస్తున్న మరో బైక్ ఇతడిని ఢీకొట్టింది. లక్ష్మణ్ తలకు తీవ్రగాయం కాగా.. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.’ కరీంనగర్‌క్రైం: నిబంధనలు పాటించండి.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండంటూ ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పురావడం లేదు. రాంగ్రూట్లో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుండడంతో ఎదురుగా వచ్చేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి. రద్దీగా ఉండే కరీంనగర్ సిటీతో పాటు వేగంగా వాహనాలు దూసుకొచ్చే హైవేల పైనసైతం రాంగ్రూట్లలో వెళ్తూ ప్రాణాలు తీస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని చీకటిమయం చేస్తుండగా పోలీసులు, రవా ణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పురావడం లేదు. కరీంనగర్ పట్టణంలో రాంగ్‌రూట్ ప్రాంతాలు ► కల్పన హోటల్ నుంచి ఎస్బీఐ కమాన్ బ్రాంచ్ వైపు ► పోచమ్మవాడ నుంచి కమాన్ వైపు ► కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ► విద్యుత్ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో ఎస్సారార్ కళాశాల సమీపంలో ► బైపాస్ ఎన్టీఆర్ చౌరస్తా ► ఆదర్శనగర్ బోర్డు నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు ► రాంనగర్ చౌరస్తా.. మంకమ్మతోట ► తెలంగాణ చౌక్ ప్రాంతం (పోలీసులు మొత్తం 12 రాంగ్‌రూట్ ప్రాంతాలను గుర్తించారు) నగరంలో యథేచ్ఛగా.. కొన్నాళ్లక్రితం వరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటుచేసి పలు కూడళ్లవద్ద రాంగ్రూట్లలో వెళ్లేవారిపై నిఘాపెట్టేవారు. రాంగ్రూట్లలో వెళ్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించేవారికి ఈ– చలాన్లు విధించేవారు. ఇప్పటికీ పలుచోట్ల ఈ పద్ధతి అమలు చేస్తున్నా.. చాలా వరకు కూడళ్ల వద్ద పోలీసు నిఘా కనిపించని పరిస్థితి నెలకొంది. 12 కూడళ్ల వద్ద రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. రాజామెస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, కోతిరాంపూర్‌లో, పోచమ్మవాడ నుంచి కమాన్‌వైపు, కల్పన హోటల్ నుంచి కమాన్ ఎస్బీఐ బ్యాంకు వైపు రాంగ్రూట్లో ఎక్కువగా వెళ్తున్నారు. అదే విధంగా మంకమ్మతోట, గీతాభవన్, విద్యుత్‌శాఖ కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుండగా.. సిటీలో మరణాలు తక్కువే. ఇక మెయిన్రోడ్లపై కూడా రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ జాతీయరహదారిపై రాంగ్రూట్లో ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. కాకతీయ కాలువ, ఇంజినీరింగ్ కళాశాలలు, తిమ్మాపూర్ నుంచి మొదలుకుని నుస్తులాపూర్ వరకు కూడా పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రూట్లో రాంగ్‌రూట్ మరణాలు సైతం ఎక్కువే. నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన డివైడర్లను రాకపోకలకు అనుగుణంగా మార్చాలని, తద్వారా రాంగ్‌రూట్ ఇబ్బంది ఉండదని సిటీ ప్రజలు అంటుండగా.. రాంగ్రూట్లో వెళ్లే వాహనాలపై నిఘా పెడుతున్నామని, నిత్యం జరిమానా విధిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాంగ్‌రూట్.. వెరీ డేంజర్ రాంగ్రూట్లో వెళ్లకుండా పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా తీరుమారడం లేదు. రోజురోజుకు రాంగ్రూట్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ రెండు,మూడు నెలల్లోనే రాంగ్‌రూట్ ప్రమాదాలు జిల్లాలో 20కి పైగా చోటుచేసుకున్నాయి. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. యువత మద్యం మత్తులో రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కరీంనగర్ సిటీతో పాట జిల్లావ్యాప్తంగా రాంగ్రూట్లో వెళ్లేప్రాంతాలను పోలీసులు, రవాణా అధికారులు గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అడ్డుకున్న పోలీసును చితకబాదారు..!
పట్నా : ఆటవిక రాజ్యం అని గతంలో పేరుపడ్డ బిహార్‌లో మళ్లీ అలాంటి పరిస్థితులే దాపురించాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ రక్షకభటులకే రక్షణ లేకుండా పోయింది. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తున్న ఆటోవాలాను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న ఓ పోలీసుపై రౌడీయిజం చేశారు. ఆటోవాలా అతని స్నేహితులు దుర్భాషలాడుతూ సదరు పోలీస్ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్‌లోని అఘోరియా చౌక్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రౌడీ మూక తాట తీసేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. -
ఫ్యాషన్ డిజైనర్ నిర్లక్ష్యం.. లగ్జరీ కారుతో దారుణం!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యంగా రాంగ్‌సైడ్‌లో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఓ యువతి. లగ్జరీ ఎస్‌యూవీని కారు అడ్డదిడ్డంగా నడుపుతూ.. ఓ మహిళ ఢీకొట్టి తొక్కించేసింది. దీంతో ప్రమాదస్థలిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా అగర్వాల్ లగ్జరీ ఎస్యూవీ (స్పోర్ట్ష్ యుటిలిటీ వెహికల్) కారును రాంగ్రూట్లో నడుపుతూ.. ఫూల్వతి అనే 50 ఏళ్ల మహిళను ఢీకొట్టింది. ఆదివారం రాత్రి శివాజీ స్టేడియం బస్ టెర్మినల్ వద్ద గల ఓ రెస్టారెంట్ ముందు ఫూల్వతి నిల్చుని ఉండగా.. అజాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ఆమెపైకి శ్రేయ దూసుకుపోయింది. ఆమెను ఢీకొట్టడమే కాకుండా.. దాదాపు 300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఫూల్వతి అక్కడిక్కడే మృతిచెందారు. దగ్గరలోని చెక్ పోస్టు వద్ద విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు విషయాన్ని గ్రహించి నిందితురాలిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశామని వెల్లడించారు. -
రాంగ్రూట్లో వెళ్లద్దన్నాడని.. టెకీని పొడిచేశారు!
అతడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నది అతడి ఉద్దేశం. కానీ అదే అతడికి ముప్పు తెచ్చిపెట్టింది. పుణె నగరంలో ఎప్పుడూ బిజీగా ఉండే ఫెర్గూసన్ కాలేజి రోడ్డులో రాంగ్రూట్లో వెళ్లనని చెప్పినందుకు అతడిని ఓ మోటారు సైక్లిస్టు కత్తితో పొడిచేశాడు. ఊపిరితిత్తుల దిగువ భాగంలో కత్తిపోట్లు దిగిన అతడిని స్నేహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కత్తి పోటు ఏమాత్రం కాస్త పక్కకు దిగినా అతడి ప్రాణాలు పోయేవని, అదృష్టవశాత్తు బతికాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆసక్తి చూపించకపోయినా, పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే కత్తితో పొడిచిన మోటారు సైక్లిస్టు అక్కడినుంచి పరారయ్యాడు. దాడికి గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంటుకు డిన్నర్‌కు వచ్చాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వాళ్లు బయటకు వచ్చి, రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో రాంగ్రూట్లో వస్తున్న ఓ మోటారు సైక్లిస్టు వీళ్లతో గొడవ పడ్డాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పాడని, దాంతో అతడ కొంతదూరంలో ఆగి మళ్లీ వెనక్కి వచ్చి, ఇతడిని పొట్టలో కత్తితో పొడిచేశాడని ఎస్ఐ రాహుల్ కలంబికర్ చెప్పారు. అప్పటికి పక్కనున్న స్నేహితులు అతడు ఊరికే కొట్టాడని అనుకున్నారు. బాధితుడు కొంతదూరం వరకు గాయాల మీద చేత్తో పట్టుకుని వెళ్లాడు. వీధిలైట్ల కిందకు వెళ్లిన తర్వాత అప్పుడు మిగిలిన స్నేహితులు రక్తం చూసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.