అన్ని మారుతీ ఆల్టో కార్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ | Maruti Suzuki Alto 800 And Alto K10 Get Optional Driver's Airbag On All Trims | Sakshi
Sakshi News home page

అన్ని మారుతీ ఆల్టో కార్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్

Published Fri, Jan 15 2016 1:53 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

అన్ని మారుతీ ఆల్టో కార్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ - Sakshi

అన్ని మారుతీ ఆల్టో కార్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఆల్టో 800, ఆల్టో కే10 మోడళ్లలో అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్ ఆప్షన్‌ను అందిస్తోంది.  డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఉన్న ఆల్టో 800 వేరియంట్ల ధర రూ.2.62 లక్షల నుంచి రూ.3.78 లక్షల రేంజ్‌లో ఉంటాయని మారుతీ సుజుకీ కంపెనీ తెలిపింది. అలాగే ఇదే ఆప్షన్ ఉన్న ఆల్టో కే10 వేరియంట్ల ధర రూ.3.45 లక్షల నుంచి రూ.4.08 లక్షల రేంజ్‌లో(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్‌ల వల్ల కార్ల యజమానులందరూ తమ కార్లు మరింత భద్రంగా ఉంటాయని భావిస్తారని  పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement