
వాహనదారునికి నమస్కరిస్తున్న ఎస్‌ఐ కృష్ణయ్య
చిత్తూరు, మదనపల్లె క్రైం: బాబూ...మీకు నమష్కారం. తలకు హెల్మెట్ లేదు.. ద్విచక్ర వాహనంలో ముగ్గురు పిల్లలు, భార్యతో వెళ్తున్నావు. జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబమే పోతుంది..ఆ విషయాన్ని గుర్తించి నడుచుకోండి..రోడ్డు నిబంధనలు పాటించండి.. అంటూ మదనపల్లె టూటౌన్ ఎస్‌ఐ కృష్ణయ్య పరిమితికి మించి వెళుతున్న వాహనదారులను వేడుకున్నారు. నిమ్మనపల్లె సర్కిల్‌లో వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనంలో ఐదుగురు ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించారు. వారికి రెండు చేతులతో నమస్కరించి ‘ఇలా అయితే ప్రమాదాలు జరగవా’ అంటూ చిన్నపాటి విజ్ఞాపనతో కూడిన క్లాసు తీసుకున్నారు.