TS: పబ్స్‌, హోటళ్లు, క్లబ్‌లు ఇయర్‌ గైడ్‌ లైన్స్‌ పాటించాలి | DGP Mahender Reddy Talk On New Year 2022 Covid Restrictions | Sakshi
Sakshi News home page

TS: పబ్స్‌, హోటళ్లు, క్లబ్‌లు ఇయర్‌ గైడ్‌ లైన్స్‌ పాటించాలి

Published Thu, Dec 30 2021 2:25 PM | Last Updated on Thu, Dec 30 2021 5:07 PM

DGP Mahender Reddy Talk On New Year 2022 Covid Restrictions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ.. తెలంగాణలో పబ్స్‌, హోటళ్లు, క్లబ్‌లకు న్యూఇయర్‌ గైడ్‌ లైన్స్‌ పాటించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యూ ఇయర్‌ ఆంక్షలు అమలు అవుతాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలను అమలుచేయాలని పోలీసులుకు సూచించారు. న్యూఇయర్‌ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని తెలిపారు.

కోవిడ్ నిబంధనల్లో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని డీజీపీ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కరోనా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరించి డ్యూటీ చేయాలని తెలిపారు. పబ్బులు, ఈవెంట్లపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని డీజీపీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement