
ఎస్‌ఐ దాడిలో గాయపడిన గణేష్
పుంగనూరు: యూనిఫాం ధరించలేదని డ్రైవర్‌ను ఎస్‌ఐ చితకబాదిన సంఘటన ఆదివారం చౌడేపల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా మారడంతో రహస్యంగా మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్లారు. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లి ఎస్‌ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది ఆదివారం చౌడేపల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సోమలకు చెందిన చలపతి కుమారుడు గణేష్ (32) బొలేరో లగేజీ వాహనంలో టమాటాలను చౌడేపల్లె మీదుగా పుంగనూరుకు తరలిస్తున్నాడు.
పోలీసులు అతన్ని ఆపి రికార్డులు పరిశీలించారు. ఎస్‌ఐ వద్దకు వెళ్లి రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ తెలిపారు. డ్రైవర్ యూ నిఫాం ధరించకపోవడాన్ని గమనించిన ఎస్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గణేష్‌ను చితకబాదాడు. అనంతరం రూ.135 జరిమానా విధించాడు. కొద్ది సేపటికి డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు రహస్యంగా పుంగనూరు, మదనపల్లె లోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మైరుగైన వైద్యంకోసం తిరుపతి తీసుకెళ్లారు. అస్వస్థతకులోనైన గణేష్‌కు పుంగనూరు సీఐ సాయినాథ్, డీఎస్పీ చౌడేశ్వరి రహస్యంగా వైద్య సేవలందించడం గమనార్హం.
ఎస్‌ఐ సస్పెన్షన్
డ్రైవర్‌ను చితకబాదిన ఎస్‌ఐ కృష్ణయ్యను సస్పెండ్‌చేస్తూ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివా రం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డీఎస్పీ ఆధ్వర్యంలో కమిటీని నియ మించి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.