సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా నెల రోజులు సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు.
కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు జరగడం తెలిసిందే. దీనికి తోడు గ్రూప్-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: జన్వాడ రేవ్‌పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment