సాధారణంగా కొన్ని రకాల మందులు, భద్రతా కారణాల రీత్యా ఆటో కంపెనీలు, లేదా ఫుడ్ ఉత్పతుల రీకాల్‌ను చూస్తుంటాం. కానీ రేజర్లు రీకాల్స్ చేయడం చాలా అరుదు. అయితే షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ దిగ్గజ సంస్థ జిల్లెట్ తాజాగా భారీ సంఖ్యలో రేజర్లను రీకాల్ చేస్తోంది. మరీ పదునుగా ఉన్నాయనీ, తద్వారా తెగి పోవడం, లోతైన గాయం అయ్యే అవకాశం ఉందంటూ రెండు ఉత్సత్తులను వెనక్కి తీసుకుంటోంది. వీనస్ సింప్లీ 3 డిస్పోజబుల్ రేజర్ 4-ప్యాక్, డైసీ క్లాసిక్ 12 + 1 వీనస్ సింప్లీ 3 బోనస్ ప్యాక్ ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.
మరీ ఎక్కువ షార్ప్‌గా ఉన్నాయంటూ 87వేల డిస్పోజబుల్ రేజర్లను జిల్లెట్ రీకాల్ చేస్తోంది. తయారీలో లోపం కారణంగా రేజర్‌లోని బ్లేడ్‌ల అమరిక తప్పుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మే నెలల మధ్య విక్రయించిన ఉత్పత్తులు ప్రభావితమయ్యాయని వాటిని వెనక్కి తీసుకుంటామని తెలిపింది. ఈ రేజర్‌లను ఉపయోగించడాన్ని వెంటనే ఆపివేసి, వాటిని జిల్లెట్‌కు అందించి రీప్లేస్‌మెంట్ వోచర్ తీసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. లక్షలాది మంది మహిళల భద్రత, వారి విశ్వాసమే తమకు ముఖ్యమని జిల్లెట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు జిల్లెట్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment