దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ 700 అమ్మకాల్లో దుమ్ము లేపుతోంది. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన బుకింగ్స్‌లో కొనుగోలు దారులు కేవలం రెండు రోజుల్లో 70వేల వెహిక్సల్‌ను బుక్ చేసుకోగా.. ఇప్పుడా వెహికల్ బుక్ చేసుకుంటే డెలివరీ అయ్యేందుకు మరో రెండేళ్ల వరకు ఎదురు చూడాల్సి ఉంది.
ఎస్. మీరు చదివేది నిజమే. మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను ఈరోజు బుక్ చేసుకుంటే డెలివరీ 2024కి అవుతుంది. నివేదిక ప్రకారం..ఏఎక్స్7ఎల్ వేరియంట్ వెహికల్ వేటింగ్ పిరియడ్ రెండేళ్లు.
►ఏఎక్స్ 7 ట్రిమ్ వెహికల్ బుక్ చేసుకుంటే 20నెలల తర్వాత డెలివరీ అవుతుంది.
►ఏక్స్5 వేరియంట్ పెట్రోల్ వెహికల్ డెలివరీ అయ్యేందుకు 5నెలల సమయం పట్టనుంది. అదే డీజిల్ వెహికల్ అయితే 11నెలల సమయం పట్టనుంది.
►ఏఎక్స్3 ట్రిమ్‌తో పాటు ఏఎక్స్ 5 వేరియంట్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఒకేసారి డెలివరీ కానున్నాయి.
►చిప్‌షార్టేజ్, సప్లయ్ చైన్ క్రైసిస్, ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కోవిడ్, మార్కెట్‌లో ఈకారుకున్న డిమాండ్ వంటి ఇతర కారణాల ఎక్స్‌యూవీ 700ను డెలివరీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్, హోందాయ్ క్రెటా కోసం ఎదురు చూడాల్సి ఉంది.
చదవండి👉 నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment