
పట్నా : ఆటవిక రాజ్యం అని గతంలో పేరుపడ్డ బిహార్‌లో మళ్లీ అలాంటి పరిస్థితులే దాపురించాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ రక్షకభటులకే రక్షణ లేకుండా పోయింది. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తున్న ఆటోవాలాను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న ఓ పోలీసుపై రౌడీయిజం చేశారు. ఆటోవాలా అతని స్నేహితులు దుర్భాషలాడుతూ సదరు పోలీస్ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్‌లోని అఘోరియా చౌక్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రౌడీ మూక తాట తీసేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment