న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2029–30 నాటికి భారత్‌లో ఆరు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఆ సమయానికి మొత్తం మోడళ్లలో ఈవీల వాటా 15 శాతం ఉంటుందని వెల్లడించింది.
ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలు 60 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ 25 శాతం ఉంటాయని తెలిపింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ 2025లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది.
చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!
Comments
Please login to add a commentAdd a comment